ప్రముఖ మిరప ఉత్పాదక రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, గుంటూరు జిల్లాలలో పంట మరియు పూతపై నల్లి తెగులు సోకడంతో రైతులు పంట పెరికివేస్తున్నారు. కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాల వలన ఆలస్యంగా విత్తిన పంటకు నష్టం వాటిల్లింది. మధ్య ప్రదేశ్, మహారాష్ట్రలలో వర్షాల వలన పంట కోతలకు అవరోధం ఏర్పడింది. కొందరు వ్యాపారులు ఎగుమతి వ్యాపారుల కోసం ఎడ్వాన్స్ వ్యాపారం చేసారు. ఇందుకోసం కొనుగోలు డిమాండ్ రావడంతో దేశవ్యాప్తంగా ఉత్పాదక రాష్ట్రాలలో మిరప ధరలు రూ. 1000-1500 ప్రతి క్వింటాలుకు పెరిగాయి. కర్నూలు, ఎమ్మిగనూరు ప్రాంతాలలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పంటకు భారీ నష్టం వాటిల్లింది. దీనితో కొత్త నాణ్యమైన మిరప రాబడి కోసం 2 నెలల సమయం పట్టగలదు. ప్రకాశం జిల్లాలో దిగుబడి తగ్గే అవకాశం కలదు.