Posts

Showing posts with the label sugarcane

పంచదార ఎగుమతులకు అనుమతి

Image
  న్యూ ఢిల్లీ - కేంద్ర ప్రభుత్వం పంచదార ఎగుమతుల నిబంధనలను సడలించి ఎగుమతిదారులు, మిల్లులకు ముడి పంచదార షిప్మెంట్ కోసం ఇవ్వబడే పర్మిట్ క్రింద పంచదార షిప్మెంట్కు ప్రత్యామ్నాయం ఇవ్వడంతో కొన్ని మిల్లులకు - అనుకూలంగా మారింది. ఎందుకనగా 100 లక్షల టన్నులకు పైగా పంచదార ఎగుమతికి అనుమతి ఇవ్వడంపై సందేహ పరిస్థితి ఉండడంతో ముందు నుండే ముడి పంచదార నుండి రిఫెండ్ సరుకు తయారు చేయడం జరిగింది.

విస్తృతంగా పెరిగిన చెరుకు సేద్యం - మిల్లర్లపై భారం

Image
 2022-23 సీజన్ కోసం దేశంలో చెరకు సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 54.42 ల.హె. నుండి 54.67 ల.హె.కు విస్తరించిందని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. వృద్ధి చెందిన విస్తీర్ణం స్వల్పమే అయినప్పటికీ సాధారణంతో పోలిస్తే 15.39 అధికమని చెప్పబడుచున్నది. అయితే, ఈసారి చెరకు సేద్యం ఉపగ్రహ ఛాయాచిత్రం ఆధారంగా గత ఏడాదితో పోలిస్తే 55.83 ల.హె. నుండి 4 శాతం వృద్ధి చెంది 58.28 ల.హె.కు విస్తరించిందని భారత పంచదార మిల్లర్ల సమాఖ్య (ఐఎస్ఎంఎ) పేర్కొన్నది. దీనిని బట్టి రాబోయే సీజన్లో పంచదార ఉత్పత్తి కూడా భారీగానే ఉండగలదని స్పష్టమవుతున్నది.

మరో రెండు,మూడేళ్ల వరకు పంచదార ధరలకు నో ఛాన్స్

Image
  20-02-2022 ఇథనాల్ తయారీకి చేయూత నందించినప్పటికీ మరో రెండు మూడేళ్ల వరకు పంచదార ధరలు ఇనుమడించే అవకాశం కనిపించడం లేదని మిల్లర్లు మరియు వ్యాపారులు తమ అభిప్రాయం వెల్లడించారు. పంచదార ఉత్పత్తితో పాటు ఎగువుతులు పురోగమించనందున దిగ్గజ స్టాకిస్టులు మార్కెట్ నుండి కనుమరుగయ్యారు. దిగ్గజ వ్యాపారులు కూడా తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నారు.