ముగిసిన వాము సీజన్
దేశంలోని ప్రముఖ వాము ఉత్పాదక కేంద్రాల వద్ద పంట కోతలు ముగియడంతో పాటు లాభసాటి ధరలు లభ్యమైనందున దాదాపు 80 శాతం మంది రైతులు తమ సరుకు మార్కెట్లకు తరలించారు. ఫలితంగా గత వారంలో రోజులలో అన్ని మార్కెట్లలో కలిసి 30 వేల బస్తాల సరుకు రాబడి అయింది. మరో నెల రోజులలో రాబడులకు తెర పడగలదు. ప్రస్తుతం ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు లేనందున ధరలు తగ్గి స్థిరపడ్డాయి.