సిరులు కురిపిస్తున్న టమాటా 🍅
13-10-2021 మదనపల్లె మార్కెట్లో టమాటా కిలో రూ.46 టమాటా సిరులు కురిపిస్తోంది. మంగళవారం చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్లో గరిష్ఠంగా కిలో రూ.46 వరకు పలికింది. అత్యల్పంగా కిలో రూ.10 చొప్పున కొనుగోలు చేశారు. 266 టన్నుల సరుకు రాగా.. సగటున రైతులకు కిలోకు రూ.21 నుంచి రూ.39 వరకు లభించింది. సరకు రాక పెరగడంతో ధర స్వల్పంగా తగ్గింది. రెండు రోజుల కిందట గరిష్ఠ ధర రూ.50 వరకు ఉండగా.. మంగళవారం రూ.4 తగ్గింది.