Posts

Showing posts with the label Greengram

పెరిగిన వేసవి పెసర సేద్యం

Image
   అంతర్జాతీయ మార్కెట్లో పేడేశ్వర్ 1170, పొకాకో 830 డాలర్లు ప్రతి టన్ను ధరతో వ్యాపారమైంది. దేశంలలో ఏప్రిల్ 28 నాటికి యాసంగి పెసర సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే 12.84 ల.హె. నుండి పెరిగి 14.27 ల.హె.కు విస్తరించింది.

పెసరపప్పు యధాతథం

Image
   కొనుగోలుదారులు కరవైనందున గత వారం అపరాల ధరల ప్రభావం పెసలపై పొడసూపింది. తద్వారా పెసల ధర ప్రతి క్వింటాలుకు రూ. 50 పతనమైంది. ఆంధ్ర ప్రాంతం మిల్లు రకం పెసలు చెన్నై డెలివరి రూ. 7850, పాలిష్ సరుకు రూ. 8200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

పెసలు

Image
 రాజస్థాన్ లోని పెసల ఉత్పాదక కేంద్రాల వద్ద ముమ్మరంగా పంట కోతలు కొనసాగుతున్నాయి. దీనితో గత వారం రోజులుగా ప్రతి రోజు 30-32 వేల బస్తాల కొత్త పెసలు రాబడి కాగా,జాతీయ స్థాయిలో విస్తీర్ణం తగ్గడంతో పాటు అనేక ఉత్పాదక కేంద్రాలలో వర్షాల వలన పంటకు నష్టం చేకూరింది. అంతేకా కుండా అక్టోబర్ 17 నుండి ఛత్తీస్ ఘడ్ లో ప్రభుత్వ కొనుగోళ్లు ప్రారంభం కాను న్నాయి. ఇతర రాష్ట్రాలలో కూడా ప్రభుత్వ ఏజెన్సీల కొనుగోళ్లకు అవకాశం ఉండ డంతో పాటు కందుల ధరలు పటిష్టంగా మారడంతో పెసర పప్పుకు డిమాండ్ పెరుగుతోంది. స్టాకిస్టుల కొనుగోళ్లతో కూడా ధరలు బలోపేతం చెందుతు న్నాయి.వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి తాజా నివేదిక ప్రకారం దేశంలో 23 సెప్టెంబర్ నాటికి పెసర పంట సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 34.71 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 33.37 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో గుజరాత్ లో విస్తీర్ణం 98,643 హెక్టార్ల నుండి తగ్గి 79,863 హెక్టార్లకు, మిటుకుల విస్తీర్ణం 13,094 నుండి పెరిగి 14,262 హెక్టార్లకు చేరింది.

కర్ణాటక, మహరాష్ట్ర లలో కొత్త పెసలు

Image
   ప్రభుత్వం కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ప్రతిపాదించడంతో మార్కెట్లలో రైతుల సరుకు రాబడి తగ్గడంతో కర్ణాటక, మహారాష్ట్ర మొదలగు ఉత్పాదక కేంద్రాల వద్ద కొత్త సరుకు రాబడులు పెరగడం లేదు. కందుల ధరలు పెరగడం మరియు పెసర విస్తీర్ణం తగ్గడంతో భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం ఉంది. దీనితో స్టాకిస్టుల అమ్మకాలు తగ్గడంతో ధర రూ. 100-200 పెరిగింది.

అతివృష్టితో తగ్గిన పెసల దిగుబడి

Image
   వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి తాజా నివేదిక ప్రకారం దేశంలో సెప్టెంబర్ 9 నాటికి పెసర పంట సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 34.53 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 33.10 లక్షల హెక్టార్లకు చేరడంతో పాటు అధిక వర్షాల వలన పంటకు నష్టం చేకూరడంతో ఉత్పత్తి తగ్గుచున్నది.

కొత్త పెసల రాబడులు ప్రారంభం - తగ్గిన విస్తీర్ణం

Image
   దేశవ్యాప్తంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో సెప్టెంబర్ 2 నాటికి పెసల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 34.38 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 32.97 లక్షల హెక్టార్లకు పరిమితమైంది. ఇందులో రాజస్థాన్ లో 20.87 ల.హె. నుండి తగ్గి 20.53 ల.హె.లకు చేరగా,

కొత్త పెసల రాబడితో తగ్గిన ధరలు

Image
   దేశవ్యాప్తంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఆగస్టు 19 నాటికి పెసల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 33.96 ల.హె. నుండి తగ్గి 32,40 ల.హె.కు పరిమితమైందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. ఇందులో గుజరాత్ సేద్యం ఆగస్టు 15 నాటికి 97,000 హెక్టార్ల నుండి తగ్గి 75,933 హెక్టార్లకు పరిమితమైంది. 2021-22 (జూలై-జూన్) సీజన్లో దేశంలో పెసల ఉత్పత్తి 31.50 ల.ట., ఇందులో ఖరీఫ్ సీజన్ ఉత్పత్తి 16-17 ల.ట. ఉండగలదని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ నాల్గవ ముందస్తు అంచనాలో పేర్కొన్నది. 

కొత్త పెసర ధరలు తగ్గే అవకాశం లేదు

Image
  ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో  దేశంలో పంట విత్తడం దాదాపు సమాప్తమైంది. ప్రభుత్వ వర్గాల గణాంకాల ప్రకారం విస్తీర్ణం కేవలం 76 వేల హెక్టార్ల మేర పెరిగింది. వ్యాపారుల కథనం ప్రకారం విస్తీర్ణం తగ్గడంతో పాటు భారీ వర్షాల కారణంగా కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రలలో పంటకు నష్టం వాటి ల్లింది. కందిపప్పు ధరలు పెరగడంతో పెసర పప్పు వినియోగం పెరుగుతు న్నందున పెసల ధరలు తగ్గే అవకాశం లేదు. జనవరి నుండి ప్రారంభమయ్యే రబీ నుండి యాసంగి సీజన్ కోసం రికార్డు స్థాయిలో సాగుకు అవకాశం ఉంది. దీనితో స్టాకిస్టులు కేవలం కందులపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. 

పెసరపప్పుకు డిమాండ్ పెరిగే అవకాశం

Image
   వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి వారపు నివేదిక ప్రకారం ప్రస్తుత ఖరీప్ దేశంలో 29, జూలై వరకు పెసర పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 25 లక్షల 29 వేల హెక్టార్ల నుండి పెరిగి 29 లక్షల 26 వేల హెక్టార్లకు చేరింది. 25, జూలై వరకు రాజస్తాన్లో పెసర విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 11, 45,520 హెక్టార్ల నుండి పెరిగి 18,55,650 హెక్టార్లకు, మిటుకులు 2,06,770 హెక్టార్ల నుండి రికార్డు స్థాయికి 7,99,050 హెక్టార్లకు, గుజరాత్లో 53,115 హెక్టార్ల నుండి తగ్గి 44,169, మిటుకులు 7768 హెక్టార్ల నుండి తగ్గి 7124, తెలంగాణాలో 27, జూలై వరకు పెసర విస్తీర్ణం 1,27,739 ఎకరాల నుండి తగ్గి 55,675 ఎకరాలకు చేరడంతో పాటు పంట విత్తడం పూర్తయింది. 

పెసల ఉత్పత్తి పెరిగే సూచన

Image
 దేశవ్యాప్తంగా ప్రస్తుత యాసంగి సీజన్ కోసం పంజాబ్ సహా,ఇతర ఉత్పాదక రాష్ట్రాలలో పంట ఉత్పత్తి పెరిగింది. రెతులకు మద్దతు ధరకు ధీటుగా ధర లభించడంతో ప్రస్తుత ఖరీఫ్ లో విస్తీర్ణం పెరుగుతుంది. రాజస్థాన్లో సరుకు నిల్వ చేసిన రెత్తులు తమ సరుకు విక్రయిస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్లో రాజస్థాన్లో పెసర పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 3.81 ల.హె. నుండి పెరిగి 6.23 ల.హె.కు విస్తరించింది. అయితే కర్ణాటకలో 2.75 ల.హె. నుండి పెరిగి 3.03 ల.హె. లకు చేరడంతో దేశంలో మొత్తం విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 8.17 ల.హె. నుండి పెరిగి 10.76 ల.హె.లకు చేరింది.

రికార్డు స్థాయిలో పెసర సాగు - ధరలకు కళ్లెం

Image
  దేశంలో రికార్డు స్థాయిలో పెసర సాగు కావడంతో అంతర్జా తీయ మార్కెట్లో ధర 110 డాలర్లు ప్రతి టన్నుకు పెరిగినప్పటికీ, దేశీయ మార్కెట్లో ఎలాంటి ప్రభావం లేదు. భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం కూడా కనిపించడం లేదు. పెసర పంట విస్తీర్ణం పెరగడంతో 6, మే వరకు దేశంలో యాసంగి అపరాల విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 18.4 శాతం పెరిగి 20.38 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో పెసర పంట విస్తీర్ణం 14.24 ల.హె. నుండి పెరిగి 16.25 ల.హె.లకు చేరింది. మధ్య ప్రదేశ్ ఎక్కువ విస్తీర్ణం పెరిగింది. ఎందుకనగా గత ఏడాది రైతులకు మద్దతు ధరకంటే అధిక ధర లభించింది. ఈ ఏడాది ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం లేదు.

పెరిగిన యాసంగి పెసర విస్తీర్ణం

Image
  అంతర్జాతీయ విపణిలో అనేశ్వర్ 800 డాలర్లు, పేడేశ్వర్ పెసలు 840 డాలర్లు, పొకాకో 850 డాలర్లు ప్రతి టన్ను ధరతో వ్యాపా రమైంది. దేశంలో ఏప్రిల్ 18 వరకు యాసంగి పెసర విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 6.73 ల.హె. నుండి 2 ల.హె. పెరిగి 8.62 ల.హె.లకు చేరింది. 

గుజరాత్లో తగ్గిన పెసరపంట దిగుబడి

Image
  ఈ ఏడాది గుజరాత్లో యాసంగి పెసర పంట విస్తీర్ణం గతఏడాది మాదిరిగా ఉన్నప్పటికీ పంట దిగుబడి తగ్గింది. మరియు స్థానిక గిరాకీ వలన రాజకోట్లో దినసరి 150-200 బస్తాల రాబడిపై సాద రూ.6555-6900, చమ్కీరూ. 7025-7245 లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది. ఆంధ్ర ప్రాంతపు నాణ్యమైన సన్నరకం చమ్కీ పెసలు చెన్నై డెలివరీ రూ. 100-700 ధరతో వ్యాపారమెంది. 

పెసరపప్పుకు కొరవడిన గిరాకీ

Image
  అంతర్జాతీయ విపణిలో పేడేశ్వర్ పెసలు 40 డాలర్లు తగ్గి 940 డాలర్లు ప్రతి టన్ను ధర ప్రస్తావించబడింది. అయితే పొకాకో 20 డాలర్లు వృద్ధిచెంది 855 డాలర్లు మరియు అనేశ్వర్ 800 డాలర్లు క్రితం మాదిరిగానే ప్రస్తావించగా, తమిళనాడు ప్రాంతపు కొత్త పెసలు చెన్నై డెలివరి రూ.50 తగ్గి రూ. 6900-6950, చెన్నెలో పేడేశ్వర్ రూ. 7400, ఆంధ్ర ప్రాంతపు నాణ్యమైన సన్నరకం చమ్కీ పెసలు రూ. 7100 మరియు ఆంధ్రలో పప్పు మిల్లుల డిమాండ్తో సాదా పెసలు రూ. 7050, చమ్కీ రూ. 7200 ధరతో వ్యాపారమెంది. ప్రస్తుతం భారతీయ పప్పుమిల్లర్లు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నారు.

పెసరపప్పుకు గిరాకీ

Image
   1, ఏప్రిల్ వరకు దేశంలో యాసంగి పెసర విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 4.11 లక్షల హెక్టార్ల నుండి పెరిగి 5.54 లక్షల హెక్టార్లకు చేరింది. తమిళనాడులో కొత్త పెసర రాబడి ప్రారంభం అయింది. వచ్చే వారం నుండి రాబడులు పెరిగే అవకాశం కలదు. 

పెరిగిన యాసంగి పెసల విస్తీర్ణం

Image
   అంతర్జాతీయ విపణిలో పేడేశ్వర్ పెసలు 940 డాలర్లు, పొకాకొ 835 డాలర్లు, అన్నేశ్వర్ 800 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ స్థాయిలో స్థిరంగా ఉండడంతో ఆంధ్ర ప్రాంతపు నాణ్యమైన సన్నరకం చమ్కీపెసలు సేలం, త్రిచి, డిండిగల్, విరుధ్ నగర్ డెలివరి రూ. 150 తగ్గి రూ. 7200, సాదా రకం రూ. 7050 ధరతో వ్యాపారమెంది. గుజరాత్లో మార్చి 7 వరకు విస్తీర్ణం 8700 హెక్టార్లు ఉంది. మే నెలలో కొత్త సరుకు రాబడి ప్రారంభం కాగలదు.

అంతర్జాతీయంగా పెసర ధరలు పటిష్ఠం

Image
  దేశంలోని ప్రముఖ పెసల ఉత్పాదక రాష్ట్రాలలో ఖరీఫ్, రబీ పెసల రాబడులు తగ్గడం, డిమాండ్ పెరగడం వలన అంతర్జాతీయ మార్కెట్లో భారత్ ద్వారా డిమాండ్ రావడంతో పేడేశ్వర్ 40 డాలర్లు పెరిగి 940 డాలర్లు, పొకాకో 835 డాలర్లు మరియు అనిశేవా 25 డాలర్లు పెరిగి 800 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించడంతో ఆంధ్ర ప్రాంతపు సన్నరకం నాణ్యమైన చమ్కీపెసలు సేలం, త్రిచి, డిండిగల్, విరుధ్ నగర్ ప్రాంతాల డెలివరి ధర రూ. 150 పెరిగి రూ.750, సాదా రూ. 7200 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమయింది. 

పెసల దిగుమతులు పెరిగే అవకాశం

Image
 అంతర్జాతీయ మార్కెట్లో భారత్ ద్వారా డిమాండ్ రావడంతో పేడేశ్వర్ 900 డాలర్లు, పొకాకో 835 డాలర్లు మరియు అనిశేవా 20 డాలర్లు పెరిగి 775 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించడంతో చెన్నైలో పేడేశ్వర్ పెసలు రూ. 150 పెరిగి రూ.7200 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమయింది.

పెసలకు కొరవడిన గిరాకీ

Image
    దేశంలోని అన్ని పెసల ఉత్పాదక రాష్ట్రాలలో ఈ ఏడాది పెసలధరలు పురోగమించనందున నిల్వ అయిన సరుకు అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఎందుకనగా, ఏప్రిల్ నుండి గ్రీష్మకాలం సరుకు రాబడులు అందుబాటులో ఉండడమే ఇందుకు నిదర్శనం. ఆగస్టు వరకు ఈ సరుకు సరఫరా ఉండగలదు. చెన్నైలో దిగుమతి అయిన పేడేశ్వర్ పెసలు రూ.150 తగ్గి రూ.7050, మహారాష్ట్ర ప్రాంతం సాదా పెసలు రూ. 7100-7150, ఆంధ్ర ప్రాంతపు సన్న పెసలు రూ. 7100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

బలపడుతున్న పెసల ధరలు

Image
  20-02-2022 చెన్నైలో దిగుమతి అయిన పేడేశ్వర్ పెసలు రూ.7200, మహారాష్ట్రలో ఉద్గిర్లో సాదా పెసలు తమిళనాడు డెలివరి రూ. 7200-7250, ఆంధ్ర ప్రాంతపు సన్న పెసలు రూ. 7150-7200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ప్రస్తుత ఖరీఫ్, రబీ సీజన్ 2021-22 (జూలై-జూన్) లో దేశంలో పెసల ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 30.90 ల.ట. నుండి తగ్గి 30.60 ల.ట.కు పరిమితమైందని కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన తమ రెండవ ముందస్తు అంచనాలో పేర్కొన్నది. ప్రభుత్వం ఉత్పత్తి తగ్గగలదని అంచనా వ్యక్తం చేసినందున ఉత్పాదక కేంద్రాల వద్ద ఎడతెరిపిలేని సరఫరాతో పాటు వ్యాపారుల కొనుగోళ్లు వృద్ధి చెందినందున గత వారం పెసలు మరియు పప్పు ధర రూ. 100-200 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందాయి.