బెల్లం ధరలు పటిష్టం

 



 గత వారం కిరాణా వ్యాపారుల డిమాండ్తో ధర రూ. 100-150 ప్రతి క్వింటాలుకు పెరిగింది. ముజఫర్ నగర్ గత వారం 70-75 వేల బస్తాల సరుకు అమ్మకం కాగా, చాకూ బెల్లం రూ. 3200-3500, పాపి రూ. 3150-3200, రస్కట్ రూ. 3100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


ముజఫర్ నగర్ శీతల గిడ్డంగులలో ఆగస్టు 1 నాటికి బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 8,18,504 బస్తాల నుండి పెరిగి 10,55,898 బస్తాలకు చేరింది. ఎసిల నుండి వేగంగా సరుకు అమ్మకం అవుతోంది. ఇందులో చాకూబెల్లం 5,31,018 బస్తాల నుండి పెరిగి 5,90,812 బస్తాలు, కురుపా 10,107 బస్తాలు, రాబిటన్ 60,948 బస్తాల నుండి 2,16,787 బస్తాలు, చదరాలు 56,547 బస్తాల నుండి 65,116 బస్తాలు, పాపి 1,01,312 బస్తాల నుండి పెరిగి 1,40,212 బస్తాలకు చేరగా, రస్కట్ 48,699 బస్తాల నుండి తగ్గి 31,160 బస్తాలకు పరిమితమయ్యాయి. కొత్త సీజన్ ప్రారంభమ య్యేలోగా సరుకు పూర్తిగా అమ్మకం కాగలదు. ఎందుకనగా పంజాబ్, రాజ స్థాన్, హర్యాణాల కోసం మంచి డిమాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి మార్కెట్లో గత వారం 10-12 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై సురభి రకం రూ. 4000-4200, మీడియం రూ. 3900-3950, నల్లబెల్లం రూ. 2700, చిత్తూరులో 40-45 వాహనాల సరుకు అమ్మకం కాగా, సురభి రకం రూ. 3900, సూపర్-ఫెన్ రూ. 4300, సాట్నా రకం రూ. 3400, నలుపు రకం రూ. 2450-2500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


కర్ణాటకలోని మాండ్యా మార్కెట్లో గత వారం 60-65 వాహనాల సరుకు రాబడిపై ఎరుపు రకం రూ. 3000, సింగల్ ఫిల్టర్ రూ. 3150, డబుల్ ఫిల్టర్ రూ. 3400, చదరాలు రూ. 3450, మహాలింగపూర్లో 8-10 వాహనాల సరుకు అమ్మకంపై సురభి రకం రూ.3400 3450, గుజరాత్ రకం రూ. 3500-3550, బాక్స్ రకం రూ. 3550-3600, నాణ్యమైన దేశీ సరుకు రూ. 3650-3850, శిమోగాలో 20-25 వాహనాలు దేశీ బెల్లం రూ. 3700-3750 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మహారాష్ట్రలోని లాతూర్ మార్కెట్లో 8-10 వాహనాల శీతల గిడ్డంగుల నరుకు అమ్మకంపై సురభి రకం నాణ్యమైన సరుకు రూ. 3200-3250, మీడియం రూ. 3000-3100, ఎరుపు రకం రూ. 3000-3050 మరియు సాంగ్లీలో 18-20 వేల దిమ్మల బెల్లం అమ్మకంపై ఎరుపు, సురుభి, గుజరాత్ రకాలు రూ. 3500–3800, ముంబై రకం రూ. 3600-3900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని సేలం మార్కెట్లో 7-8 వేల బస్తాల బెల్లం రాబడిపై తెలుపు రకం (30 కిలోలు) రకం రూ. 1320-1340, సురభి రకం సరుకు రూ. 1300-1320, ఎరుపు రక్తం రూ. 1290-1310, పిలకలపాలయంలో 2-3 వేల బస్తాల సరుకు రాబడిపై తెలుపు రూ. 1180-1190, సురభి, రూ.1140-1160, ఎరుపు రకం రూ. 1120-1140 మరియు వెల్లూరులో 4-5 వాహనాల సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 4550-4600, మీడియం రూ. 4250-4300, నలుపు రకం రూ. 2550-2650 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు