కందుల ఉత్పత్తి తగ్గే అంచనా

 


ప్రస్తుత పంట కాలం (2021 జూలై - 2022 జూన్) లో కందుల ఉత్పత్తి 43.50 ల.ట. నుండి స్వల్పంగా తగ్గి 43.40 ల.ట. ఉండగలదని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ నాల్గవ ముందస్తు అంచనాలో తమ అభిప్రాయం వెల్లడించింది. ఇదిలా ఉండగా, ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నందున ప్రభుత్వ అంచనా కన్నా మరింత తగ్గగలదని వ్యాపారులు పేర్కొన్నారు. తద్వారా వ్యాపారులు ఇప్పటి నుండే అప్రమత్తమైనందున ధరలకు మద్దతు లభిస్తున్నది. 


అయితే సరుకు సరఫరా మరియు ధరలపై ప్రభుత్వం తమ దృష్టి సారిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు విచారణ చేపడుతూనే ఉంది. ఇదే సమయంలో ఆఫ్రికా దేశాలలో కొత్త సరుకు రాబడులకు తరుణం ఆసన్నమైనందున ధరల పెరుగుదలకు కళ్లెం పడింది.అంతర్జాతీయ విపణిలో లెమన్ మరియు లింకిలి కందులు గత సోమవారం ప్రతి టన్ను 930 డాలర్ పలుకగా శనివారం నాటికి 5 డాలర్ పెరిగి 935 డాలరు చేరినప్పటికీ కొనుగోళ్లు క్షీణించినందున లెమన్ కందుల ధర ప్రతి క్వింటాలుకు రూ. 200 తగ్గి రూ. 7250, అరుశ రూ. 5950, మొజాంబిక్ గజరి కందులు రూ. 5850, తెల్లకందులు రూ. 5900, మట్వారా రూ. 5700-5750, మాలవి ఎర్ర కందులు రూ.5200-5300 ధరతో వ్యాపారమైంది.


ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఆగస్టు 19 నాటికి దేశంలో కందుల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 46.74 ల.హె. నుండి తగ్గి 43.38 ల.హె.కు పరిమితమైందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. ఇందులో ఆగస్టు 15 నాటికి గుజరాత్లో 2,23,388 హెక్టార్ల నుండి తగ్గి 2,07,952 హెక్టార్లకు పరిమితమైంది.

 గత వారం కట్ని స్వేచ్ఛా మార్కెట్లో కందులు రూ. 8300-800, పప్పు మేలిమి రకం రూ. 10,800-10,900, జబల్పూర్ కందులు రూ. 5500-7700, పిపరియాలో 1500 బస్తాల సరుకు రాబడిపై రూ.60006800,ఇండోర్లో మహారాష్ట్ర కందులు రూ.8000-8100, కర్ణాటక కందులు రూ. 8200-8300, బెంగుళూరు కోసం గుల్బర్గా ప్రాంతం పప్పు సార్టెక్స్ రూ. 11,000-11,200, నాన్-సార్టెక్స్ రూ. 10,500-10,600, 

మహారాష్ట్ర సరుకు రూ.10,800 -11,400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని లాతూర్లో 63-నంబర్ మరియు మారుతి కందులు రూ. 8000-8200, తెల్ల కందులు రూ. 7000 - 7800, గులాబీ కందులు రూ. 8000-8200, సోలాపూర్ లో ప్రతి రోజు 2 వాహనాల కందుల రాబడిపై రూ. 7000-7900, ధరియాపూర్లో రూ.7800-8000, జాల్నాలో తెల్లకందులు రూ.6700-7650, ఎర్రకందులు రూ.7000-7250, అమరావతిలో రూ. 7700-7900, అలాగని కందులు రూ. 8050 మరియు మేలిమి రకం పప్పు రూ. 11,000-11,200, 

ఆంధ్రప్రదేశ్లోని వినుకొండలో కందులు రూ.7450, పప్పు నిమ్ము సరుకు రూ. 10,100, ఎండు సరుకు రూ. 10,300, కర్నూలులో కందులు రూ. 7350, కల్బుర్గిలో పప్పు మేలిమి రకం రూ. 10,500-11,000, బాల్కీలో తెల్లకందులు రూ. 7200-7400, ఎర్ర కందులు రూ. 7400-7600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది..

Comments

Popular posts from this blog