తగ్గిన మినుము సేద్యం - ధరలు బలోపేతం

 

05-12-2021

ప్రస్తుత రబీ సీజన్లో దేశంలో డిసెంబర్ 3 వరకు మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 3.50 ల.హె. నుండి తగ్గి 3.22 ల.హె.కు పరిమితమైందని కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. ఇందులో తమిళనాడులో 2.23 ల.హె. నుండి తగ్గి 1.66 ల.హె.కు పరిమితం కాగా, ఆంధ్రప్రదేశ్లో 67 వేల హెక్టార్ల నుండి పెరిగి 82 వేల హెకార్లు,ఒడిశ్శాలో 40 వేల హెక్టార్ల నుండి 41 వేల హెక్టార్లకు విస్తరించింది. అయితే, భారీ వర్షాలు కురిసినందున ఆంధ్రప్రదేశ్లో పంటకు నష్టం వాటిల్లే అంచనా వ్యక్తమవుతున్నది. ఒడిశ్శాలో జవాద్ తుపాను సంభవించినందున వర్ధమాన పంటలకు నష్టం పొంచివున్నట్లు తెలుస్తోంది. ఖరీఫ్ సీజన్ పంట నిల్వలు అడుగంటాయి. వచ్చే ఏడాది కోసం తమిళనాడులో డిమాండ్ ఉండగలదు.కావున ఇలాంటి పరిస్థితులలో ధరలు కుంగుబాట పట్టే అవకాశం లేదు.


ఆంధ్రప్రదేశ్లో క్రిష్ణాజిల్లా సరుకు 2 శాతం డ్యామేజ్ మరియు 2 శాతం మట్టి కండిషన్ సరుకు రూ. 7400, 

మహారాష్ట్రలోని అకల్కోట్ ప్రాంతం సరుకు రూ. 7800, 

కర్మాలా ప్రాంతం సరుకు రూ. 8000,

 కర్ణాటకలోని బీదర్, బాల్కీ ప్రాంతాల సరుకు రూ. 7750,

 గుజరాత్లోని రాజ్కోట్ ప్రాంతం టి-9 మినుములు చెన్నై డెలివరి రూ. 8150-8250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 అంతర్జాతీయ విపణిలో మయన్మార్ మినుములు ఎఫ్ఎక్యూ 20 డాలర్లు తగ్గి 895 డాలర్, ఎస్యూ 1000 డాలర్ ప్రతి టన్ను ప్రతిపాదించినందున ముంబైలో ఎఫ్ఎక్యూ కొత్త సరుకు రూ. 6950, పాత సరుకు రూ. 6850, చెన్నైలో ఎస్క్యూ రూ. 7525, ఎఫ్ఎక్యూ రూ. 6875, కోల్కతాలో రూ. 7000 మరియు ఆంధ్రప్రదేశ్లోని క్రిష్ణా జిల్లా పాలిష్ మినుములు రూ. 50 తగ్గి రూ.7600, అన్-పాలిష్ రూ. 7300, మీడియం రూ. 7300, నంద్యాలలో పాలిష్ మినుములు రూ. 7300, అన్-పాలిష్ రూ.7100, ప్రొద్దుటూరు, కడప ప్రాంతాలలో పాలిష్ సరుకు రూ. 7100, అన్-పాలిష్ రూ. 6900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.మహారాష్ట్రలోని లాతూర్ మార్కెట్లో రూ. 5000-7200, సోలాపూర్లో రూ. 5000–7300, జాల్నాలో రూ. 3000-6500 లోకల్ లూజ్ మరియు అకోలాలో లారీ బిల్టి రూ. 6850-6900, జల్గాంవ్లో మధ్యప్రదేశ్ ప్రాంతం సరుకు రూ. 7000, మహారాష్ట్ర ప్రాంతం సరుకు రూ. 7200, అకోలాలో మోగర్ మినుములు రూ. 9500-9600, బోల్డు సరుకు రూ. 9900-10,100, మధ్యప్రదేశ్ మార్కెట్లలో రూ. 3000-6100 మరియు రాజస్తాన్లోని కేక్క్లో 2 వేల బస్తాలు రూ. 6000-6600, కోటా, సుమేర్ పూర్, సవాయిమాధేపురా ప్రాంతాలలో రూ.5000-6700, ఉత్తరప్రదేశ్లోని మహోబా, లలిత్ పూర్ ప్రాంతాలలో రూ.4000-6600, ఝాన్సీలో రూ. 3050-6050 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog