05-12-2021 వ్యాపారస్తుల కథనం ప్రకారం మధ్య ప్రదేశ్లోని అన్ని ఉత్పాదక కేంద్రాలలో కలిసి గతవారం 1.25 లక్షల బస్తాలకు పైగా మిరప రాబడిపై మర ఆడించే యూనిట్ల డిమాండ్తో ధరలు హెచ్చుముఖంలో ఉన్నాయి. ఇందుకు ముఖ్య కారణమేమనగా, ఆంధ్రలో తరచుగా వస్తున్న తుఫానుల నేపథ్యంలో భారీ వర్షాల వలన పంటకు నష్టం చేకూరడంతో పాటు చీడపీడల బెడద వలన దిగుబడి తగ్గే అవకాశం ఉండడంతో పాటు మహారా ష్ట్రలోని బుల్జానా, చిక్లీ, డొండాగాంవ్ ప్రాంతాలలో 15 రోజులలో రాబడులు సమాప్తమయ్యే అవకాశం ఉంది. మరియు నందూర్ బార్, బుర్హాన్పూర్ తదితర ప్రాంతాలు, గుజరాత్లలో భారీ వర్షాల వలన పంటకు నష్టం చేకూరడంతో అలాగే రాబడులు ఆలస్యం కావడంతో మిరప వ్యాపారులు అప్రమత్తమయ్యారు. నాణ్యమైన సరుకు కోసం డిమాండ్ తో పోలిస్తే సరఫరా తక్కువగా ఉండడంతో ధరలు హెచ్చుముఖంలో ఉన్నాయి.