Posts

Showing posts with the label Ajvain

స్థిరత్వం చేకూరుతున్న వాము ధరలు

Image
    గత వారం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో వాము రాబడులు డీలా పడినందున మీడియం సరుకు ధరలు ప్రతి క్వింటాలుకు రూ. 150-200 వృద్ధి చెందగా నాణ్యమైన సరుకు ధరలు చెక్కుచెదరలేదు. 

హెచ్చుముఖంలో వాము

Image
   దేశంలో ఈ ఏడాది ఉత్పత్తి తగ్గడం మరియు స్థానిక, ఎగుమతి డిమాండ్ పెరగడంతో ధరలు హెచ్చుముఖంలో ఉన్నాయి. నాణ్యమైన రకాల ధరలు తగ్గే అవకాశంలేదని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

తగ్గిన వాము ఉత్పత్తి

Image
   రాబోయే సీజన్ లో వాము ఉత్పత్తి తగ్గనున్నట్లు సంకేతాలు అందుతున్నందున ధరలు ఇనుమడిస్తున్నాయి. ఈ ఏడాది సరుకు నిల్వలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలతో పంటకు తీరని నష్టం వాటిల్లినందున ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 40-45 శాతం తగ్గగలదనే విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు రైతులు వాము పంటను పెకలించి ఇతర పంటల సాగు చేపడుతున్నారు.

వాము

Image
   ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు మార్కెట్లో గత శుక్రవారం 500 బస్తాల వాము రాబడిపై యావరేజ్ సరుకు రూ. 10,500-11,500, తెలుపు రకం రూ. 12,000-12,500, మీడియం బెస్ట్ 13,000–14,000, నాణ్యమైన సరుకు రూ. 15,000–16,000,

వాము ధరలు పెరిగే అవకాశం లేదు

Image
   గత వారం ఉత్పాదక కేంద్రాల వద్ద నిల్వలు కనీస స్థాయికి చేరడంతో మీడియం రకాల ధర రూ. 300-400 క్షీణించింది. కర్నూలు ప్రాంతపు వ్యాపారులు నిల్వ సరుకును వేగంగా విక్రయిస్తున్నారు. ఎందుకనగా పంట విత్తడం ప్రారంభమైంది. మరియు రైతుల వద్ద సుమారు 10-12 వేల బస్తాలు, వ్యాపారుల వద్ద 40-50 వేల బస్తాల వాము నిల్వ ఉన్నట్లు సమా చారం. అంతేకాకుండా వికారాబాద్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో వర్షాల వలన పత్తి, మొక్కజొన్న, కంది మొదలగు పంటలకు నష్టం వాటిల్లడంతో రెత్తులు వీటిని తొలగించి వాము సాగు చేస్తున్నందున ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది. 

వాము ధరలకు మద్దతు

Image
   గత వారం ఉత్పాదక కేంద్రాల వద్ద నాణ్యమైన రకాల ధర రూ. 400-500 వృద్ధిచెందింది. కర్నూలు మార్కెట్లో గత మంగళవారం, శుక్ర వారం కలిసి 1200-1300 బస్తాల వాము రాబడిపై యావరేజ్ సరుకు రూ. 10,500-11,500, తెలుపు రకం రూ.12,000-12,500, మీడియం సరుకు తెలుపు రూ. 13,000–14,000, నాణ్యమైన సరుకు రూ. 15,500-16,000 ధరతో వ్యాపారమైంది. 

వాము

Image
 వర్షాకాలం ప్రారంభంతో పాటు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్,బీహార్, రాజస్తాన్, ఝార్ఖండ్ లాంటి వాము ఉత్పాదక రాష్ట్రాలలో గిరాకీ నెలకొన్నందున ఉత్పాదక ప్రాంతాలలోని మార్కెట్లలో ధర ప్రతి క్వింటాలుకు రూ. 400-500 వృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు మార్కెట్లో గత మంగళ, శుక్రవారాలలో కలిసి 2200-2300 బస్తాల వాము రాబడిపై ఎరుపు. సరుకు మీడియం రూ. 9800-10,500, తెలుపు రూ. 10,600-12,000, నాణ్యమైన సరుకు రూ. 13,000-14,500, ఆకుపచ్చ సరుకు రూ. 15,500-16,000 ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది. మధ్య ప్రదేశ్లోని నీమచ్లో గుజరాత్ నుండి గత వారం 1000-1200 బస్తాల సరుకు రాబడి కాగా, మీడియం యావరేజ్ రూ. 9000-9500, మీడియం రూ. 10,000-11,800, నాణ్యమైన సరుకు రూ.12,000-12,500, ఆకుపచ్చ సరుకు రూ. 13,200-13,500, జార్రాలో 100-150 బస్తాల సరుకు అమ్మకంపై రూ. 91000-11,000, పోహరిలో 150-200 బస్తాలు యావరేజ్ సరుకు రూ. 7000-7500, మీడియం బెస్ట్ రూ.8500-9000 మరియు గుజరాత్లోని జామ్నగర్ లో గత వారం 1800-2000 బస్తాల సరుకు రాబడిపై యావరేజ్ రూ. 1850 - 9000, మీడియం రూ. 10,500-11,000, మీడియం బెస్ట్ రూ.. 11,500-12,000 ప్రతి క్వింటాలు...

తగ్గిన వాము సేద్యం

Image
   మధ్యప్రదేశ్లో వాము సేద్యం ప్రక్రియ ప్రారంభం కాగా, గుజరాత్లో ఇంకా మొదలుపెట్టలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జూలై చివరి నుండి ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. పత్తి, సన్ఫ్లవర్ లాంటి నూనెగింజల పంటలపై రైతులు తమ దృష్టి సారిస్తున్నారు. కావున మహారాష్ట్ర మరియు దక్షిణాది రాష్ట్రాలలో సేద్యం పరిధి కుంచించుకుపోయే అవకాశం కనిపిస్తున్నది. ఈ ఇరు ప్రాంతాలలో నిల్వలు అడుగంటాయి. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు మరియు పరిసర ప్రాంతాలలో వాము నిల్వలు 40-50 వేల బస్తాలు. మరియు రైతుల వద్ద 10-15 వేల బస్తాల సరుకు నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. 

వాము పటిష్టం

Image
  ఆంధ్రలోని వాము ఉత్పాదక కేంద్రాలలో ఇతర రాష్ట్రాల ప్యాకింగ్ తయారీదారుల డిమాండ్ రావడంతో నాణ్యమైన వాము ధర రూ. 800-1000 పెరి గింది. మరోవైపు మధ్య ప్రదేశ్, గుజరాత్ మొదలగు రాష్ట్రాలలో గిరాకీ తక్కువగా ఉంది. ఎందుకనగా మధ్య ప్రదేశ్లో యాసంగి పంట రాబడులు ప్రారంభం అయ్యాయి. 

వాము స్థిరం

Image
 వేసవితాపంతో వాము వినియోగం తగ్గే అంచనాతో గత వారం గిరాకీ తగ్గి ధర రూ. 400-500 ప్రతి క్వింటాలుకు క్షీణించింది. ఆంద్రప్రదేశ్ లోని కర్నూలు మార్కెట్లో గత సోమవారం నుండి బుధవారం వరకు 5-6 వేల బస్తాల వాము రాబడి కాగా, ఎరుపు రకం సరుకు రూ. 12,000–13,000, తెలుపు రకం రూ.13,500-14,500, ఆకుపచ్చ సరుకు రూ. 17,000-18,000, నాణ్యమైన ఆకుపచ్చ సరుకు రూ. 20,000–21,000 మరియు 

తగ్గుతున్న వాము ధరలు

Image
  వేసవి తాపం పెరిగిన నేపథ్యంలో వాము వినియోగం తగ్గడంతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో హోళి సందర్భంగా మార్కెట్లు మూసి ఉండడంతో గత వారం ధరలు రూ. 400-500 ప్రతి క్వింటాలుకు తగ్గాయి.

తగ్గుతున్న వాము రాబడులు

Image
  వికారాబాద్, మర్పల్లి, శంకర్పల్లి, సదాశివపేట ప్రాంతాలలో కొత్త సరుకు రాబడులు తగ్గాయి. కర్నూలు, సరిహద్దులో గల కర్ణాటకలోని వాము ఉత్పాదక ప్రాంతాలలో 65–70 శాతం సరుకు అమ్మకమైనట్లు సమాచారం. దీనితో మార్చి చివరివారం నుండి రాబడులు తగ్గగలవు. వేసవిలో వినియోగం కూడా తక్కువగా ఉంటుంది. పెట్టుబడి అధికంగా ఉండడంతో పాటు డిమాండ్ ఉండడంతో కిరాణా వ్యాపారులు కూడా అమ్మకానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నారు. దీనితో హోల్ సేల్ మార్కెట్లో అమ్మకాలు పెరగడం లేదు.

ముగిసిన వాము సీజన్

Image
 దేశంలోని ప్రముఖ వాము ఉత్పాదక కేంద్రాల వద్ద పంట కోతలు ముగియడంతో పాటు లాభసాటి ధరలు లభ్యమైనందున దాదాపు 80 శాతం మంది రైతులు తమ సరుకు మార్కెట్లకు తరలించారు. ఫలితంగా గత వారంలో రోజులలో అన్ని మార్కెట్లలో కలిసి 30 వేల బస్తాల సరుకు రాబడి అయింది. మరో నెల రోజులలో రాబడులకు తెర పడగలదు. ప్రస్తుతం ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు లేనందున ధరలు తగ్గి స్థిరపడ్డాయి. 

తగ్గిన మిరప ఉత్పత్తి - రాబడులు పెరిగే అవకాశం

Image
  01-02-2022 వ్యాపారస్తుల కథనం ప్రకారం గుంటూరు మార్కెట్లో గతవారం కేవలం 4 రోజుల మార్కెట్లో కర్నూలు, ఎమ్మిగనూరు, ప్రకాశం మరియు భద్రాచలం ప్రాంతాల నుండి 3.30 లక్షల బస్తాల కొత్త మిరప రాబడిపై ఇందులో 60 శాతం నిమ్ము రకం మరియు 40 శాతం నాణ్యమైన సరుకు రాబడిపై 3.25 లక్షల బస్తాల సరుకు అమ్మకం కాగా, పెద్ద యూనిట్లు మరియు స్టాకిస్టుల కొనుగోళ్లతో అన్ని డీలక్స్ మరియు పౌడర్ రకాల ధర రూ. 200-300 ప్రతిక్వింటాలుకు పెరిగింది. అయితే, తేజ మరియు ఇతర రకాల ధరలు స్థిరంగా ఉన్నాయి. వచ్చే వారం నుండి కొత్త సరుకు రాబడులు పెరిగే అవకాశం ఉంది. నాణ్యమైన సరుకు ధరలు పెరిగే అంచనాతో ప్రస్తుతం అనేక మంది రైతులు మరియు స్టాకిస్టులు తమ సరుకు విక్రయించడానికి ముందుకు రావడంలేదు, ఎందుకనగా ఉత్పత్తి తగ్గడంతో ఈ ఏడాది సీజన్ ప్రారంభం నుండి ధరల స్థాయి మెరుగ్గా ఉంది.