Posts

Showing posts with the label Jaggery

అడుగంటుతున్న బెల్లం నిల్వలు దూసుకుతున్న ధరలు

Image
  దేశంలోని బెల్లం ఉత్పాదక రాష్ట్రాలలో సరుకు తయారీ ప్రక్రియ నత్తనడకేసినందున నిల్వలు గత ఏడాదితో పోలిస్తే క్షీణించాయి. పంచదార ధరలు ఎగబాకుతున్నందున బెల్లం ధరలకు కూడా మద్దతు లభిస్తున్నది. శుభ ముహూర్తాలు ప్రారంభమైనందున బెల్లం అమ్మకాలు జోరందుకున్నాయి.

తగ్గిన బెల్లం రాబడులు - పెరుగుతున్న ధరలు

Image
   దేశంలో శుభ ముహూర్తాలు ప్రారంభమైన వేళ బెల్లం వినియోగం పెరగగలదని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. గత వారం కిరాణా వ్యాపారుల కొనుగోళ్లు ఊపందుకున్నందున నాణ్యమైన రకాల ధర ప్రతి క్వింటాలుకు రూ. 250-300, మీడియం రూ. 75-100 ఎగబాకింది.

బెల్లానికి ఉజ్జ్వల భవిష్యత్తు

Image
 దేశంలో పంచదార ఉత్పత్తి తగ్గినందున ప్రస్తుతం వేసవి తాపం అధికమైన నేపథ్యంలో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున ఏప్రిల్ 2023 నుండి 2024 దీపావళి వరకు 18 నెలల కాల వ్యవధిలో బెల్లం ధరలు తగ్గిన సమయంలో కొనుగోలు చేయడం లాభదాయకంగా ఉండగలదని వ్యాపారులు అంచనా. వేస్తున్నారు. పంచదార ధరలు పెరగడం మరియు రాబోవు పంట ఉత్పత్తి తగ్గే అవకాశం ఉండడంతో పాటు మిల్లులచే చెరకు కొనుగోళ్లు పెరగడం వలన బెల్లం ఉత్పత్తి ప్రభావితం కావచ్చు. 

మందగమనం లో బెల్లం ధరలు

Image
   దేశంలో గణనీయమైన చెరకు ఉత్పత్తి, వచ్చే సీజన్ లో భారత్ నుండి పంచదార ఎగుమతులు కుంటుపడే అవకాశం ఉన్నందున బెల్లం భారీ ఉత్పత్తితో పాటు కొత్త సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభం కానున్నది. ఈ ఏడాది స్టాకిస్టులకు అన్ని సరుకులకు ధీటుగా బెల్లంపై లాభాలు గడించే అవకాశం లేదని చెప్పవచ్చు. ఎడతెరిపి లేకుండా రైతుల సరుకు సరఫరా కావడం వలన పెరుగుతున్న ధరలకు కళ్లెం పడగలదు. స్టాకిస్టులు సరుకు కొనుగోలుకు ఆసక్తి కనబరచరు. 

బెల్లం ధరలకు కొనసాగుతున్న ఒరవడి

Image
  ప్రస్తుతం నెలకొన్న పండుగల సీజన్తో పాటు నిల్వలు శరవేగంతో అడుగంటుతున్నందున గడిచిన హైదరాబాద్ కొన్ని వారాలుగా బెల్లం ధరలు దూసుకుపోతున్నాయి. అయితే, ప్రముఖ బెల్లం ఉత్పాదక ప్రాంతాలలో తయారీ ప్రక్రియ జోరందుకున్నందున రాబడులు పోటెత్తి పెరుగుతున్న ధరలకు కళ్లెం పడగలదని వ్యాపారులు భావిస్తున్నారు.

బెల్లం ధరలు పటిష్టం

Image
   గత వారం కిరాణా వ్యాపారుల డిమాండ్తో ధర రూ. 100-150 ప్రతి క్వింటాలుకు పెరిగింది. ముజఫర్ నగర్ గత వారం 70-75 వేల బస్తాల సరుకు అమ్మకం కాగా, చాకూ బెల్లం రూ. 3200-3500, పాపి రూ. 3150-3200, రస్కట్ రూ. 3100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

రాణిస్తున్న బెల్లం కొనుగోళ్లు

Image
   తెలంగాణలో ప్రారంభమైన బోనాల పండుగ డిమాండు అధిగమించేందుకు దిగ్గజ వ్యాపారులచే బెల్లం కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. దీని తర్వాత గురు పౌర్ణమి మరియు పండుగల సీజన్. తరుముకొస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రైతులు చౌక ధరతో తమ ఉత్పత్తులను విక్రయించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. కావున బెల్లం ధరలపై కమ్ముకున్న మందగమన ఛాయలు : తొలగినట్లేనని వ్యాపారులు భావిస్తున్నారు. గడిచిన రెండు నెలలుగా ధరలు కేవలం 100-150 ఒడిదొడుకుల మధ్య కదలాడుతున్నదని వ్యాపారులు పేర్కొన్నారు.

బెల్లానికి కొరవడిన గిరాకీ - ధరలలో మందగమనం

Image
  వ్యాపారస్తుల కథనం ప్రకారం ఈ ఏడాది వర్షాలు సమయానికి వచ్చే అవకాశం ఉంది. మే చివరి వారం నాటికి వివాహాల సీజన్ సమాప్త మయ్యే అవకాశం కలదు. ముజఫర్ నగర్ కోల్డ్ స్టోరేజీల నుండి సరుకు రవాణా ప్రారంభమయ్యే అవకాశం కలదు. దీనితో ఇతర రాష్ట్రాల స్టాకిస్టులు బయట పడే అవకాశం కలదు. ఎందుకనగా ఇంతవరకు మహారాష్ట్రలో బెల్లం తయారీ అవుతున్నది. మహారాష్ట్రలో వారంలో సుమారు 75-80 లారీల సరుకు రాబడి అవుతుండగా, పౌడర్ యూనిట్ల సరఫరా పెరుగుతున్నది. 

బెల్లం రాబడులు తగ్గడంతో ధరలు పటిష్ఠం

Image
  గత వారం ఉత్పాదక కేంద్రాలలో తీవ్ర ఎండల కారణంగా బెల్లం తయారీకి అవరోధంగా ఉంది. దీనితో మార్కెట్లలో రాబడులు తగ్గడంతో మరియు వివాహాల సీజన్ కోసం కిరాణా వ్యాపారుల డిమాండ్తో ధర రూ. 75-100 వృద్ధి చెందింది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ లోని శీతల గిడ్డంగులలో 18 ఏప్రిల్ నాటికి బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 15,22,172 బస్తాల నుండి 14,757 బస్తాలు తగ్గి 15,07,415 బస్తాలకు పరిమితమయ్యాయి.

గిరాకీ తగ్గడంతో బెల్లం స్థిరం

Image
  దేశంలో వేసవితాపంతో బెల్లానికి గిరాకీ కొరవడింది. అయితే వివాహాల సీజన్ ప్రారంభం కావడంతో వచ్చే వారం నుండి గిరాకీ నెలకొనే అవకాశం ఉంది. అయితే ఉత్తర ప్రదేశ్లోని కోల్డ్ స్టోరేజీల సరుకు కూడా మే 15 తరువాత బయటకు రావడం ప్రారంభం కాగలదు. అంతవరకు మార్కెట్లలో రైతుల సరుకు రాబడి సమాప్తం కావడంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రలలో కూడా బెల్లం తయారీ కార్యక్రమం మందకొడిగా మారుతున్నది. రైతులు ఇంతకు ముందు తయారు చేసిన సరుకును మార్కెట్లకు తరలిస్తున్నందున గత వారం ధరలు స్థిరంగా ఉన్నాయి.

గిరాకీ కొరవడడంతో బెల్లం ధరలు స్థిరం

Image
  గత వారం బెల్లం ఉత్పాదక కేంద్రాల వద్ద ఉగాది సందర్భంగా నాణ్యమైన సరుకుకు డిమాండ్ రావడం వలన ధర రూ. 150-200 వృ ద్ధిచెందగా, ఇతర రకాల ధరలు స్థిరంగా ఉన్నాయి.ముజఫర్నగర్ కోల్డ్ స్టోరేజీలలో నిల్వలు గత ఏడాదితో పోలిస్తే తగ్గాయి.అయితే ఇతర రాష్ట్రాల వ్యాపారులు సీజన్ ప్రారంభంలో సరుకు కొనుగోలు చేసి ఎసిలలో నిల్వ చేసిన సరుకును విక్రయిస్తున్నందున ఉత్పాదక రాష్ట్రాలలో గిరాకీ తక్కువగా ఉంది. అయితే జూలై నుండి పెరుగుదలకు అవకాశం ఉంది.ఎందుకనగా ఇంతవరకు వినియోగ కేంద్రాలలో నిల్వ అయిన సరుకు నుండి 70-75 శాతం అమ్మకం కావచ్చు. మరియు జూలై నుండి నవంబర్ వరకు పండుగల సీజన్లో వినియోగం పెరిగే అవకాశం కలదు.

రాబడులు తగ్గడంతో బెల్లం ధరలు పటిష్ఠం

Image
  మధ్య ప్రదేశ్ లోని కరేళి, నర్సింగాపూర్ ప్రాంతాలలో బెల్లం రాబడులు దాదాపు సమాప్తమయ్యాయి. ఉత్తరప్రదేశ్ నిల్వలు గత ఏడాదితో పోలిస్తే 20 శాతం తగ్గాయి. ఇతర రాష్ట్రాలలో రాబడులు పెరగడం లేదు. కాగా మార్కెట్లకు రాబడి అయిన సరుకు చేతుల మీదనే అమ్మకం అవుతోంది. రాబోవు సీజన్లో చెరకు ఉత్పత్తి తగ్గడం, పంచదార ఎగుమతులు పెరగడం వలన వచ్చే సీజన్లో పంచదార ఉత్పత్తి పెరిగే అవకాశం కలదు. ప్రస్తుతం పండుగల సందర్భంగా కిరాణా వ్యాపారుల కోసం డిమాండ్ రావడంతో ధరలు రూ. 100-125 పెరిగాయి.

గిరాకీ లేక బలపడని బెల్లం ధరలు

Image
  దేశంలోని బెల్లం ఉత్పాదక రాష్ట్రాలలో హోళి పండుగ సందర్భంగా మార్కెట్లు మూసి ఉన్నప్పటికీ, ధరలలో మందగమనం కొనసాగుతున్నది. ఇందుకు ముఖ్య కారణమేమనగా దేశంలోని వినియోగ రాష్ట్రాలలో హోళి పండుగ డిమాండ్ తగ్గింది. అయితే వచ్చేవారం నుండి రాబోవు ఉగాది పండుగ డిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

బెల్లం ఉత్పత్తి తగ్గే అంచనాతో చురుకుగా స్టాకిస్టులు

Image
  లభించిన సమాచారం ప్రకారం ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో పంచదార ధరలు భారీగా పెరగడంతో మనదేశం నుండి పంచదార ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే 60 లక్షల టన్నుల నుండి పెరిగి 70 లక్షల టన్నులకు చేరే అంచనా కలదు. దీనితో సీజన్ చివరలో పంచదార నిల్వలు తగ్గే సూచన కనిపిస్తున్నది. అంతేకాకుండా రాబోవు సీజన్ కోసం మహారాష్ట్ర, కర్నాటక మొదలగు రాష్ట్రాలలో కొందరు రైతులు చెరుకు సాగుకు ఆసక్తి చూపడంలేదు. ఎందుకనగా, ఈ ఏడాది చెరుకు సమయానికి అమ్మకం కాకపోవడంతో ఇంతవరకు పొలాలలో పంట వాడిపోతున్నది. అంతేకాకుండా, ముజఫర్ నగర్ కోల్డుస్టోరేజీలలో నిల్వలు గత ఏడాదితో పోలిస్తే 25 శాతం మేర తగ్గడంతోపాటు ప్రస్తుత ధరలతో ఉత్తరప్రదేశ్ స్టాకిస్టులు పంచదార నిల్వ చేయడంపై దృష్టి సారిస్తున్నారు. దీనితో అన్ని కోల్డుస్టోరేజీలలో బెల్లం నిల్వచేయడం తగ్గగలదు. దీనితో ఇతర రాష్ట్రాల బెల్లం ఉత్పాదక కేంద్రాలలో స్టాకిస్టులు చురుకుగా మారడంతో ధరలు హెచ్చుముఖంలో ఉన్నాయి.

హోళీ డిమాండ్ తో ఇనుమడిస్తున్న బెల్లం ధరలు

Image
  గత వారం ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్, హాపూర్, రూర్కీ, మీరట్,జహంగీరాబాద్, ఖతోలి ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి దాదాపు 300 వాహనాల బెల్లం రాబడి అయినప్పటికీ హోళీ పండుగ డిమాండ్ కోసం పంజాబ్, హర్యాణా,రాజస్తాన్ నుండి నెలకొన భారీ డిమాండ్తో పాటు స్థానిక డిమాండ్ కూడా వృద్ధి చెందుతోంది. మార్కెట్లలో రాబడి అయిన సరుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు గుజరాత్ కోసం రవాణా అవుతున్నది. ఫలితంగా ధరలకు మద్దతు లభిస్తున్నది.

బెల్లం ఉత్పత్తి పెరిగినప్పటికీ భవిష్యత్తుకు డోకా లేదు

Image
  గత వారం దేశంలోని బెల్లం ఉత్పాదక కేంద్రాల వద్ద రాబడులు పోటెత్తి ఉత్తర ప్రదేశ్, హర్యాణా, మధ్య ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు ఒడిశ్శాలోని అన్ని ఉత్పాదక కేంద్రాల వద్ద కలిసి 900-1000 వాహనాల బెల్లం రాబడి అయినట్లు వ్యాపారులు తమ అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ధరలు తమ స్థానాన్ని పదిలపరచుకున్నాయి. ఎందుకనగా, ఈసారి ఉత్తరప్రదేశ్లో ఉత్పత్తి తగ్గినందున అన్ని రాష్ట్రాల స్టాకిస్టులు ఒంటికాలిపై లేచారు. 

మహారాష్ట్ర లో పోటెత్తుతున్న బెల్లం రాబడులు

Image
  20-02-2022 దేశంలో రికార్డు స్థాయికి చేరిన చెరకు ఉత్పత్తి, సానుకూలంగా పరిణమించిన వాతావరణంతో పాటు పెరుగుతున్న పంచదార ఉత్పత్తికి అనుగుణంగా అమ్మకాలు కొరవడినందున పంచదార మిల్లర్లు ఆవేదన చెందుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఛత్తీస్గఢ్ చెరకు రైతులు బెల్లం తయారీ ప్రక్రియ శరవేగంతో చేపడుతున్నారు.

తగ్గిన బెల్లం రాబడులు - మందకొడిగా ధరలు

Image
  15-02-2022 దేశంలో పంచదార మరియు ఎథనాల్ ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో బెల్లం ఉత్పత్తి తగ్గే అవకాశం కనిపిస్తున్నది. అయితే, రెండేళ్లుగా బెల్లం ధరలు పెరగనందున, రైతులు సరుకు తయారైన వెంటనే విక్రయిస్తున్నారు. దీనితో దక్షిణ కర్నాటక మొదలుకొని ఉత్తర కర్నాటకలోని అన్ని మార్కెట్లలో కలిసి దాదాపు 200 లారీలు, ఆంధ్రలో 150, మహారాష్ట్రలో 175 - 200 లారీలు మరియు మధ్య ప్రదేశ్లో 200 లారీల సరుకు రాబడి అవుతున్నది. దీనితో సరఫరా పెరగడంతో ధరలు పెరగడంలేదు. అయితే, ఉత్తర ప్రదేశ్ కోల్డుస్టోరేజీలలో తక్కువగా సరుకు నిల్వ అయింది మరియు ఈ ఏడాది సీజన్ త్వరగా సమాప్తమయ్యే అవకాశం కలదు. దీనితో భవిష్యత్తులో ధరల పెరుగుదలకు అవకాశముంది. 

తగ్గిన బెల్లం రాబడులు - అడుగంటిన నిల్వలు - ధరలకు ఛాన్స్

Image
  01-02-2022 ఈసారి తీవ్రమైన చలి వీస్తున్న కారణంగా ప్రముఖ బెల్లం ఉత్పాదక రాష్ట్రాలలో తయారీ ప్రక్రియ కుంటుపడుతున్నందున రాబడులు కొంతమేర క్షీణించాయి. అయితే, ఉత్తరప్రదేశ్లో పాటు ఇతర రాష్ట్రాల స్టాకిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నందున రాబడి అయిన సరుకు మొత్తం అమ్మ కమవుతున్నదని వ్యాపారులు పేర్కొన్నారు. ఈసారి వివాహాది శుభకార్యాలకు ఫిబ్రవరి మూడో వారం నుండి ఏప్రిల్ వరకు విరామ సమయమని తెలుస్తోంది. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ లాంటి ఉత్పాదక రాష్ట్రాలలో బెల్లం రాబడులు మరో నెల రోజులలో జోరందుకోగలవని తెలుస్తోంది. ధర రూ. 100-150 తగ్గిన తర్వాత స్టాకిస్టులు కొనుగోలుకు ఆసక్తి చూపే అవకాశం ఉంది.

బెల్లం పొడికి పేటెంట్

Image
జాతీయ స్థాయిలో బెల్లంపై పరిశోధనలు నిర్వహిస్తున్న విశాఖ జిల్లా అనకాపల్లి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల కృషి ఫలించింది. గత రెండు దశాబ్ధలుగా ఇక్కడ బెల్లం పొడిపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. పరిశోధనలు విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇటీవల పేటెంట్ హక్కును ఇచ్చింది.