Posts

Showing posts with the label Sesame

వర్షాల వలన ఎండాకాలం నువ్వు పంట ప్రభావితం

Image
 ఈ ఏడాది 29, ఏప్రిల్ వరకు దేశంలో ఎండాకాలం నువ్వు పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 4.20 లక్షల హెక్టార్ల నుండి పెరిగి 4.36లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో గుజరాత్లో 24, ఏప్రిల్ వరకు విస్తీర్ణం 1,07,784 హెక్టార్ల నుండి పెరిగి 1,23,548 హెక్టార్లకు చేరింది. తెలంగాణా సహా కొన్ని రాష్ట్రాలలో కొత్త సరుకు రాబడి ప్రారంభమయింది. 

పెరుగుతున్న నువ్వుల రాబడులు - విస్తృతమవుతున్న రబీ సేద్యం

Image
   ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ లలో దినసరి 20 వేల బస్తాల రాబడి అవుతోంది. అయితే ప్రస్తుతం వర్షాల కారణంగా సరుకు నిమ్ముతో పాటు డిస్ కలర్ కావడంతో ధరలు తగ్గి గ్వాలియర్లో 99.1 రకం రూ. 12,800-12,900, హల్లింగ్ రూ. 12,500-12,600, ఆగ్రాలో హళ్లింగ్ సరుకు రూ. 12,400-12,500, కాన్పూర్ లో హళ్లింగ్ సరుకు 12,600-12,800, ముంబైలో తెల్లనువ్వులు సార్టెక్స్ రూ. 13,700, ముంద్రా డెలివరి రూ. 13,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

నాణ్యమైన నువ్వులకు ధరల మద్దతు

Image
   ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సెప్టెంబర్ 23 నాటికి దేశంలో నువ్వుల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 13.20 ల.హె. నుండి పెరిగి 13.35 హెక్టార్లు, గుజరాత్ లో 1,00,496 హెక్టార్ల నుండి తగ్గి 72,121 హెక్టార్లకు పరిమితం కాగా ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని మధ్య ప్రదేశకు చెందిన గ్వాలియర్, డబ్రా, ధితియా ప్రాంతాలలో సంతృప్తికరంగా విస్తరించింది. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. తద్వారా సీజన్ తొలి నాళ్లలో దూసుకుపోయే ధరలు అటు తర్వాత చల్లబడగలవని సంకేతాలు అందుతున్నాయి.

తగ్గిన నువ్వుల విస్తీర్ణo

Image
   ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో సెప్టెంబర్ 16 నాటికి దేశంలో నువ్వుల సేద్యం 13.07 ల.హె. నుండి స్వల్పంగా పెరిగి 13.12 హెక్టార్లకు చేరింది. ఇందులో గుజరాత్ లో 1 లక్ష హెక్టార్ల నుండి తగ్గి 72 వేల హెక్టార్లకు చేరింది. అయితే మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లలో విస్తీర్ణం పెరిగినందున లోటు పూరించబడగలదు. గడ్డి నువ్వుల విస్తీర్ణం 86 వేల హెక్టార్ల నుండి పెరిగి 98 వేల హెక్టార్లకు చేరింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ లాంటి నువ్వుల ఉత్పాదక కేంద్రాలలో వర్షాల వలన పంటకు నష్టం చేకూరడంతో పాటు సరుకు నాణ్యత తగ్గే అవకాశం కలదు. 

నువ్వుల ధరలపై భారీ ఆశలు వద్దు

Image
   ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సెప్టెంబర్ 2 నాటికి దేశంలో నువ్వుల సేద్యం 12.77 ల.హె. నుండి స్వల్పంగా పెరిగి 12.83 హెక్టార్లు, రామతిలలు 39 వేల హెక్టార్ల నుండి 85 వేల హెక్టార్లకు విస్తరించింది. తెలంగాణలో గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 421 ఎకరాల నుండి తగ్గి 406 ఎకరాలు, గుజరాత్ లో ఆగస్టు 29 నాటికి 99,832 హెక్టార్ల నుండి 71,583 హెక్టార్లకు పరిమితం కాగా మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో గత ఏడాదితో పోలిస్తే సంతృప్తికరంగా విస్తరించగలదని భావిస్తున్నారు.

స్వల్పంగా పెరిగిన నువ్వుల ధరలు

Image
   ప్రస్తుత ఖరీఫ్ ఆగస్టు 19 వరకు దేశంలో నువ్వుల పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 12,38,000 హెక్టార్ల నుండి తగ్గి 12,24,000 హెక్టార్లకు చేరింది. ఇందులో గుజరాత్లో విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 99,758 హెక్టార్ల నుండి తగ్గి 68,807 హె లకు చేరింది. రాజస్థాన్లో విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 2,63,760 హెక్టార్ల నుండి పెరిగి 2,84,770 హెక్టార్లకు చేరింది.

అమ్మకాల ఒత్తిడితో డీలా పడుతున్న నువ్వుల ధరలు

Image
   ప్రపంచ వ్యాప్తంగా వంటనూనెల ధరలు మందగించే అంచనా వ్యక్తమవుతున్న నేపథ్యంలో నువ్వుల ధరలు తగ్గగలవని భావిస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 3 ఆగస్టు 5 నాటికి దేశంలో నువ్వుల సేద్యం గత ఏడాదికి ధీటుగా ఉన్నందున ప్రస్తుత రబీ మరియు యాసంగి సీజన్ సరుకు విక్రయించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. అయితే, దేశ వ్యాప్తంగా కిరాణా మార్కెట్లలో తెల్లనువ్వులకు డిమాండ్ నెలకొన్నందున ధరలు చెప్పుకోదగ్గ స్థాయికి దిగాజారే అవకాశం లేకపోగా క్రషింగ్ సరుకు అమ్మకాలు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు దేశంలోని తూర్పు రాష్ట్రాలలో రైతులు తమ సరుకు విక్రయించేందుకు ఆసక్తి కనబరచడమే ఇందుకు ప్రధాన కారణం.

ఎగుమతి డిమాండ్తో బలపడిన నువ్వులు

Image
   ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జూన్ 30 వరకు దేశంలో నువ్వుల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1.08 ల.హె. నుండి తగ్గి 97 వేల హెక్టార్లకు పరిమితమైందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ నివేదికలోపేర్కొన్నది. గుజరాత్లో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నువ్వుల ఉత్పత్తి ముందస్తు అంచనా ప్రకారం 33,270 టన్నులు, యాసంగి ఉత్పత్తి 9,971టన్నులు కలిసి మొత్తం 42,241 టన్నులు ఉండగలదనే అభిప్రాయం వ్యక్తం చేసింది.

పెరిగిన నువ్వుల ధరలు

Image
  లభించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం వర్షాలు తక్కువగా ఉన్నందున మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్లో విస్తీర్ణం తగ్గే అవ కాశం ఉన్నందున ధరలు రూ. 500-600 ప్రతిక్వింటాలుకు పెరిగాయి. అయితే, ఇంతవరకు యాసంగి పంట రాబడులతో పాటు స్టాకిస్టుల అమ్మకాల వలన ధరలు ఎక్కువగా పెరిగే అవకాశంలేదు.

కొత్త నువ్వులకు కొనసాగుతున్న మందగమనం

Image
  దేశంలో ప్రస్తుత యాసంగి సీజన్ కోసం నువ్వుల విస్తీర్ణం 3.85 ల.హె.లతో పోలిస్తే పెరిగి 4.14 లక్షల హెక్టార్లకు చేరింది. మరియు తెలంగా ణలోని నిజామాబాద్ మరియు ఆంధ్రలోని విజయనగరం, నర్సన్నాపేట ప్రాంతా లలో కొత్త సరుకు రాబడి ప్రారంభమై దినసరి 300-400 బస్తాలు రాబడి కాగా, ఎర్ర నువ్వులు రూ. 8600-9000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తాడేపల్లిగూడెం, పెద్దాపురం, సామర్లకోట ప్రాంతాల నూనె మిల్లుల కోసం ప్రతి 75 కిలోల బస్తా రూ. 6800 ధరతో డెలివరి వ్యాపారం అయింది. 

ఆంధ్ర, తమిళనాడులలో కొత్తనువ్వుల రాబడులు

Image
  లభించిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని కడప, బద్వేలు, వెంపల్లి, దువ్వూరు ప్రాంతాలలో దినసరి 1000-1500 బస్తాలు, చాగలమర్రి, ఆర్లగడ్డ, మైదుకూరు ప్రాంతాలలో 4-5 వాహనాల కొత్త నువ్వుల రాబడిపై నలుపు రకం రూ. 9,200-9,300, తెల్ల నువ్వులు రూ. 10,500-10,600, విరుధ్నగర్ డెలివరి జిఎస్టి సహా 75 కిలోల బస్తా రూ. 7200, సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతాలలో 50-100 బస్తాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 9200-9300 ధరతో వ్యాపారమైంది.

నువ్వులలో కొనసాగుతున్న మందకొడి

Image
  కేంద్ర ప్రభుత్వం నూనెగింజలపై పరిమితి విధించడం మరియు కడప, బద్వేలు, వెంపల్లి, దువ్వూరు ప్రాంతాలలో దినసరి 2000 బస్తాల కొత్త నువ్వుల రాబడి కాగా, నలుపు రకం సరుకు రూ. 10,400-10,500, విరుధాచలం డెలివరి (ప్రతి 75 కిలోల బస్తా ) రూ. 8000, తెల్ల నువ్వులు రూ. 11,000, విరుధ్నగర్ డెలివరి జిఎస్టి సహా రూ. 8600 మరియు చాగలమర్రి, ఆళ్ళగడ్డ ప్రాంతాలలో 2 లారీల సరుకు రాబడి కాగా, రూ. 10,000-11,000, నలుపు రకం రూ.10,000 -10,500 ప్రతి క్వింటాలు మరియు నర్సారావుపేట, సత్తెనపల్లి ప్రాంతాలలో వచ్చేవారం నుండి మరియు పార్వతిపురం, శ్రీకాకుళం ప్రాంతాలలో ఏప్రిల్ చివరి వారంలో కొత్త సరుకు రాబడి ప్రారంభమయ్యే అవకాశం కలదు.

తమిళనాడు లో పెరుగుతున్న కొత్త నువ్వుల రాబడులు

Image
  గుజరాత్లో మార్చి 17 వరకు నువ్వుల పంట విస్తీర్ణం 17,300 హెక్టార్లు ఉంది. ప్రస్తుత ఖరీఫ్, రబీ సీజన్లలో రాబడులు తగ్గినపప్పటికీ, ధరలు మందకొడిగా ఉన్నాయి. ఎందుకనగా మనదేశం నుండి ఎగుమతి డిమాండ్ ఎక్కువగా పెరగడం లేదు. తమిళనాడులో కొత్త సరుకు రాబడులు ప్రారంభం అయ్యాయి. అంతేకాకుండా ఆంధ్రలో ఉత్పత్తి తగ్గినప్పటికీ, రెత్తులు తమ విక్రయిస్తున్నారు. తమిళనాడులోని విరుధాచలం, విల్లుపురం ప్రాంతాలూలలో 2000 బస్తాల కొత్త సరుకు రాబడి 80 కిలోల బస్తా 38 కిలో నూనె దిగుబడి కండీషన్ సరుకు త్రిచి, ఈరోడ్, రాజపాలయం డెలివరి రూ. 10,300, ఆంధ్ర సరుకు రూ. 8500-8600 (ప్రతి 75 కిలోలు) ధరతో వ్యాపారమైంది. ఈ సరుకులో 80 కిలోలకు 30-31 కిలోల నూనె దిగుబడి అవుతున్నది.

పెరిగిన రబీ నువ్వుల విస్తీర్ణం

Image
  మార్చి 11 వరకు దేశంలో నువ్వుల పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1.16 ల.హె. నుండి పెరిగి 1.31 ల.హె.లకు చేరింది. ఇప్పటికీ, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలలో పంట విత్తడం పూర్తవుతున్నది. ఆదిలాబాద్, నిమాజాబాద్ ప్రాంతాలలో ఏప్రిల్ చివరి వారం నాటికి కొత్త సరుకు రాబడులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. స్టాకిస్టులు తమసరుకు విక్రయిస్తున్నందున దేశంలో సరుకు కొరత లేదు. తద్వారా ఎక్కువగా హెచ్చు-తగ్గులకు అవకాశం లేదు. కేవలం ట్రేడింగ్ వ్యాపారులకు లాభం చేకూరగలదు.

దక్షిణాది రాష్ట్రాలలో త్వరలో కొత్త నువ్వులు

Image
   లభించిన సమాచారం ప్రకారం రాబోవు రోజులలో తమిళనాడు, తెలంగాణ మరియు గుజరాత్లలో కొత్త రబీ సీజన్ నువ్వుల రాబడులు ప్రారంభమయ్యే అవకాశం కలదు మరియు ఈ ఏడాది ఉత్పత్తి పెరిగే అవకాశం కలదు. దీనితో కిరాణా వ్యాపారుల కొనుగోళ్లు పరిమితంగా ఉన్నందున ధరలు స్థిరంగా ఉన్నాయి. వారాంతంలో వంటనూనెల ధరలలో మందకొడి కారణంగా నువ్వులనూనెకు గిరాకీ తక్కువగా ఉంది.

నువ్వులకు కొనసాగుతున్న ధరల ఒరవడి

Image
   ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో త్వరలో కొత్త నువ్వుల ప్రారంభం కానున్నాయి. తెల్లనువ్వులు అత్యంత నాణ్యంగా రాణిస్తున్నట్లు సంకేతాలు అందడంతో దక్షిణాది రాష్ట్రాల కిరాణా వ్యాపారుల కొనుగోళ్లు క్షీణించినందున ధరలు కొంతమేర నెమ్మదించాయి.

పురోగమిస్తున్న నువ్వుల ధరలు

Image
  20-02-2022 దేశంలో నువ్వుల నిల్వలు భారీగా పేరుకుపోతున్నాయి. ఎగుమతి డిమాండ్ నెలకొనే అంచనా మరియు ఆంధ్రప్రదేశ్లో రబీ సీజన్ సేద్యం తగ్గనున్నట్లు అందిన సంకేతాలతో స్టాకిస్టులు సరుకు కొనుగోలుకు ఉపక్రమించినందున ధరలకు మద్దతు లభిస్తున్నది.ఒడిశ్శాలోని మల్కన్గిరి లో నువ్వుల పంటకు నష్టం వాటిల్లినందున రాబడులు తగ్గి ప్రతి రోజు 200 బస్తాల సరుకు రాబడిపై ఆన్-గ్రేడ్ రూ. 8200-8400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై జగదల్పూర్లో నిల్వ కోసం రవాణా అవుతున్నది. తమిళనాడులోని ముత్తూరు, శివగిరి ప్రాంతాలలో కొత్త సరుకు రాబడులు మార్చి నుండి ప్రారంభం కాగలవని తెలుస్తోంది.

నువ్వులు - తగ్గిన గిరాకీ

Image
  15-02-2022 దేశంలోని వినియోగానికి అనుగుణంగా సరఫరా ఉండడం మరియు స్టాకిస్టుల అమ్మకాలతో ధరలు పెరగడంలేదు. ఈ ఏడాది ధరలు పెరిగే అవకాశం కనిపించడంలేదు. దీనితో రాజస్తాన్లో బికనీర్, కోటా, నోఖా, పాలీ, శ్రీగంగానగర్ తదితర ప్రాంతాలలో దినసరి తెల్ల నువ్వులు 5-7 వేల బస్తాల రాబడిపై గజ్జర్ రూ. 80-100 తగ్గాయి మరియు కొత్త తెల్ల నువ్వులు 99.1 రకం రూ. 10500-10600, 98.2 రకం రూ. 10200-10300, 95.5 రకం రూ. 9500-9600, గజ్జర్ రూ. 9000-9100 ధరతో వ్యాపారమయింది. 

ఫిబ్రవరి నుండి కొత్త నువ్వుల రాబడులు

Image
  01-02-2022 ఎండకాలo సీజన్ కోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖ 5,25,000 హెక్టార్లలో నువ్వుల పంట విస్తీర్ణాన్ని లక్ష్యంగా నిర్ధారించింది.ఫిబ్రవరి నెలాఖరులో రబీ సీజన్ నువ్వుల రాబడులు ప్రారంభం కాగలవని వ్యాపారులు తెలిపారు. ఈ ఏడాది ఉత్పత్తి తగ్గినప్పటికీ జనవరిలో ధరలు పురోగమించనందున వ్యాపారులు మరియు రైతులు తమ నిల్వ సరుకు విక్రయించడం ప్రారంభించారు. ఎందుకనగా, యాసంగి సేద్యం భారీగా విస్తరించే అవకాశమే ఇందుకు నిదర్శనం. ఇలాంటి పరిస్థితులలో గత ఏడాది మాదిరిగానే డిసెంబర్ సరుకు సరఫరా ఉండగలదని తెలుస్తోంది. దీనితో ఉత్పాదక రాష్ట్రాలలో ధరలు తగ్గి స్థిరంగా నిలిచాయి.

తెలంగాణ లో వరికి ప్రత్యామ్నయంగా నువ్వుల సేద్యం సాధ్యమేనా

Image
  12-10-2021 రాష్ట్రంలో పండించే మొత్తం పంటను కొనుగోలు చేయడం సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర సర్కారు స్పష్టమైన సంకేతాలిచ్చింది. తద్వారా యాసంగి వరి స్థానంలో నువ్వులు లాంటి ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం రైతులకు సలహా ఇస్తోంది. ఇందుకోసం రైతులకు అవగాహన పెంపొందించేందుకు వ్యవసాయ అధికారులు సన్నద్ధమవుతున్నారు.