మినుములు స్థిరం

 

యాసంగి సీజన్ మినుము పంట విస్తీర్ణం పెరగడంతో మరియు ప్రస్తుతం ఆంధ్ర రబీ సీజన్ సరుకు సరఫరా అవుతున్నందున ధరలు పెరగడానికి బలం చేకూరడంలేదు. త్వరలో యాసంగి మినుముల సరఫరా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున పెద్ద స్టాకిస్టులు బయటపడు తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. సరుకు స్థానిక పప్పు మిల్లులకు సరఫరా అవుతున్నది. గత రెండేళ్లుగా ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుండి మినుములలో పెరుగుదల మరియు సీజన్ సమాప్తమైన తరువాత మందకొడి కారణంగా రాబోవు కొత్త సీజన్లో స్టాకిస్టులు తగ్గవచ్చు. 


ఎందుకనగా రబీ, యాసంగి అపరాల పంటల విస్తీర్ణం ప్రతి ఏడాది పెరుగుతున్నది. సీజన్ సమాప్తం సమయంలో ప్రభుత్వం దిగుమతు లకు అనుమతిస్తున్నది. తమిళనాడు ప్రాంతపు కొత్త సరుకు చెన్నై డెలివరి రూ. 6700-6750, ఆంధ్ర పిక్యూ 37 రకం రూ. 6600-6650, పాలిష్ రూ. 6800-6900, మహారాష్ట్ర సాంగ్లీ ప్రాంతపు సరుకు రూ. 7100 ధరతో వ్యాపారమయింది. దీనితో రాబోవు ఖరీఫ్ విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. దిగుమతులు కొనసాగితే, ఎక్కువగా పెరుగుదలకు అవకాశం లేదు. అంతర్జాతీయ విపణిలో మినుములు ఎస్క్యూ 1020 డాలర్లు, ఎఫ్ఎక్యూ 5 పెరిగి 915 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించడంతో ముంబైలో ఎఫ్ఎక్యూ కొత్త సరుకు రూ. 50 పెరిగి రూ. 6750, చెన్నైలో ఎఫ్ఎక్యూ రూ. 65, ఎస్క్యూ రూ.7375, దిల్లీలో ఎస్క్యూ రూ. 7675-7725, ఎఫ్ఎక్యూ రూ. 7000-7050, కోలకతాలో ఎఫఎక్యూ రూ. 6900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని క్రిష్ణా జిల్లా స్థానిక మార్కెట్లలో పాలిష్ మినుములు రూ. 6800, సాదా రూ. 6800, నంద్యాలలో పాలిష్ సరుకు రూ. 6300-6500, ప్రొద్దుటూరు, కడపలో పాలిష్ సరుకు రూ.6400, అన్-పాలిష్ రూ. 6200, విజయవాడలో గుండు మినుములు నాణ్యమైన సరుకు రూ. 11,400, పప్పు రూ. 9600, మీడియం రూ. 8000-9000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మహారాష్ట్రలోని అకోలాలో రూ. 6000, మోగర్ రకం రూ. 9200-9300, నాణ్యమైనై సరుకు రూ. 9900-10,000, జల్గాంవ్లో మధ్యప్రదేశ్ సరుకు రూ. 6500, మహారాష్ట్ర సరుకు రూ. 6800 ధరతో వ్యాపారమెంది. మధ్య ప్రదేశ్లోని టికంఘడ్లో 300-400 బస్తాల రాబడిపై హర్దా, జబల్పూర్, గంజ బసోదాలలో రూ. 3000 5500, ఇండోర్లో రూ. 6300 - 6400, మరియు రాజస్థాన్లోని కేక్ లో 1000 ల రాబడిపై రూ.5800-6300, సవాయి మాధవప్పూర్ లో రూ. 5500-5700, ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ, లలిత్పూర్ ప్రాంతాలలో దినసరి 4-5 వేల బస్తాల రాబడిపై డ్యామేజ్ రకం రూ. 4500, నాణ్యమైన సరుకు రూ. 6500-6600 ధరతో వ్యాపారమెంది.

Comments

Popular posts from this blog