బలపడుతున్న శనగల ధరలు

సీజన్లో దేశంలో శనగల ఉత్పత్తి 137.50 ల.ట.కు చేరినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ నాల్గవ ముందస్తు అంచనాలో పేర్కొన్నది. అయితే, దేశంలోని పలు ప్రాంతాలలో అతివృష్టి మరియు కొన్ని ప్రాంతాలలో లోటు వర్షపాతం తగ్గిన ఉత్పత్తి మరియు పెరుగుతున్న వినియోగంతో పాటు తూర్పు ఆస్ట్రేలియాలోని ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. భారతదేశం శనగల ఉత్పత్తిలో ప్రసిద్ధి గాంచినట్లు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం పంట ప్రాథమిక దశలో ఉంది. మున్ముందు పరిస్థితి సానుకూలంగా మారే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. పెరుగుతున్న లానినొ మరియు భారత ధృవాలలో నకారాత్మక శక్తి పెంపొందడం వలన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కావున దక్షిణ ఆస్ట్రేలియాలోని విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్, క్రిస్ ల్యాండ్ మరియు తూర్పు ప్రాంతాలలో మున్ముందు శనగ పంటకు పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని దేశీయ మార్కెట్లో దిగజారుతున్న శనగల ధరలకు కళ్లెం పడింది.