కొత్త మినుములకు నెలకొన్న గిరాకీ

వ్యసాయ మంత్రిత్వ శాఖ వారి వివరాల ప్రకారం దేశంలో మే 5 వరకు యాసంగి మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే 3.15 నుండి పెరిగి 3.19 విస్తరించింది.అంతర్జాతీయ మార్కెట్లో ఎస్క్యూ మినుములు 15 డాలర్లు తగ్గి 1045 డాలర్లు, ఎఫ్ఎక్యూ 945 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించినప్ప టికీ, గిరాకీ ఉన్నందున ముంబెలో ఎఫ్ఎక్యూ రూ. 75 పెరిగి రూ. 7800, చెన్నెలో FQ రూ. 8400, ఎఫ్ఎక్యూ రూ. 7650 మరియు కోల్కత్తాలో రూ. 8000–8100, దిల్లీలో ఎస్యూ రూ. 8750, ఎఫ్ఎక్యూ రూ. 7875 ధరతో వ్యాపారమైంది.