తగ్గిన వాము సేద్యం

 


 మధ్యప్రదేశ్లో వాము సేద్యం ప్రక్రియ ప్రారంభం కాగా, గుజరాత్లో ఇంకా మొదలుపెట్టలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జూలై చివరి నుండి ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. పత్తి, సన్ఫ్లవర్ లాంటి నూనెగింజల పంటలపై రైతులు తమ దృష్టి సారిస్తున్నారు. కావున మహారాష్ట్ర మరియు దక్షిణాది రాష్ట్రాలలో సేద్యం పరిధి కుంచించుకుపోయే అవకాశం కనిపిస్తున్నది. ఈ ఇరు ప్రాంతాలలో నిల్వలు అడుగంటాయి. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు మరియు పరిసర ప్రాంతాలలో వాము నిల్వలు 40-50 వేల బస్తాలు. మరియు రైతుల వద్ద 10-15 వేల బస్తాల సరుకు నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. 


గత వారం ఉత్పాదక కేంద్రాల వద్ద కొనుగోళ్లు డీలా పడినందున ధరలకు ప్రతిష్టంభన ఏర్పడింది. గుజరాత్లో యాసంగి పంట రాబడులు సన్నగిల్లాయి. కర్నూలు మార్కెట్లో గత మంగళ, శుక్రవారాలలో కలిసి 2000-2200 బస్తాల సరుకు రాబడిపై ఎరుపు రకం రూ. 10,500-11,500, మీడియం తెలుపు రూ. 12,500–14,500, నాణ్యమైన సరుకు రూ. 15,000-16,000 ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది.


మధ్య ప్రదేశ్ లోని నీమచ్లో గుజరాత్ నుండి గత వారం 800-1000 బస్తాల సరుకు రాబడి కాగా, మీడియం యావరేజ్ రూ.8500-9000, మీడియం రూ. 10,000-11,000, నాణ్యమైన సరుకు రూ.12,500 - 13,500, జామ్రాలో నిల్వ సరుకు రూ.8000-10,000, పోహరిలో 100-150 బస్తాలు యావరేజ్ సరుకు రూ. 7000-7500, మీడియం బెస్ట్ రూ. 8500-9000 మరియు గుజరాత్లోని జామ్నగర్లో గత వారం 100-200 బస్తాల సరుకు రాబడిపై యావరేజ్ రూ. 7000-7500, మీడియం రూ. 8500-9000, మీడియం బెస్ట్ రూ. 11,000-11,500, ఆకుపచ్చ సరుకు మీడియం రూ. 13,000–14,000 ప్రతి క్వింటాలు ధరతోక్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు