Posts

Showing posts from October, 2021

పత్తి ధరలకు లభిస్తున్న మద్దతు

Image
  18-10-2021 ఈ ఏడాది పంజాబ్లో పత్తి సేద్యం భారీగా విస్తరించినప్పటికీ కీటక సంక్రమణం వలన ఉత్పత్తి కొరవడుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. తద్వారా కనీస మద్దతు ధర ప్రతి క్వింటాలు రూ. 5925 అధిగమించి రూ. 7700 కు చేరింది. భారత పత్తి సంస్థ (సిసిఐ) మరియు భారత పత్తి సమాఖ్య లిమిటెడ్ (ఐసిఎఎల్) వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఉత్తరాది రాష్ట్రాలలో మొత్తం పత్తి సేద్యం 17.96 ల.హె. నుండి తగ్గి 16.99 ల.హె.కు పరిమితమైంది. ఇందులో పంజాబ్లో 52 వేల హెక్టార్లు వృద్ధి చెంది 3.03 ల.హె., హర్యాణాలో 49 వేల హెక్టార్లు తగ్గి 6.88 ల.హె., రాజస్తాన్లో 1 ల.హె. తగ్గి 7.08 ల.హె., గుజరాత్లో ఎగువ ప్రాంతంలో 3.44 ల.హె. మరియు దిగువ ప్రాంతంలో 6.64 ల.హె.కు విస్తరించింది.

తగ్గిన యాలకుల రాబడులు - ధరల వివరాలు

Image
  18-10-2021 గత వారం దక్షిణాది రాష్ట్రాలలోని వేలం కేంద్రాల వద్ద దసరా పండుగ వలన మసాలా బోర్డు వద్ద నాలుగు రోజులు మాత్రమే వేలాలు నిర్వహించబడ్డాయి. ఇందులో 3,90,697 కిలోలు సరుకు రాబడిపై ధరలు చౌకగా ఉన్నందున రాబడి అయిన సరుకులో 13-14 వేల కిలోలు మాత్రమే అమ్మకం కాలేదు.యాలకుల పంట కోతల ప్రక్రియ కొనసాగుతున్నది. గత వారం కేరళలోని పలు జిల్లాలలో కుండపోత వర్షాలు కురిసినందున పంట కోతలకు జాప్యం ఏర్పడింది. 

సోయా చిక్కుడుకు మందగమనం ముగిసినట్లే

Image
  18-10-2021 అక్టోబర్ 25 తర్వాత దేశంలోని అన్ని ఉత్పాదక రాష్ట్రాలలో సోయాచిక్కుడు రాబడులు  పోటెత్తనున్నాయని తెలుస్తోంది. సోయాచిక్కుడు సేద్యం విస్తృతంగా చేపట్టినప్పటికీ ఉత్పత్తి తగ్గగలదని కేంద్ర ప్రభుత్వం మరియు కొందరు నూనెగింజల వ్యాపారులు అంచనా వ్యక్తమవుతున్నది.  ఎందుకనగా, కొన్ని ప్రాంతాలలో కుండపోత వర్షాలు మరికొన్ని ప్రాంతాలలో వర్షాల లేమితో పంటకు నష్టం వాటిల్లడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే, కేంద్ర ప్రభుత్వం పెరుగుతున్న వంటనూనెల ధరలను దృష్టిలో పెట్టుకొని కొన్నింటిపై దిగుమతి సుంకం ఎత్తివేయగా రిఫైండ్ నూనెలపై తగ్గించింది. ప్రస్తుతం క్రషింగ్ మిల్లులకు సాధారణ కొనుగోళ్లు ప్లాంట్ డెలివరి ధర తగ్గి రూ.5200-5400 వద్ద కదలాడుతున్నది. తద్వారా ధర గరిష్ఠంగా రూ. 200-300 తగ్గే అవకాశం ఉంది. తత్ఫలితంగా సోయాచిక్కుడు ధరలకు మందగమన ఛాయలు తొలగినట్లేనని భావించవచ్చు. 

రబీ సీజన్లో విస్తృతంగా "ఆవాల" సాగు

Image
  18-10-2021 ఆవాలకు గిట్టుబాటవుతున్న లాభసాటి ధరలు, సానుకూల వాతావరణం వలన రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రముఖ ఆవాల ఉత్పాదక రాష్ట్రాలలో రైతులు రబీ సీజన్ కోసం ఆవాల సేద్యం విస్తృతంగా చేపట్టే అవకాశం కనిపిస్తున్నది. ఎందుకనగా, గోధుమ మరియు శనగ స్థానంలో ఆవాల సేద్యం చేట్టడానికి అత్యంత అనుకూలంగా ఉండడమే ఇందుకు నిదర్శనం. 

పసుపు అమ్మకాలకు సిద్దమవుతున్న స్టాకిస్టులు - గత వారం మార్కెట్ ధరలు

Image
  18-10-2021 అన్ని ఉత్పాదక కేంద్రాలలో భారీగా పసుపు నిల్వలు ఉన్నందున మరియు మార్కెట్లో గిరాకీ తక్కువగా ఉన్నందున ధరల పెరుగుదలకు అవకాశాలు సమాప్తమయ్యాయి. జనవరి మొదటి వారంలో మిగులు నిల్వలు మరియు కొత్త సీజన్లో ఉత్పత్తి కలిసి 2022 డిసెంబర్ వరకు వినియోగంతో పోలిస్తే అధికంగా ఉండే అవకాశమున్నందున చిన్న స్టాకిస్టులు బయట పడడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

పెసలు ధరలు పెరిగే అవకాశం - గత వారం మార్కెట్ ధరలు

Image
  18-10-2021 దేశంలో ప్రముఖ పెసల ఉత్పాదక రాష్ట్రమైన రాజస్తాన్లో ఈ ఏడాది పెసల ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే తగ్గింది. అయితే, ఉత్పాదకులకు మద్దతు ధర ప్రతి క్వింటాలు రూ.7275 కు గాను రూ. 5000 -6600 నాణ్యతానుసారం లభ్యమవుతున్నది. తద్వారా రాజస్తాన్ ప్రభుత్వం నవంబర్ 1 నుండి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 357 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నది.

దేశంలో ఊపందుకున్న కొత్త వేరుశనగ రాబడులు - గత వారం మార్కెట్ ధరలు

Image
  18-10-2021 దేశంలోని ప్రముఖ వేరుశనగ ఉత్పాదక రాష్ట్రాలలో కొత్త సరుకు రాబడులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం  రాజస్థాన్ లోని బికనీర్, జోధ్ పూర్ ప్రాంతాలలో వారంలో 70-80 వేల బస్తాలు,  ఆంధ్ర, కర్నాటకలలో 75-80 వేల బస్తాలు,  గుజరాత్ లక్ష బస్తాలు,  ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో దినసరి 20-25 వేల బస్తాలు, మౌరానీపూర్, కరేలీ, మహోబా, ఛత్తర్పూర్ ప్రాంతాలలో 70-80 వేల బస్తాలు సహా దాదాపు లక్ష బస్తాల రాబడిపై 7-8 శాతం తేమ మరియు 65-70శాతం గింజ కండీషన్ సరుకు రూ. 4500-5000 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమయింది.

మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర లలో నవంబర్ నుండి పోటెత్తనున్న కొత్త మిరప

Image
18-10-2021  వ్యాపారస్తుల కథనం ప్రకారం నవంబర్ మొదటి మొదటివారం నుండి మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో రాబడులు పెరిగే అవకాశం కలదు. దీనితో ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడింది. ఎందుకనగా, అధిక నిల్వలు ఉన్నప్పటికీ స్టాకిస్టులు నెమ్మదిగా విక్రయిస్తున్నారు.

మినుము కొనుగోళ్లు పెరిగే అవకాశం - గత వారం మార్కెట్ ధరలు

Image
  18-10-2021 గత వారం దక్షిణాది రాష్ట్రాలలో దసరా పండుగ గిరాకీ ముగిసినందున పప్పు కోసం గిరాకీ కొరవడినందున మిల్లర్లు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు మినుములు కొనుగోలు చేస్తున్నందున ధరలు నిలకడగా మారాయి. అయితే, తమిళనాడు ప్రభుత్వం రైతుల నుండి మినుములు, పెసలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించడంతో ధరలు మందగించే అవకాశం లేదు. 

గిరాకీ లేని చింతపండు - ధరలు తగ్గుముఖం

Image
  13-10-2021 దక్షిణాది రాష్ట్రాలలో గత వారంతో పోలిస్తే ప్రస్తుతం చింతపండుకు గిరాకీ కొరవడినందున ధరలు స్తంభించాయి. దసరా పండుగ తర్వాత కొనుగోళ్లు ఊపందుకోగలవని వ్యాపారులు భావిస్తున్నారు. అయితే, స్టాకిస్టు వ్యాపారుల తమ నిల్వలు సరుకు శరవేగంతో విక్రయిస్తున్నందున ధరలపై ఒత్తిడి పెరుగుతున్నది. 

పత్తి రాబడులు పెరిగే అవకాశం - ఎగుమతికి డిమాండ్

Image
  13-10-2021 పత్తి వ్యాపారులు అన్ని విధాల ఆలోచించి సరుకు నిల్వ చేసే పరిస్థితి కనిపిస్తున్నది. ఎందుకనగా, 2021-22 సీజన్ కోసం దేశంలో రబీ, యాసంగి పంటల ఉత్పత్తి పెరగడంతో పాటు మద్దతు ధర రూ. 5726 కంటే మార్కెట్ ధరలు అధికంగా ఉన్నందున 2022-23 లో కూడా రికార్డు ఉత్పత్తికి అవకాశం కలదు.

సిరులు కురిపిస్తున్న టమాటా 🍅

Image
  13-10-2021 మదనపల్లె మార్కెట్లో టమాటా కిలో రూ.46   టమాటా సిరులు కురిపిస్తోంది. మంగళవారం చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్లో గరిష్ఠంగా కిలో రూ.46 వరకు పలికింది. అత్యల్పంగా కిలో రూ.10 చొప్పున కొనుగోలు చేశారు. 266 టన్నుల సరుకు రాగా.. సగటున రైతులకు కిలోకు రూ.21 నుంచి రూ.39 వరకు లభించింది. సరకు రాక పెరగడంతో ధర స్వల్పంగా తగ్గింది. రెండు రోజుల కిందట గరిష్ఠ ధర రూ.50 వరకు ఉండగా.. మంగళవారం రూ.4 తగ్గింది.

పసుపు ధరలు పెరిగే అవకాశం లేనట్లే, పెరుగుతున్న స్టాకిస్టుల అమ్మకాలు - గత వారం మార్కెట్ ధరలు

Image
  12-10-2021 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 80 వేల బస్తాలకు పెగా పసుపు అమ్మకం కోసం టెండర్ జారీ చేసింది. అయితే మార్కెట్లో గిరాకీ తక్కువగా ఉన్నందున కేవలం 200 టన్నుల రూ. 5200 ధరతో అమ్మకమెంది. ప్రస్తుత వర్షాల నేపథ్యంలో పంట పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే స్టాకిస్టుల అమ్మకాలు పెరిగే అవకాశం కలదు. ఎందుకనగా వచ్చే ఏడాది కూడా ధరలు పెరిగే అవకాశం లేదని వీరు అంచనా వేస్తున్నారు.

దక్షిణాదిలో మినుముకి పెరుగుతున్న డిమాండ్- గత వారం మార్కెట్ ధరలు

Image
12-10-2021 అంతర్జాతీయ మార్కెట్లో మయన్మార్ ఎఫ్ఎక్యూ 950 డాలర్లు, ఎస్ క్యూ 30 డాలర్లు పెరిగి 1100 డాలర్లు ప్రతి టన్ను ప్రతిపాదించబడింది. అయితే దక్షిణ భారత పప్పు మిల్లర్లు ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రాంతాల నుండి కొత్త సరుకు కొనుగోలు చేస్తున్నారు. ఎందుకనగా, కొత్త సరుకులో జిగురు అధికంగా ఉండడంతో పాటు తీపిదనం ఉండడం వలన అల్పాహారం తయారీదారుల కోసం అమ్మకాలు అధికంగా ఉంటాయి. ఈ ఏడాది దేశంలోని ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలలో సరుకు క్వాలిటీ డ్యామేజ్ అయింది.

దేశంలో సమృద్ధిగా శనగ నిల్వలు - గత వారం మార్కెట్ ధరలు

Image
  12-10-2021 దేశంలోని ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలలో భారీగా శనగల నిల్వలు ఉన్నాయి. దీపావళి పండుగ డిమాండ్ కోసం కేవలం ఒకనెల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం అనుకూల వర్షాల నేపథ్యంలో విస్తీర్ణం మరియు దిగుబడి పెరిగే అవకాశం ఉన్నందున స్టాకిస్టులు నిరాశకు గురవుతున్నారు. ఎందుకనగా భవిష్యత్తులో ధరల పెరుగుదలకు అవకాశం కనిపించడం లేదు.

తెలంగాణ లో వరికి ప్రత్యామ్నయంగా నువ్వుల సేద్యం సాధ్యమేనా

Image
  12-10-2021 రాష్ట్రంలో పండించే మొత్తం పంటను కొనుగోలు చేయడం సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర సర్కారు స్పష్టమైన సంకేతాలిచ్చింది. తద్వారా యాసంగి వరి స్థానంలో నువ్వులు లాంటి ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం రైతులకు సలహా ఇస్తోంది. ఇందుకోసం రైతులకు అవగాహన పెంపొందించేందుకు వ్యవసాయ అధికారులు సన్నద్ధమవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో వేరుసెనగ పంటకు నష్టం - ఉత్తప్రదేశ్, రాజస్థాన్ లలో మొదలైన కొత్త వేరుసెనగ రాబడులు - గత వారం ధరలు

Image
  12-10-2021 ఆంధ్రప్రదేశ్ లో వేరుసెనగ పంటకు నష్టం ఈ ఏడాది రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు మరియు కడప జిల్లాలలో గతి తప్పిన వర్షాల వలన వేరుసెనగ సేద్యం గత ఏడాదితో పోలిస్తే 7,29,377 హెక్టార్ల నుండి 1,01,437 హెక్టార్లు తగ్గి 6,27,940 పరిమితమైంది.

మధ్యప్రదేశ్ లో పెరిగిన కొత్త మిరప రాబడి - గత వారం మార్కెట్ ధరలు

Image
  11-10-2021 గుంటూరు మార్కెట్లో గత వారంలో కోల్డుస్టోరేజీల నుండి 5 లక్షల బస్తాలు మరియు హిందూపూర్లో దాదాపు 1500 బస్తాల కొత్త సరకు రాబడితో పాటు మధ్యప్రదేశ్లో 25-27 వేల బస్తాల కొత్తసరుకు రాబడి కాగా, మరో 15 రోజులలో కర్నాటకలో కొత్త సరుకు రాబదులు పెరిగే అవకాశం ఉన్నందున స్టాకిస్టులు సాధ్యమైనంత త్వరగా బయటపడాలని చూస్తున్నారు. దీనితో ధరల పెరుగదల పరిస్థితి సమాప్తమయింది. 

రబీ వరిలో విత్తనాల ఎంపిక - దిగుబడి పెంచే సూచనలు

Image
09-10-2021 తెలుగు రాష్ట్రాల్లో 60 శాతానికి పైగా రైతాంగం వరి పంటనే ప్రధాన ఖరీఫ్, రబీలలో పండిస్తారు. ఖరీఫ్ తో పోల్చితే రబీలో నీటివనరులు తక్కువగా ఉండటం, నిర్దిష్ట వాతావరణ పరిస్థితులుండటం, స్వల్పకాలంలోనే అధిక దిగుబడులు సాధించడం జరుగుతుంది. ఒక వరి రకం పూర్తిస్థాయి దిగుబడులు సాధించే అవకాశం రబీలోనే ఉంటుంది. రబీలో 50-60 బస్తాల దిగుబడులు సాధిస్తున్నప్పటికీ సకాలంలో సరైన యాజమాన్య పద్ధతులను అవలంబిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు ఏ రకంగా సాధించవచ్చో తెలుసుకుందాం.

గ్రీన్ హౌస్ లలో ఆకుకూరల సాగు - లాభాల పంట

Image
  వాతావరణ పరిస్థితులను స్వల్పంగా లేదా పూర్తిగా నియంత్రించేందుకు సుమారు 200 మైక్రాన్లు లేదా 800 గేజి యు.వి. స్టెబిలైజ్డ్ పాలిథీన్ ఫిల్మ్ సపోర్టింగ్ కట్టడాలతో చేసే నిర్మాణాలను హరితగృహాలు అంటారు.

బెల్లం పొడికి పేటెంట్

Image
జాతీయ స్థాయిలో బెల్లంపై పరిశోధనలు నిర్వహిస్తున్న విశాఖ జిల్లా అనకాపల్లి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల కృషి ఫలించింది. గత రెండు దశాబ్ధలుగా ఇక్కడ బెల్లం పొడిపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. పరిశోధనలు విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇటీవల పేటెంట్ హక్కును ఇచ్చింది. 

వరిలో గట్లు చెక్కే యంత్రం

Image
  భారతదేశంలో వారి ప్రధానమైన ఆహార పంట. రైతులు సుమారు 44 మిలియన్ హెక్టార్లలో సాగుచేసి, 13 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. వరి సాగులో కూలీల కొరత తీవ్రంగా ఉంది.

తెలంగాణ పారబాయిల్డ్ బియ్యం కొనుగోలుకు కేంద్రం సిద్దం

Image
  03-10-2021 కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లాంటి రాష్ట్రాలలో పారబాయిల్డ్ బియ్యానికి తగ్గిన డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో రబీ సీజన్లో కొనుగోలు చేసిన అదనపు సరుకు ఏమి చేయాలోనని దిక్కుతోచని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం కొట్టుమిట్టాడుతున్న తరుణంలో కేంద్రం నుండి తీపి కబురు అందింది. 

తగ్గిన పత్తి సేద్యం - ధరలు పెరిగే అవకాశం

Image
  03-10-2021 ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సెప్టెంబర్ 16 వరకు దేశంలో పత్తి సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 126.97 ల.హె. నుండి తగ్గి 119.66 ల.హె.కు పరిమితమైందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన తమ గణాంకాలలో పేర్కొన్నది. 

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

Image
03-10-2021  రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం. 

ఉత్తర భారత్ లో మొదలైన కొత్త పత్తి

Image
     02-10-2021                దేశంలో 2021-22 ఖరీఫ్ సీజన్ పత్తి ఉత్పత్తి 362.20 లక్షల బేళ్లు ఉండగలదని ప్రభుత్వ వర్గాలు తమ ముందస్తు అంచనాలో పేర్కొనగా, వ్యాపారులు ఇందుకు భిన్నంగా స్పందిస్తూ, హర్యాణాలో పంట కోతల ప్రక్రియ కొనసాగుతున్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటకు నష్టం చేకూరినందున ఉత్పత్తి ప్రభుత్వ అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉందని తమ అభిప్రాయం వెలిబుచ్చారు.