అమ్మకాల ఒత్తిడితో డీలా పడుతున్న నువ్వుల ధరలు

 


 ప్రపంచ వ్యాప్తంగా వంటనూనెల ధరలు మందగించే అంచనా వ్యక్తమవుతున్న నేపథ్యంలో నువ్వుల ధరలు తగ్గగలవని భావిస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 3 ఆగస్టు 5 నాటికి దేశంలో నువ్వుల సేద్యం గత ఏడాదికి ధీటుగా ఉన్నందున ప్రస్తుత రబీ మరియు యాసంగి సీజన్ సరుకు విక్రయించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. అయితే, దేశ వ్యాప్తంగా కిరాణా మార్కెట్లలో తెల్లనువ్వులకు డిమాండ్ నెలకొన్నందున ధరలు చెప్పుకోదగ్గ స్థాయికి దిగాజారే అవకాశం లేకపోగా క్రషింగ్ సరుకు అమ్మకాలు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు దేశంలోని తూర్పు రాష్ట్రాలలో రైతులు తమ సరుకు విక్రయించేందుకు ఆసక్తి కనబరచడమే ఇందుకు ప్రధాన కారణం.


దేశంలో ఆగస్టు 5 నాటికి నువ్వుల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 11.21 ల.హె. నుండి తగ్గి 11.9 ల.హె.కు పరిమితమైనట్లు కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొన్నది. గుజరాత్లో ఆగస్టు 1 నాటికి సాధారణ సేద్యంతో పోలిస్తే 1,21,951 హెక్టార్ల నుండి తగ్గి 79,055 హెక్టార్లకు పరిమితమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ పేర్కొన్నది. అయితే, ఈ ఏడాది మొత్తం సేద్యం 47,063 హెక్టార్లకు విస్తరించింది. అయితే, సేద్యం ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. రాజస్తాన్లో నువ్వుల సేద్యం గత ఏడాదితో పోలిస్తే 2,05,550 హెక్టార్ల నుండి పెరిగి 2,47,530 హెక్టార్లకు విస్తరించింది.


గత వారం కర్ణాటకలోని మైసూరులో 2-3 వాహనాల సరుకు రాబడిపై రూ. 9500-10,000, గుజరాత్లో గత వారం 20-25 వేల బస్తాల సరుకు రాబడి. కాగా స్థానికంగా తెల్లనువ్వులు రూ.11.950-12,050, మీడియం రూ. 11,700-11,850, యావరేజ్ సరుకు రూ. 11,400–11,600, జడ్-బ్లాక్ | రూ. 12,250-13,375, మీడియం రూ. 11,250-12,000, క్రషింగ్ సరుకు - రూ.8500-9500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


ముంబైలో తెల్లనువ్వులు సార్టెక్స్ రూ. 13,000, ముంద్రా డెలివరి రూ. 12,800, గ్వాలియర్ హల్డింగ్ సరుకు బెస్ట్ రూ. 12,000-12,200, 99.1 9 రకం రూ. 12,400, సార్టెక్స్ రూ. 13,200, కాన్పూర్లో హల్డింగ్ సరుకు రూ. • 11,800-12,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మధ్య ప్రదేశ్లోని నిమచ్లో గత వారం 600-800 బస్తాల రాబడిపై తెల్లనువ్వులు నాణ్యమైన సరుకు రూ. 12,000-12,200, మీడియం రూ. 11,700-11,900, • యావరేజ్ సరుకు రూ. 11,300-11,600, జాగ్రాలో 400-500 బస్తాలు రూ. 11,400–11,900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తమిళనాడులోని నువ్వుల ఉత్పాదక కేంద్రాలలో రాబడులు కుంటుపడి గత వారం 1000 బస్తాలకు పరిమితమయ్యాయి. తెల్లనువ్వులు రూ. 10,000–11,200, నల్లనువ్వులు రూ. 12,000-12,800, ఎర్రనువ్వులు రూ. 9500–11,500, పశ్చిమబెంగాల్లోని బెల్టా, ఖరగూర్ ప్రాంతాలలో ప్రతి రోజు 6-7 వాహనాల ఎర్ర నువ్వుల అమ్మకంపై 3 శాతం ఎఫ్ఎఫ్ కండిషన్ సరుకు తమిళ నాడులోని ఈరోడ్ డెలివరి రూ. 9000 మరియు 2 శాతం సరుకు రూ. 9100, అన్ క్లీన్ రూ. 800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తెలంగాణలోని నిజామాబాద్, మెట్ పల్లి ప్రాంతాలలో రూ. - 11,500–11,800 ధరతో వ్యాపారమై మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, చీపురుపల్లి ప్రాంతాలలో గత వారం 4-5 వాహనాల సరుకు రాబడిపై రూ.9500-10,300 ధరతో వ్యాపారమై తాడేపల్లిగూడెం, సామర్లకోట ప్రాంతాల కోసం రవాణా అవుతున్నది. కడప, బద్వేలు, వెంపల్లి, - దువ్వూరు ప్రాంతాలలో ఎర్రనువ్వులు రూ. 10,500-10,700, నరసారావుపేట, సత్తెనపల్లి ప్రాంతాలలో రూ. 10,000-10,500 ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ మరియు 75 కిలోల బస్తా విరుధ్ నగర్ డెలివరి రూ. 8300 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

తగ్గిన పెసర విస్తీర్ణం