తారాస్థాయికి చేరిన ధనియాల రాబడులు - ధరలు బలోపేతం

 


దేశంలోని ప్రముఖ ఉత్పాక రాష్ట్రాలెన మధ్య ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్లలో రికార్డు స్థాయిలో సరుకు రాబడి అయినప్పటికీ, ఎన్సీడిఇఎక్స్ వద్ద సోమవారం నుండి ఏప్రిల్ వాయిదా రూ. 10,738తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ. 130 పెరిగి రూ. 10,868, మే వాయిదా రూ. 156 పెరిగి రూ. 10,968 వద్ద ముగిసింది.


వ్యాపారస్తుల కథనం ప్రకారం గుజరాత్లో గత వారం 21 లక్షల బస్తాల సరుకు రాబడి అయింది. అనగా ఉత్పత్తిలో 50 శాతంగా భావించబడుచున్నది. ఎందుకనగా ఈ సారి ఉత్పత్తి 45 లక్షల మేర ఉండే అంచనా కలదు. రాజస్థాన్, మధ్య ప్రదేశ్లో ఈ ఏడాది విస్తీర్ణం తగ్గడం మరియు పంట కోతలు ఆలస్యం కావడంతో స్టాకిస్టుల కొనుగోళ్లు పెరిగి తద్వారా ధరలు భారీగా వృద్ధిచెందడంతో గత వారం పై రెండు రాష్ట్రాలలో కలిసి 6 లక్షల బస్తాల దనియాల రాబడి కాగా, బాదామీ రకం రూ. 9200-9800, ఈగల్ రూ. 10300-10,900, స్కూటర్ రకం రూ. 11,000-11,500 ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ మరియు ప్రతి 40 కిలోలు లారీబిల్టీ బాదామీ రూ. 4600, ఈగల్ రూ. 4700 ధరతో వ్యాపారమెంది. వచ్చే నెలలో రాబడులు ఇదే విధంగా ఉంటే, 15 రోజులలో రాబడులు సమాప్తం కాగలవు. ఎందుకనగా గత కొన్ని సంవత్సరాల తరువాత మొదటిసారిగా రెత్తులకు రికార్డు ధర లభిస్తున్నది. దీనితో ఈ సారి రెత్తుల వద్ద సరుకు నిల్వలకు అవకాశం లేదు. మార్కెట్లలో రాబడి అయిన 70 శాతం సరుకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యే అవకాశం కలదు. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దిగుమతులకు అవకాశం లేదు. దీనితో ధరలు తారా స్థాయికి చేరే అంచనా కలదు. గత వారం స్టాకిస్టులు, వ్యాపారుల కొనుగోళ్లతో ధరలు రూ. 400-500 పెరిగాయి. దక్షిణాది వ్యాపారులతో పాటు మర ఆడించే యూనిట్ల కొనుగోళ్లతో ధరలు పెరగడానికి మద్దతు లభిస్తుంది.


రాజస్తాన్లోని రామంజ్మండిలో గత సోమవారం నుండి శనివారం వరకు 1.80 లక్షల బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, బాదామీ రూ. 9800-10,000, ఈగల్ రూ. 10,700-10,900, స్కూటర్ రకం రూ. 11,400-11,500 మరియు ప్రతి 40 కిలోలు లారీబిల్టీ బాదామీ రూ.4600, ఈగల్ రూ.4700 మరియు బారన్లో 15-16 వేల బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, నిమ్ము సరుకు రూ. 8000-9000, బాదామీ రూ. 9000-9300, ఈగల్ రూ. 9700-10,000 మరియు కోటాలో 15 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 8700-9000, ఈగల్ రూ. 9200-9400, స్కూటర్ రూ. 10,000-10,200, భవానీమండిలో 8-10 వేల బస్తాల రాబడి కాగా, బాదామీ నిమ్ము సరుకు రూ. 8000-8700, ఈగల్ రూ. 9100-9300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 మధ్య ప్రదేశ్లోని గునా మార్కెట్లో గత వారం 60-70 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 7000-9200, ఈగల్ రూ. 9300-9600, ఎండు సరుకు రూ. 10,000-10,500, కుంభరాజ్లో 70-80 వేల బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, నిమ్ము రకం రూ. 8000-8500, బాదామీ రూ.9300-9500, ఈగలూ. 9800-10,000, బినాగంజ్లో 15 వేల బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, ఈగల్ రూ. 9500-10,000, ఎండు రకం రూ.10,500-11,000, నాణ్యమైన ఆకుపచ్చ సరుకు రూ. 11,500-12,500 మరియు మధుసుదనడ్ 10-12 వేల • బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, బాదామీ రూ. 9400-9500, ఈగల్ రూ. 10,000-10,200, స్కూటర్ రకం రూ. 10,500-11,000, నీమచ్లో 8-10 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై బాదామీ రూ. 9000-9300, ఈగల్ రూ. 9500-10,000, ఆకుపచ్చ సరుకు రూ. 11,500-12,000 మరియు జావ్రాలో 800-1000 బస్తాల కొత్త ధనియాల రాబడిపై రూ. 9000-12000 ప్రతి క్వింటాలు ధరతో లోకల్ లూజ్ వ్యాపారమైంది. 

గుజరాత్లోని జూనాఘడ్లో వారంలో 15-20 వేల బస్తాలు, జోధ్ పూర్ లో 15 వేల బస్తాలు, హల్వాడ్లో 20-22 వేల బస్తాలు, జామ్ జోధ్ పూర్లో 8-10 వేల బస్తాల కొత్త ధనియాల రాబడి కాగా, నాణ్యమైన సరుకు రూ. 10,000-10,500, మీడియం రూ.9800-10,000, యావరేజ్ రూ. 9000-9500, సన్న రకం ఆకు పచ్చ సరుకు రూ. 12,000–13,000, మీడియం రూ. 11,000-11,500, జూనాఘడ్లో క్లీన్ ఈగల్ రకం రూ. 10,400, స్కూటర్ రకం రూ. 11,000, గోండల్లో నిమ్ము రకం సరుకు రూ. 8500-9100, నాణ్యమైన ఈగల్ రకం రూ. 9900-10,000, మీడియం రూ.9500-9800, స్కూటర్ రకం రూ. 10,100-10,500 ధరతో వ్యాపారమెంది. జామ్నగర్ మరియు తదితర మార్కెట్లు ఆర్థిక సంవత్సర గణాంకాల కారణంగా మూసి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో బాదామీ ధనియాలు ప్రతి 40 కిలోలు రూ. 4700, ఈగల్ రూ. 4775, స్కూటర్ రకం రూ. 4945 మరియు శీతల గిడ్డంగులలో నిల్వ అయిన సరుకు రూ. 4650 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog