Posts

Showing posts from March, 2022

𝐁𝐘𝐀𝐃𝐆𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 31-03-2022 🌶️

Image
  𝐁𝐘𝐀𝐃𝐆𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 31-03-2022 🌶️   *(NEW ARRIVALS APPROX 16000 BAGS)*   DABBI DLX 32000-36000 DABBI BEST 28000-32000 KDL DLX 25000-28500(no qty) KDL BEST 23000-25000 2043 DLX 25000-27000 (no qty) 2043 BEST 20000-24500 5531 BEST 18000-20700 5531 M BEST 14000-16500 334.s 10 . 13500-17000 KDL MEDIUM 10000-13500 KDL FATKI 2500-2800 SEED FATKI 6000-9000   DABBI QTY TIGHT BY 1500   OTHERS QTY STEADY

𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 31-03-2022 🌶️

Image
 

𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐉𝐀𝐍𝐃𝐀 🚩 31-03-2021

Image
 

𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 30-03-2022 🌶️

Image
 

𝐇𝐘𝐃𝐄𝐑𝐀𝐁𝐀𝐃 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 30-03-2022🌶️

Image
  𝐇𝐘𝐃𝐄𝐑𝐀𝐁𝐀𝐃 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 30-03-2022🌶️   (ARRIVALS NEW 5000/6000 BAGS)   NEW MIRCHI TEJA:10000/18000 DHABBI BYADGI: MED BEST:26000/27000 BEST:30000/33000 BYADGI VARITIES:21000/27000 273:MED BEST:16000/18000 SUPER10:14000/16500/17000 BEST 17500 C5:15000/18000 BEST 18500 TEJA FATKI:5000/8000 MEDIUM BEST:9000/10000 FATKI:4000/6000

𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 30-03-2022 🌶️

Image
 

𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐉𝐀𝐍𝐃𝐀 🚩 30-03-2021

Image
 

రెట్టింపైన మినుము పంట విస్తీర్ణం

Image
  25, మార్చి వరకు దేశంలో యాసంగి మినుముల విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1.38 ల.హె. నుండి పెరిగి 2.31 ల.హె.లకు చేరింది. దీనితో తమిళనాడు, మధ్యప్రదేశ్ నుండి సరఫరా పెరిగే అవకాశం ఉన్నందున మిల్లర్లు సరుకు నిల్వ చేయడం లేదు. ఎందుకనగా దేశంలో సమృద్ధిగా సరుకు నిల్వలు ఉన్నాయి. ఇప్పటికీ, రబీ సీజన్ సరుకు సరఫరా అవుతున్నది.

శనగలు పటిష్ఠం

Image
  దేశంలో ఉగాది పండుగ సందర్భంగా శనగపప్పుకు గిరాకీ నెలకొనడంతో శనగలు, పప్పు ధరలు రూ. 50-100 ప్రతి క్వింటాలుకు పెరిగాయి.

బొబ్బర్లు

Image
   కర్ణాటకలోని బళ్లారి, బెంగుళూరు, హరిసెకేరే, మెస్తూరు, హగరిబమ్మనహల్లి, చిత్రదుర్గ ప్రాంతాలలో ప్రతిరోజు 1000 బస్తాల కొత్త బొబ్బర్ల రాబడిపై 

ఉలువలు

Image
   గత వారం మిగులు నిల్వలు సమాప్తం కావడం మరియు ఈ ఏడాది విస్తీర్ణం తగ్గడంతో భవిష్యత్తులో ఉలువల ధర పెరిగి రూ. 5500-6000 ప్రతి క్వింటాలుకు చేరే అవకాశం ఉండడంతో స్టాకిస్టులు అప్రమత్తమయ్యారు.

రాగులు

Image
  కర్ణాటకలోని బెంగుళూరు, అరిసెకేరి, దావణగిరి,తుంకూరు, షిమోగా తదితర అన్ని మార్కెట్లలో ప్రతి రోజు 3-4 వేల బస్తాల కొత్త రాగుల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 2600-3000, మీడియం సరుకు రూ. 2200-2500, అ క్లీన్ రూ. 1600-1800 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది.

ఏప్రిల్ లో పెరగనున్న మొక్కజొన్న రాబడులు

Image
  మార్చి 25, 2022 వరకు యాసంగి మొక్కజొన్న విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 3.41 ల.హె. నుండి పెరిగి 3.93 లక్షల హెక్టార్లకు చేరింది. ఏప్రిల్ 15 తరువాత బిహార్లో మరియు చివరి నాటికి జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్లోని తెనాలి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం ప్రాంతాలలో కొత్త మొక్కజొన్న రాబడులు ఏప్రిల్ రెండవ వారం నుండి ప్రారంభం కాగలవు. అయితే పౌల్ట్రీ పరిశ్రమ మరియు ఎగుమతిదారుల కోసం డిమాండ్ ఉండడంతో ధరలు తగ్గడం లేదు.

𝐇𝐘𝐃𝐄𝐑𝐀𝐁𝐀𝐃 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 29-03-2022🌶️

Image
  𝐇𝐘𝐃𝐄𝐑𝐀𝐁𝐀𝐃 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 29-03-2022🌶️   (ARRIVALS NEW 4000/5000 BAGS)   NEW MIRCHI TEJA:10000/18000 DHABBI BYADGI: MED BEST:26000/27000 BEST:30000/33000 BYADGI VARITIES:21000/27000 273:MED BEST:16000/18000 SUPER10:14000/16500/17000 BEST 17500 C5:15000/18000 BEST 18500 TEJA FATKI:5000/8000 MEDIUM BEST:9000/10000 FATKI:4000/6000

మిర్చి ధరలపై నాణ్యత ప్రభావం

Image
మిర్చియార్డుకు వచ్చిన నాసిరకం సరకు  మిర్చి ధరలపై నాణ్యత ప్రభావం చూపుతోంది.యార్డుకు వచ్చే బస్తాల్లో అధిక శాతం నాసిరకంగా ఉండటంతో ధరల్లో కోత పడుతుంది. మరో వైపు ఎగుమతులు ఆశించిన మేర లేకపోవడం ఆ ప్రభావం ధరలపై కనిపిస్తుందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. అయినప్పటికీ క్రయవిక్రయాలు జోరుగానే సాగుతున్నాయి. గత వారంతో పోలిస్తే ధర తగ్గినప్పటికీ ఆశించిన ధర లభిస్తుండటంతో రైతులు వచ్చిన పంట వచ్చినట్లు అమ్మకాలకు ముందుకు వస్తున్నారు.

𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 29-03-2022 🌶️

Image
 

𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 29-03-2022 🌶️

Image
 

𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐉𝐀𝐍𝐃𝐀 🚩 29-03-2021

Image
 

అముదాలకు కొరవడిన గిరాకీ

Image
  మార్చి చివరి వారం కారణంగా మిల్లర్ల కొనుగోళ్లు తగ్గడం మరియు రెత్తుల అమ్మకాలు పెరగడంతో ధరలు స్థిరంగా ఉన్నాయి. దీనితో వాయిదా మార్కెట్లో ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడింది. ఎన్సీడిఇఎక్స్ వద్ద గత సోమవారం ఏప్రిల్ వాయిదా రూ. 7250 తో ప్రారంభమైన తర్వాత రూ. 7236 వద్ద ముగిసింది. మే వాయిదా రూ. 7344తో ప్రారంభమె రూ. 7348 వద్ద ముగిసింది. గుజరాత్లోని పాటన్, సిద్దపూర్, కడి, పలంతూర్, సాబర్కాంట, ఊంఝా, బీజాపూర్, విశానగర్, మెహసానా తదితర ప్రాంతాలలో దినసరి 1 లక్ష బస్తాలకు పెగ్డా ఆముదాలు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 7000-7325, మీడియం రూ. 6500-6800, యావరేజ్ రూ. 6000-6100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

యాలకుల ధరలు

Image
 పెద్ద యాలకుల వేలాలు సిలిగుడి - మార్చి 24న పెద్ద యాలకుల వేలాలలో సిక్కింలోని సింగటంలో పెద్ద గింజ యాలకుల ధర ముందు వారంతో పోలిస్తే రూ. 675 నుండి పెరిగి రూ. 676.25, చిన్న గింజ సరుకు ధర రూ. 625 నుండి తగ్గి రూ. 617.50 ప్రతి కిలోకు చేరగా, గ్యాంగ్టక్లో పెద్ద యాలకుల ధర రూ. 675, చిన్నవి రూ. 575 ప్రతి కిలో స్థాయిలో స్థిరంగా ఉంది. పశ్చిమ బెంగాల్లోని సిలిగుడిలో పెద్ద గింజ ధర రూ. 762.50 నుండి తగ్గి రూ. 737.50, చిన్నగింజ రూ. 690 నుండి తగ్గి రూ. 667.50 ప్రతి కిలోకి చేరింది.

మిరియాల ధరలు

Image
  సోమవారం అన్గార్బుల్డ్ మిరియాలు రూ. 507 కి చేరిన తరువాత శుక్రవారం నాటికి తగ్గి రూ. ,రూ. 502, గార్బల్డ్ రూ. 527 నుండి తగ్గి రూ. 522 ప్రతి కిలోకు చేరింది. కర్ణాటకలో గురువారం నాడు కొత్త మిరియాలు రూ. 505, బోల్డ్ రకం రూ. 515 ప్రతి కిలో ధరతో వ్యాపారమెంది.

పెరిగిన కొత్త జీలకర్ర రాబడులు

Image
  లభించిన సమాచారం ప్రకారం గత వారం గుజరాత్, రాజస్థాన్ లోని అన్ని మార్కెట్లలో కలిసి 1.50 లక్షల బస్తాలకు పెగ్డా జీలకర్ర రాబడి అయినప్పటికీ, మార్కెట్తో పాటు వాయిదా ధరలు వృ ద్ధిచెందాయి. ఏప్రిల్లో రాబడులు మరింత పెరిగి 3 లక్షల బస్తాలకు చేరే అవకాశం కలదు. ఇందుకు ముఖ్య కారణం ఈ ఏడాది ఉత్పత్తి తగ్గి, ధరలు వృద్ధిచెందడంతో రెత్తులు మొత్తం సరుకు విక్రయిస్తున్నారు. అనేక సంవత్సరాల తరువాత రెత్తులకు మంచి ధరలు లభిస్తున్నాయి. తద్వారా 2023లో విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. 

తారాస్థాయికి చేరిన ధనియాల రాబడులు - ధరలు బలోపేతం

Image
  దేశంలోని ప్రముఖ ఉత్పాక రాష్ట్రాలెన మధ్య ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్లలో రికార్డు స్థాయిలో సరుకు రాబడి అయినప్పటికీ, ఎన్సీడిఇఎక్స్ వద్ద సోమవారం నుండి ఏప్రిల్ వాయిదా రూ. 10,738తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ. 130 పెరిగి రూ. 10,868, మే వాయిదా రూ. 156 పెరిగి రూ. 10,968 వద్ద ముగిసింది.

రాబడులు తగ్గడంతో బెల్లం ధరలు పటిష్ఠం

Image
  మధ్య ప్రదేశ్ లోని కరేళి, నర్సింగాపూర్ ప్రాంతాలలో బెల్లం రాబడులు దాదాపు సమాప్తమయ్యాయి. ఉత్తరప్రదేశ్ నిల్వలు గత ఏడాదితో పోలిస్తే 20 శాతం తగ్గాయి. ఇతర రాష్ట్రాలలో రాబడులు పెరగడం లేదు. కాగా మార్కెట్లకు రాబడి అయిన సరుకు చేతుల మీదనే అమ్మకం అవుతోంది. రాబోవు సీజన్లో చెరకు ఉత్పత్తి తగ్గడం, పంచదార ఎగుమతులు పెరగడం వలన వచ్చే సీజన్లో పంచదార ఉత్పత్తి పెరిగే అవకాశం కలదు. ప్రస్తుతం పండుగల సందర్భంగా కిరాణా వ్యాపారుల కోసం డిమాండ్ రావడంతో ధరలు రూ. 100-125 పెరిగాయి.

𝐁𝐘𝐀𝐃𝐆𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 28-03-2022 🌶️

Image
 

వేరుశనగ లో పెరుగుదలకు బ్రేక్

Image
  లబించిన సమాచారం ప్రకారం తెలంగాణలో వేరుశనగ రాబడులు తగ్గుముఖం పట్టాయి. గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్కర్నూల్, అచ్చంపేట, సూర్యపేట, తిరుమలగిరి, వరంగల్, కేసముద్రం మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి దినసరి 35-40 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ. 5500-6700, మబబూబ్నగర్లో హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ చెన్నై డెలివరి రూ. 9650, 70-80 కౌంట్ రూ. 9700-9800, 60-70 కౌంట్ రూ.9900, 50-60 కౌంట్ రూ. 10,300, హైదరాబాద్ డెలివరి 10,000 ధరతో వ్యాపారమైంది.

రంగు వెలుస్తున్న చింతపండు - క్షీణిస్తున్న ధరలు

Image
  దేశంలోని అన్ని ఉత్పాదక రాష్ట్రాలలో కొత్తచింతపండు రాబడులు పోటెత్తుతున్నందున ధరలు రూ. 1500-1800 మేర తగ్గాయి. ఎండల తీవ్రత కారణంగా కొన్ని ప్రాంతాలలో సరుకు రంగు వెలవడం ప్రారంభమైంది. స్టాకిస్టుల కొరతతో ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఆంధ్రలో ఒకవారంలో ఆంధ్రప్రదేశ్లో 320-330 వాహనాలు, కర్ణాటకలో 200 వాహనాలు మరియు తమిళనాడు 125 వాహనాలు, మహారాష్ట్రలోని అన్ని మార్కెట్లలో కలిసి గత వారం 15-20 వాహనాలు, తెలంగాణలో 15-20 వాహనాల సరుకు రాబడి అవుతున్నది. ధరలు తగ్గడంతో గత ఏడాది మిగులు నిల్వల విషయంలో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

పెరిగిన పసుపు రాబడులు - స్టాకిస్టుల కొనుగోళ్లు ప్రారంభం

Image
  దేశంలోని ఉత్పాదక రాష్ట్రాలలో కొత్త సరుకు రాబడులు పెరుగుతున్నాయి. తెలంగాణ మార్కెట్లలో గత వారం 1.40 లక్షల బస్తాలు, ఆంధ్రలో 8-10 వేల బస్తాలు, తమిళనాడులో 60-70 వేల బస్తాలు, మహారాష్ట్రలో 1.15 లక్షల బస్తాలు కలిసి మొత్తం 3.35 లక్షల బస్తాల సరుకు రాబడి అయింది. వికారాబాద్లో కొత్త సరుకు రాబడి ప్రారంభం కాగా, ఏప్రిల్ 3 తరువాత అన్ని మార్కెట్లలో రాబడులు ఊపందుకోగలవు. ఇంలాటి సమయంలో మర ఆడించే యూనిట్ల కొనుగోళ్లతో ధరలు ఎక్కువగా తగ్గే అవకాశం లేదు. ఎందుకనగా ఎగుమతి డిమాండ్తో పాటు పాత సరుకు అమ్మకానికి స్టాకిస్టులు ఆసక్తి చూపడం లేదు. కొత్త సరుకు స్టాకిస్టులు చురుకుగా మారుతున్నారు. 

మిరప సీజన్ త్వరగా సమాప్తమయ్యే అవకాశం

Image
  వ్యాపారస్తుల కథనం ప్రకారం ఆంధ్ర, కర్ణాటకలలో ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితుల వలన ఉత్పత్తి భారీగా తగ్గడంతో సీజన్ ప్రారంభం నుండే ధరలు హెచ్చుముఖంలో ఉన్నాయి. దీనితో రైతులు వేగంగా సరుకు విక్రయిస్తున్నారు. ఈ సారి రెత్తులు కూడా సరుకు నిల్వలకు ఆసక్తిచూపడం లేదు. దీనితో సీజన్ త్వరగా సమాప్తమయ్యే అవకాశం కలదు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మార్కెట్లో ప్రతి రోజు 1 లక్ష బస్తాలకు పెగ్డా సరుకు రాబడి అవుతున్నది. గుంటూరు యార్డులో గత వారం 5 రోజుల లావాదేవీలలో 4 లక్షల 80 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై , 4 లక్షల 50 వేల బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో 30 నుండి 40 శాతం కంటే తక్కువగా డీలక్స్ రకాలు రాబడి కాగా, నాణ్యత లోపించడం వలన ధరలు స్థిరంగా ఉన్నాయి. కాగా అన్ని మీడియం, మీడియం బెస్ట్ రకాలు రూ. 800-1000, తేజ తాలుతో పాటు అన్ని రకాల తాలు కాయల ధరలు రూ. 500 తగ్గాయి. అయితే ఆర్థిక సంవత్సర ఖాతాల నిర్వహణ కారణంగా ఇతర రాష్ట్రాలకు డిమాండ్ కొరవడడంతో కొంతమేర సరుకు శీతలగిడ్డంగులకు నిల్వ కోసం చేరుతున్నది.

𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 28-03-2022 🌶️

Image
 

రాగులు

Image
   కర్ణాటకలోని బెంగుళూరు, అరిసెకేరి, దావణగిరి, తుంకూరు, షిమోగా తదితర అన్ని మార్కెట్లలో ప్రతి రోజు 2-3 వేల బస్తాల కొత్త రాగుల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 2800-3000, మీడియం సరుకు రూ. 2000–2500, అన్ రూ. 1500-1800 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది. 

ఉలువలు

Image
   కర్ణాటకలోని మైసూరు, కుష్టిగి, బాగల్ కోట్లలో ప్రతి రోజు 5-6 వాహనాల ఉలువల రాబడిపై ధర రూ. 3800-4000, మీడియం రూ. 3200–3600, బళ్లారిలో 200-300 బస్తాల కొత్త ఉలువల రాబడిపై రూ. a 3800-3900 మరియు

బొబ్బర్లు

Image
   కర్ణాటకలోని బళ్లారి, బెంగుళూరు, ముందరి, హరిసెకేరే, మెస్తూరు, హగరిబమ్మ నహల్లి, చిత్రదుర్గ్ ప్రాంతాలలో ప్రతిరోజు 100-1500 బస్తాల కొత్త బొబ్బర్ల రాబడిపై గులాబీ రకం రూ. 6500-7500, మీడియం రూ. 6100-6200 మరియు

యాలకుల వేలాలలో భారీగా పెరిగిన రాబడులు

Image
   తమిళనాడు, కేరళలోని వేలం కేంద్రాలలో గత వారం హోళి పండుగ ఉన్నప్పటికీ, సోమవారం నుండి శనివారం వరకు ప్రతి రోజు రెండు వేలాలు నిర్వహించబడ్డాయి. ఇందుకు ముఖ్య కారణమేమనగా, రెత్తులు వేగంగా సరుకు విక్రయిస్తున్నారు. వేలాలలో దినసరి అమ్మకం పరిమితి 1.30 లక్షల కిలోలను దాటుతూ, వారంలో సుమారు 8,33,961 కిలోల సరుకు రాబడి కాగా, 7,96,320 కిలోల సరుకు అమ్మకం అయింది. ఇందులో రైతులకు గరిష్టంగా సోమవారం నాడు రూ. 927 ప్రతి కిలో ధర లభించింది.

మొదలైన చింతపండు స్తాకిస్టుల కొనుగోళ్లు

Image
  దేశంలో నాణ్యమైన సరుకు రాబడులు మార్చి నెలలో సమాప్తమయ్యే అవకాశం ఉన్నందున స్టాకిస్టులు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రలోని బార్షీ మార్కెట్లో ప్రతి రోజు 800-1000 బస్తాల కొత్త చింతపండు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 9000-15,000, మీడియం రూ. 7500-8500, యావరేజ్ రూ. 6500-7000, లారీబిల్టీ రూ. 8200 మరియు అహ్మద్ నగర్ లో 600-700 బస్తాలు ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 7500-8000, మీడియం రూ.6000-7500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై గుజరాత్ కోసం రవాణా అవుతున్నది.

బఠాణీ

Image
  మధ్య ప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలోని డబ్రా, దతియా ప్రాంతాలలో కొత్త బఠాణీల రాబడి ప్రారంభం అయింది. దిగుబడి పెరగడంతో వచ్చే నెల నుండి రాబడులు మరింత పెరిగే అవకాశం కలదు. 

పెరిగిన యాసంగి పెసల విస్తీర్ణం

Image
   అంతర్జాతీయ విపణిలో పేడేశ్వర్ పెసలు 940 డాలర్లు, పొకాకొ 835 డాలర్లు, అన్నేశ్వర్ 800 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ స్థాయిలో స్థిరంగా ఉండడంతో ఆంధ్ర ప్రాంతపు నాణ్యమైన సన్నరకం చమ్కీపెసలు సేలం, త్రిచి, డిండిగల్, విరుధ్ నగర్ డెలివరి రూ. 150 తగ్గి రూ. 7200, సాదా రకం రూ. 7050 ధరతో వ్యాపారమెంది. గుజరాత్లో మార్చి 7 వరకు విస్తీర్ణం 8700 హెక్టార్లు ఉంది. మే నెలలో కొత్త సరుకు రాబడి ప్రారంభం కాగలదు.

మినుములలో పెరుగుదలకు అవకాశం లేనట్లే

Image
  అంతర్జాతీయ విపణిలో మయన్మార్ మినుములు ఎఫ్ఎక్యూ 835 డాలర్లు, ఎస్యూ 920 డాలర్ ప్రతి టన్ను ప్రతిపాదించినందున ముంబైలో ఎఫ్ఎక్యూ కొత్త సరుకు రూ. 6550, పాత సరుకు రూ.6500, చెన్నైలో ఎఫ్ఎక్యూ రూ. 6400, ఎస్క్యూ కొత్త సరుకు రూ. 6950, దిల్లీలో ఎస్క్యూ రూ. 7325, ఎఫ్ఎక్యూ రూ. 6725, కోల్కతాలో రూ. 6550-6600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

తగ్గిన కందిపప్పు గిరాకీ

Image
  అంతర్జాతీయ విపణిలో మయన్మార్ లెమన్ కందులు 5 డాలర్లు తగ్గి 825 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించినందున మహారాష్ట్రలోని ముంబెల్డో కొత్త లెమన్ కందులు రూ.150 తగ్గి రూ. 6275-6300, అరుశ రూ.5500-5600, మొజాంబిక్, గజరి రూ. 5450-5500, మాలవి కందులు రూ. 4900-5000, సూడాన్ సరుకు రూ. 6500-6600, మట్వారా రూ. 5450-5500 ధరతో వ్యాపారమైంది.

రికార్డు స్థాయిలో ఆవాల ఉత్పత్తి

Image
  వ్యవసాయ విస్తరణ విభాగం (డిఇపి) అధికారుల కథనం ప్రకారం బంగ్లాదేశ్ లో అమన్ మరియు బోరో వరి సీజన్ మధ్య రెత్రులు అదనపు ఆదాయం కోసం అవసాగు చేపట్టడం జరుగుచున్నది. అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఉత్తర జిల్లాలలో ఆవాల సాగు పెరిగే అవకాశం కలదు. తక్కువ వ్యవధిలో అధిక దిగుబడి వలన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వంటనూనెల ధరలు పెరగడం మరియు ఆరోగ్యానికి ఆవనూనె మెరుగ్గా ఉండగలదని భావిస్తున్నందున, వినియోగం పెరుగుతున్నది.

తగ్గుతున్న వాము ధరలు

Image
  వేసవి తాపం పెరిగిన నేపథ్యంలో వాము వినియోగం తగ్గడంతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో హోళి సందర్భంగా మార్కెట్లు మూసి ఉండడంతో గత వారం ధరలు రూ. 400-500 ప్రతి క్వింటాలుకు తగ్గాయి.

మద్దతు ధర తో శనగ కొనుగోళ్లు

Image
  2021-22 రబీ సీజన్లో అపరాల విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 1 కోటి 68 లక్షల 20 వేల హెక్టార్ల నుండి 47 శాతం పెరిగింది. పంట కోతలు పూర్తయ్యాయి. ఇందులో రబీ శనగ విస్తీర్ణం 1,14,95,000 హెక్టార్లు ఉంది. కొన్ని ప్రాంతాలలో పంట దిగుబడి మెరుగ్గా ఉంది. విస్తీర్ణంలో 45 శాతం శనగ మరియు సిరిశనగ 17.71 ల.హె.లలో 44 శాతం పంట కోతలు పూర్తయ్యాయి.

గిరాకీ లేక బలపడని బెల్లం ధరలు

Image
  దేశంలోని బెల్లం ఉత్పాదక రాష్ట్రాలలో హోళి పండుగ సందర్భంగా మార్కెట్లు మూసి ఉన్నప్పటికీ, ధరలలో మందగమనం కొనసాగుతున్నది. ఇందుకు ముఖ్య కారణమేమనగా దేశంలోని వినియోగ రాష్ట్రాలలో హోళి పండుగ డిమాండ్ తగ్గింది. అయితే వచ్చేవారం నుండి రాబోవు ఉగాది పండుగ డిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

పెరిగిన కొబ్బరి సరఫరా

Image
  దేశంలో ప్రస్తుతం హోళి పండుగ డిమాండ్ తగ్గి, రాబోవు ఉగాది పండుగ కోసం ఎడ్వాన్స్ కొబ్బరి కాయలు కొబ్బరి కొనుగోలు చేశారు. తద్వారా డిమాండ్ కొరవడడంతో ధరలు స్థిరంగా మారాయి. ఈ ఏడాది ఉత్పత్తి అధికంగా ఉండడంతో పాటు ఇంతవరకు పాత సరుకు సప్లై కొనసాగుతున్నట్లు సమాచారం. దీనితో ధరలు నిలకడగా ఉన్నాయి.

తమిళనాడు లో పెరుగుతున్న కొత్త నువ్వుల రాబడులు

Image
  గుజరాత్లో మార్చి 17 వరకు నువ్వుల పంట విస్తీర్ణం 17,300 హెక్టార్లు ఉంది. ప్రస్తుత ఖరీఫ్, రబీ సీజన్లలో రాబడులు తగ్గినపప్పటికీ, ధరలు మందకొడిగా ఉన్నాయి. ఎందుకనగా మనదేశం నుండి ఎగుమతి డిమాండ్ ఎక్కువగా పెరగడం లేదు. తమిళనాడులో కొత్త సరుకు రాబడులు ప్రారంభం అయ్యాయి. అంతేకాకుండా ఆంధ్రలో ఉత్పత్తి తగ్గినప్పటికీ, రెత్తులు తమ విక్రయిస్తున్నారు. తమిళనాడులోని విరుధాచలం, విల్లుపురం ప్రాంతాలూలలో 2000 బస్తాల కొత్త సరుకు రాబడి 80 కిలోల బస్తా 38 కిలో నూనె దిగుబడి కండీషన్ సరుకు త్రిచి, ఈరోడ్, రాజపాలయం డెలివరి రూ. 10,300, ఆంధ్ర సరుకు రూ. 8500-8600 (ప్రతి 75 కిలోలు) ధరతో వ్యాపారమైంది. ఈ సరుకులో 80 కిలోలకు 30-31 కిలోల నూనె దిగుబడి అవుతున్నది.

తగ్గేదే లే అంటున్న మొక్కజొన్న ధరలు

Image
  ఈ ఏడాది భారత్ నుండి ఎగుమతులు - పెరగడం, స్థానిక పశు ఆహారం కోసం మరియు పౌల్ట్రీ  పరిశ్రమలతో పాటు స్టార్చ్ కర్మాగారాలకు కూడా మండి డిమాండ్ పలకడంతో రబీ సీజన్ మొక్కజొన్న ధరలు తగ్గే అవకాశం లేదు. ఎందుకనగా ఖరీఫ్ సీజన్ ఉత్పత్తిలో రెత్తుల సరుకు అమ్మకాలు దాదాపు సమాప్తం అయ్యాయి. కాగా కొంతమేర సరుకు పెద్ద స్టాకిస్టుల వద్ద నిల్వ ఉంది. అయితే - రబీ సీజన్ కోసం ఈ సారి దేశంలో 19.31 లక్షల హెక్టార్లలో - మొక్కజొన్న సాగు చేపట్టబడింది. పంట కోతల తదనంతరమే అమ్మకం అవుతున్నది. కోల్కత్తాలో పౌల్ట్రీ క్వాలిటీ సరుకు ధర ప్రస్తుతం జౌ 2500-2525 మరియు లక్నో, వారణాసి, పంజాబ్ లో పౌల్ట్రీ, స్టార్చ్ కర్మాగారాల డెలివరి ధర 2500-2550 క్వాలిటీ ప్రకారం వ్యాపారమవుతున్నది.

క్షీణిస్తున్న వేరుశనగ ధరలు

Image
  నిరవధికంగా సరఫరా ఉండడంతో పాటు ఇతర వంటనూనెల ధరలు స్థిరంగా ఉండడంతో వేరుసెనగలో మందకొడి గమనించబడింది.తెలంగాణలోని గద్వాల, వనపర్తి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, అచ్చంపేట, సూర్యపేట, తిరుమలగిరి, వరంగల్ మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి గత వారం 35-40 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ. 5710-7230, 

బలంగా అముదాల ధరలు

Image
  ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం ఏప్రిల్ వాయిదా రూ. 7330 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం వరకు రూ.7310 వద్ద ముగిసింది. అయితే 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి ఫిబ్రవరి వరకు ఆముదం పిండి ఎగుమతులు గత వారం ఇదే వ్యవధితో పోలిస్తే 3.90 ల.ట. నుండి తగ్గి 3.49 ల.ట.లకు చేరాయి. ఇందులో దక్షిణ కొరియాకు 2.52 ల.ట., తైవాన్ కు 59,865 టన్నులు, థాయ్లాండ్కు 9816 టన్నుల ఎగుమతి అయింది.

గుజరాత్లో రికార్డు స్థాయిలో ధనియాల రాబడులు

Image
 గత వారం గుజరాత్లో రికార్డు స్థాయిలో ధనియాలు రాబడి కాగా, సీజన్ ప్రారంభం నుండి ఇంతవరకు 18 లక్షల బస్తాలకు పైగా సరుకు  అమ్మకం అయింది. ధరలు ఆకర్షణీయంగా ఉండడంతో రైతులు వేగంగా సరుకు విక్రయిస్తున్నారు. మరియు ధరలు తగ్గే అవకాశం లేదు. ఎందుకనగా ఈ ఏడాది రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ఉత్పత్తి తగ్గడంతో రాబడులు పెరగడం లేదు.  స్టాకిస్టులు ఎక్కువగా గుజరాత్ నుండి సరుకు కొనుగోలు చేస్తున్నారు. ఎందుకనగా ప్రస్తుతం ఎండు సరుకు రాబడి అవుతున్నది. తద్వారా గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మార్కెట్లలో ధరలు రూ. 150-200 ప్రతి క్వింటాలుకు పెరిగాయి.

కొత్త పసుపు రాబడితో తగ్గుతున్న ధరలు

Image
  వ్యాపారస్తుల కథనం ప్రకారం గత వారం హోళి సందర్భంగా గురువారం నుండి ఆదివారం వరకు మార్కెట్లు మూసి ఉండడంతో రాబడులు తగ్గాయి. అయితే సోమవారం నుండి బుధవారం వరకు నిజామాబాద్, వరంగల్, వికారాబాద్, మెట్పల్లి, జగిత్యాల, కోరుట్ల మరియు మహారాష్ట్రలోని నాందేడ్, హింగోళి, బస్మత్నగర్, జింతూర్లలో రాబడులు పెరిగే అవకాశం ఉన్నందున వాయిదా ధరలు క్షీణిస్తున్నాయి. మార్కెట్ ధరలు తగ్గిన నేపథ్యంలో వాయిదా డెలివరి తీసుకొనే వారు ముందుకు రారు. అయితే ఏప్రిల్ మొదటి వాయిదా సెటిల్మెంట్ తరువాత మందకొడిలో కొనుగోలు చేయడం లాభదాయకంగా ఉండగలదు.