Posts

Showing posts with the label మినుములు

మినుములపై కొనుగోలుదారుల శీతకన్ను

Image
  పెరుగుతున్న పప్పు ధాన్యాల ధరల నియంత్రించేందుకు ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యలు, కొత్త మినుముల రాబడులకు ఆసన్నమైన తరుణం మరియు స్టాకిస్టుల ఆసక్తి సన్నగిల్లినందున గత వారం మినుముల ధర ప్రతి క్వింటాలుకు రూ. 150-200 పతనమైంది.

మినుముల ధరలపై భారీ ఆశ లేనట్లే

Image
   గ్రీష్మ కాలంలో మినుముల ఉత్పత్తి గణనీయంగా రాణిస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొత్త మినుముల సరఫరా జోరందుకుంటున్నది. మయన్మార్లో పంట సంతృప్తికరంగా ఉన్నందున భారత్ సరఫరా కొనసాగే అంచనాతో ధరలు పురోగమించే అవకాశం లేదు. ఎందుకనగా, అంతర్జాతీయ విపణిలో మయన్మార్ మినుములు 5 డాలర్లు తగ్గి ఎఫ్ఎక్యూ 770 డాలర్లు, ఎస్క్యూ 855 డాలర్ ప్రతి టన్ను ప్రతిపాదించినందున ముంబైలో ధర రూ. 100 పెరిగి ఎఫ్ఎక్యూ కొత్త సరుకు రూ. 6300, పాత సరుకు రూ.6200, చెన్నైలో ఎఫ్ఎక్యూ రూ. 6150-6050, పాత సరుకు రూ. 6100, ఎస్యూ కొత్త సరుకు రూ.6750-6550, పాత సరుకు రూ. 6650, దిల్లీలో ఎస్క్యూ రూ. 7050-7100, ఎఫ్ఎక్యూ రూ.6450-6500, కోల్కతాలో రూ. 6250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడు సరుకు చెన్నై డెలివరి రూ.6900-7000, ఆంధ్రప్రదేశ్ పియు-37 రకం రూ. 6700 మరియు 402 రకం సరుకు రూ. 7100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

తగ్గిన మినుము సేద్యం - ధరలు బలోపేతం

Image
  05-12-2021 ప్రస్తుత రబీ సీజన్లో దేశంలో డిసెంబర్ 3 వరకు మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 3.50 ల.హె. నుండి తగ్గి 3.22 ల.హె.కు పరిమితమైందని కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. ఇందులో తమిళనాడులో 2.23 ల.హె. నుండి తగ్గి 1.66 ల.హె.కు పరిమితం కాగా, ఆంధ్రప్రదేశ్లో 67 వేల హెక్టార్ల నుండి పెరిగి 82 వేల హెకార్లు,ఒడిశ్శాలో 40 వేల హెక్టార్ల నుండి 41 వేల హెక్టార్లకు విస్తరించింది. అయితే, భారీ వర్షాలు కురిసినందున ఆంధ్రప్రదేశ్లో పంటకు నష్టం వాటిల్లే అంచనా వ్యక్తమవుతున్నది. ఒడిశ్శాలో జవాద్ తుపాను సంభవించినందున వర్ధమాన పంటలకు నష్టం పొంచివున్నట్లు తెలుస్తోంది. ఖరీఫ్ సీజన్ పంట నిల్వలు అడుగంటాయి. వచ్చే ఏడాది కోసం తమిళనాడులో డిమాండ్ ఉండగలదు.కావున ఇలాంటి పరిస్థితులలో ధరలు కుంగుబాట పట్టే అవకాశం లేదు.

మినుము కొనుగోళ్లు పెరిగే అవకాశం - గత వారం మార్కెట్ ధరలు

Image
  18-10-2021 గత వారం దక్షిణాది రాష్ట్రాలలో దసరా పండుగ గిరాకీ ముగిసినందున పప్పు కోసం గిరాకీ కొరవడినందున మిల్లర్లు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు మినుములు కొనుగోలు చేస్తున్నందున ధరలు నిలకడగా మారాయి. అయితే, తమిళనాడు ప్రభుత్వం రైతుల నుండి మినుములు, పెసలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించడంతో ధరలు మందగించే అవకాశం లేదు. 

దక్షిణాదిలో మినుముకి పెరుగుతున్న డిమాండ్- గత వారం మార్కెట్ ధరలు

Image
12-10-2021 అంతర్జాతీయ మార్కెట్లో మయన్మార్ ఎఫ్ఎక్యూ 950 డాలర్లు, ఎస్ క్యూ 30 డాలర్లు పెరిగి 1100 డాలర్లు ప్రతి టన్ను ప్రతిపాదించబడింది. అయితే దక్షిణ భారత పప్పు మిల్లర్లు ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రాంతాల నుండి కొత్త సరుకు కొనుగోలు చేస్తున్నారు. ఎందుకనగా, కొత్త సరుకులో జిగురు అధికంగా ఉండడంతో పాటు తీపిదనం ఉండడం వలన అల్పాహారం తయారీదారుల కోసం అమ్మకాలు అధికంగా ఉంటాయి. ఈ ఏడాది దేశంలోని ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలలో సరుకు క్వాలిటీ డ్యామేజ్ అయింది.