తగ్గిన కందుల ఉత్పత్తి - పెరిగిన ప్రభుత్వ కొనుగోళ్లు

అధికారుల కథనం ప్రకారం బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం వారి సమావే శంలో ధరల మద్దతు పథకం క్రింద కందులు, మినుములు, సిరిశనగ కొనుగోళ్ల గరిష్ట పరిమితిని మొత్తం ఉత్పత్తి యొక్క 25 శాతం నుండి పెంచి 40 శాతానికి చేయడం జరిగింది. అయితే సెప్టెంబర్ 2 వరకు కంది పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 47.56 ల.హె. నుండి తగ్గి 44.86 ల.హె.కు చేరింది.