దేశంలోని అన్ని పెసల ఉత్పాదక రాష్ట్రాలలో ఈ ఏడాది పెసలధరలు పురోగమించనందున నిల్వ అయిన సరుకు అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఎందుకనగా, ఏప్రిల్ నుండి గ్రీష్మకాలం సరుకు రాబడులు అందుబాటులో ఉండడమే ఇందుకు నిదర్శనం. ఆగస్టు వరకు ఈ సరుకు సరఫరా ఉండగలదు. చెన్నైలో దిగుమతి అయిన పేడేశ్వర్ పెసలు రూ.150 తగ్గి రూ.7050, మహారాష్ట్ర ప్రాంతం సాదా పెసలు రూ. 7100-7150, ఆంధ్ర ప్రాంతపు సన్న పెసలు రూ. 7100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
అంతర్జాతీయ విపణిలో పేడేశ్వర్ పెసలు 900 డాలర్లు, పొకాక్ 835 డాలర్లు, అన్నేశ్వర్ 755 డాలర్లు కదలాడుతుండగా రాజస్తాన్లోని సుమేర్పూర్, కేక్ట్, కిషన్ ఢ్, గంగానగర్, జోధ్ పూర్ ప్రాంతాలలో రైతుల సరుకు రూ. 6000-7000, జైపూర్లో రూ. 6000-6600, పప్పు రూ. 7400- 7800, మిటుకులు రూ. 6000-7100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు