Posts

Showing posts from January, 2024

భారీగా పెరుగుతున్న మిర్చి రాబడులు - ధరలపై తీవ్ర ప్రభావం 22-01-2024

ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈసారి తేజ రకం మిర్చి సేద్యం భారీగా విస్తరించింది. వాతావరణం సానుకూలంగా ఉన్నందున పంట దిగుబడులు పెరిగి రాబడులు పోటెత్తుతుండగా కొనుగోళ్లు క్షీణించి ధరలు మందగమనంలో చలిస్తున్నాయి. గత వారం సంక్రాంతి పండుగ సందర్భంగా గుంటూరు మిర్చి యార్డు 2 రోజులు ఎలాంటి లావాదేవీలు చేపట్టలేదు. గుంటూరు యార్డులో గత వారం గుంటూరు కర్నూలు ఎమ్మిగనూరు క్రిష్ణా ప్రకాశం జిల్లాల నుండి 2.90 లక్షల బస్తాల మిర్చి రాబడి కాగా 2.50 లక్షల బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో డీలక్స్ రకాల ధరలకు స్థిరత్వం నెలకొనగా తేజ ఆర్మూరు సీడ్ రకాలు మరియు వీటి తాలు కాయలు భారీగా విక్రయించబడ్డాయి. సోమవారం (జనవరి 22) 1.5 లక్షల బస్తాల సరుకుతో పాటు వారం పర్యంతం రాబడులు భారీగా ఉండగలవని తెలుస్తోంది. మసాలా తయారీదారులు తమ అవసరం మేరకే సరుకు కొనుగోలు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత కూలీలు పూర్తి స్థాయిలో విధులలో చేరనందున గుంటూరు శీతల గిడ్డంగుల నుండి కేవలం 20 వేల బస్తాల సరుకు రాబడి అయింది. ఇందులో 10 వేల బస్తాల సరుకు అమ్మకమైనట్లు తెలుస్తోంది. గుంటూరు శీతల గిడ్డంగులలో దాదాపు 24 లక్షల బస్తాల సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. మధ్య ప్రద