Posts

Showing posts from January, 2022

ఉత్పత్తి తగ్గడంతో పటిష్ట స్థితిలో కందుల ధరలు

Image
  24-01-2022 ఈ ఏడాది దేశంలో కందిపంట విస్తీర్ణం పెరిగినప్పటికీ, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వలన దిగుబడి తగ్గడం మరియు గత ఏడాది పోలిస్తే నాణ్యత లోపించినందున మిల్లుల కోసం నాణ్యమైన సరుకులకు డిమాండ్ నెలకొన్నది. భారత్ ద్వారా దిగుమతులు పెరిగే అవకాశం ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లో మయన్మర్ లెమన్ మరియు లింక్లీ కందుల ధర 40 డాలర్లు పెరిగి 825 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించడంతో ధరలు బలోపేతం చెందాయి. స్టాకిస్టులు కూడా అప్రమత్తమవుతున్నారు. అంతేకాకుండా రాబోవు నెల నుండి వినియోగదారుల కోసం పప్పుకు మంచి డిమాండ్ నెలకొనే అవకాశం ఉన్నందున ధరలకు బలం చేకూరింది.

రబీలో పెరిగిన వేరుశనగ విస్తీర్ణం

Image
  24-01-2022  రబీ సీజన్లో దేశంలో విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 4.80 ల.హె. నుండి పెరిగి 4.65 ల.హె.కు చేరింది. ప్రస్తుత ధరల పరిస్థితితో పాటు ఉత్పాదక రాష్ట్రాలలో సాగునీటి వనరులు మెరుగ్గా ఉన్నందున యాసంగి పంట విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ, ఆంధ్రలలో వారం రోజులలో 3 లక్షల బస్తాలకు పైగా, రాజస్థాన్, గుజరాత్ లో 3.50 లక్షలకు పైగా వేరుశనగ రాబడి అవుతున్నందున, సప్లై పెరగడంతో ధరలు క్షీణిస్తున్నాయి. అయితే రైతులకు మద్దతు  సుమారు ధరలకు సమానంగా మార్కెట్లో ధరలు లభిస్తున్నాయి. పామాయిల్ ధరలు పటిష్టంగా ఉన్నందున వేరుశనగలో ఎక్కువగా తగ్గుదలకు అవకాశం లేదు. 

మధ్యప్రదేశ్ లో కొత్త ధనియాల - ధరల పెరుగుదలకు అవకాశం

Image
  24-01-2022 ప్రస్తుతం దేశంలోని దనియాల ఉత్పాదక కేంద్రాలలో పంట కోతల ప్రక్రియ ప్రారంభమైంది. మరో 15-20 రోజులలో రాబడులు జోరందుకోగలవు. అయితే ఉత్పత్తి తగ్గినందున కొత్త సరుకు రాబడులతో పాటు ధరలు ఇనుమడించగలవు. తద్వారా సీజన్లో ధరలు తగ్గే అవకాశం ఉంది. ఎందుకనగా, ధరల ఉధృతి కొనసాగుతున్న తరుణంలో తమిళనాడు వ్యాపారులు తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తుంటారు. నిజమైన వ్యాపారులు ధరలు పెరిగిన తరుణంలో సరుకు నిల్వ చేసేందుకు ఆసక్తి చూపరు. అయితే, భారీగా తగ్గిన తరుణంలో విక్రయించేందుకు విముఖత వ్యక్తం చేస్తుంటారు. 

కొత్త శనగ రాబడులతో తగ్గిన ధరలు

Image
  24-01-2022  ఏడాది దేశంలో ఉత్పత్తి పెరగడంతో మరియు మిగులు నిల్వలతో పాటు కొత్త సీజన్ ప్రారంబం కావడంతో ఫిబ్రవరిలో మహారాష్ట్ర, గుజరాత్ లలో రాబడులు పెరిగిన తరువాత ధరలు తగ్గి రూ. 4200-4500 వరకు చేరవచ్చని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకనగా కొత్త సీజన్లో సరుకు నిమ్ముతో ఉండడం వలన ప్రభుత్వ ఏజెన్సీలు మద్దతు ధరతో సరుకు కొనుగోలు చేయవు. 

మినుములు ధరలు పెరిగే అవకాశం లేనట్లే

Image
  24-01-2022 ప్రస్తుత రబీ సీజన్లో జనవరి 19 వరకు దేశంలో మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 7.80 ల.హె. నుండి తగ్గి 7.22 ల.హె.కు పరిమితమైంది. అయితే వ్యాపారస్తుల అంచనా ప్రకారం ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మరియు ధరలను పరిగణలోకి తీసుకుంటే యాసంగి సీజన్ కోసం మధ్య ప్రదేశ్, బిహార్లలో విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా దిగుమతులు కొనసాగే అవకాశం కలదు. మే నెల వరకు ఆంధ్ర, తమిళనాడులలో కొత్త సరుకు రాబడులు కొనసాగగలవు. కావున ధరలు బలపడే అంచనా లేదు. 

బెల్లం కొనుగోళ్లు పెంచిన స్టాకిస్టులు

Image
  24-01-2022 ఉత్తరప్రదేశ్ శీతల గిడ్డంగులలో ఇప్పటి వరకు బెల్లం నిల్వలు గత ఏడాదితో పోలిస్తే తగ్గినట్లు అందిన సమాచారంతో స్టాకిస్టుల కొనుగోళు జోరందుకున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల స్టాకిస్టులు కూడా సరుకు నిల్వ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎందుకనగా, సరుకుపై తక్కువ పెట్టుబడి మరియు ధర రూ. 500-600 పెరిగినట్లయితే 10 శాతం లాభం చేకూరడం తథ్యమని భావించడమే ఇందుకు ప్రధాన కారణం.

పసుపు ధరలు

Image
  24-01-2022 దేశంలోని పసుపు ఉత్పాదక రాష్ట్రాలలో వచ్చే నెల నుండి కొత్త పసుపు రాబడులు ప్రారంభమై ప్రస్తుత ధరలను దృష్టిలో పెట్టుకొని కొత్త సరుకు శరవేగంతో దూసుకుపోగలవు. మసాలా యూనిట్లు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోళ్లు చేపట్టే అవకాశం ఉంది. ఎందుకనగా, ప్రస్తుత సీజన్లో ఉత్పత్తి 15–20 శాతం తగ్గగలదని దిగ్గజ మసాలా యూనిట్లు నిర్ధారించు కోవడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే, పాత సరుకు నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నందున ప్రస్తుత ధరలను దృష్టిలో పెట్టుకొని 2022-23 కోసం పసుపు సేద్యం రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. 

రికార్డు స్థాయిలో మిర్చి రాబడులు - ధరలు స్థిరం

Image
  23-01-2022 2021-22 సీజన్ కోసం మిర్చిసేద్యం భారీగా విస్తరించబడింది. ప్రముఖ మిర్చి ఉత్పాదక ప్రాంతాలైన దక్షిణాదిలో ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు పంటకు తీరని నష్టం వాటిల్లింది. ఫలితంగా ఉత్పత్తి తగ్గే అంచనాతో ఎడతెరిపి లేకుండా స్టాకిస్టులు సరుకు కొనుగోళ్లు చేపడుతున్నందున ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఎగబాకుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని రైతులు తమ పంటను నేరుగా మార్కెట్లకు తరలిస్తున్నారు. తద్వారా వారం రోజులలో ప్రధాన అన్ని మార్కెట్లలో దాదాపు 12 లక్షల బస్తాల సరుకు రాబడి అయింది. ఒక్క కర్ణాటకలోనే 5 లక్షల బస్తాల రాబడి కాగా మొత్తం సరుకు అమ్మకమైంది. ఇటీవలె కురిసిన వర్షాలకు మిర్చి పంటకు నష్టం వాటిల్లినందున రాబోవు రోజులలో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున స్టాకిస్టులు తమ సరుకు అమ్మకానికి బదులుగా నిల్వ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. 

పెసర ధరల వివరాలు

Image
  24-01-2022 ప్రస్తుత రబీ సీజన్ లో జనవరి 19 వరకు దేశవ్యాప్తంగా పెసల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 5.90 ల.హె. నుండి తగ్గి 4.67 ల.హె.కు పరిమితమైంది. అయితే యాసంగి పంట విస్తీర్ణం పెరిగే అవకాశం ఉండడంతో సరఫరా నిరవధికంగా కొనసాగగలదు. ఎందుకనగా ప్రస్తుత ఖరీఫ్లో ఉత్పత్తి తగ్గడంతో పెసలు నిల్వ చేసే వ్యాపారులు, రైతులు ధరలు పెరగకపోవడంతో తమ సరుకును నెమ్మదిగా విక్రయిస్తున్నారు. ఇతర అపరాల ధరలు నిలకడగా ఉన్నందున పెసర ధరలలో ఎక్కువగా తగ్గుదలకు అవకాశం లేదు. 

గణనీయంగా వృద్దిచెందిన రబీ సేద్యం

Image
  17-01-2022  రబీ సీజన్లో ఇప్పటి వరకు అన్ని పంటల సేద్యం గత సీజన్తో పోలిస్తే 8 ల.హె. వృద్ధి చెందింది. దేశంలో సానుకూల వాతావరణం నెలకొన్నందున ఉత్పత్తి మరోసారి గణనీయంగా ఇనుమడించే అంచనా వ్యక్తమవుతున్నది. హర్యాణా, రాజస్తాన్లో రబీ సేద్యం ప్రక్రియ ముగియగా మిగిలిన రాష్ట్రాలలో మరో రెండు వారాలలో చరమాంకంలో పడనున్నదని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు.

ఆశలు లేని శనగల ధరలు

Image
17-01-2022  ప్రస్తుత రబీ సీజన్లో జనవరి 14 వరకు దేశవ్యాప్తంగా శనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 107.78 ల.హె. నుండి 111.61 ల.హె.కు విస్తరించింది. రాష్ట్రాలవారీగా మధ్యప్రదేశ్లో 24.84 ల.హె. నుండి పెరిగి 24.94 ల.హె., ఉత్తరప్రదేశ్లో 5.85 ల.హె. నుండి 5.94 ల.హె., మహారాష్ట్రలో 23.31 ల.హె. నుండి 25.25, ఆంధ్రప్రదేశ్లో 3.58 ల.హె. నుండి 3.74 ల.హె., గుజరాత్లో 8.40 ల.హె. నుండి 10.54 ల.హె.కు విస్తరించగా, రాజస్తాన్లో 20.50 ల.హె. నుండి తగ్గి 20.42 ల.హె.కు, కర్ణాటకలో 11.75 ల.హె. నుండి 11.03 ల.హె., ఛత్తీస్గఢ్ 3.87 ల.హె. నుండి 3.53ల.హె.కు పరిమితమైంది.

తగ్గిన రబీ పెసర సేద్యం

Image
17-01-2022  ప్రస్తుత రబీ సీజన్లో జనవరి వరకు దేశవ్యాప్తంగా పెసల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 5.26 ల.హె. నుండి తగ్గి 3.23 ల.హె.కు పరిమితమైంది. రాష్ట్రాల వారీగా తమిళనాడులో 34 వేల హెక్టార్ల నుండి తగ్గి 32 వేల హెక్టార్లు, ఒడిశ్శాలో 4.09 ల.హె. నుండి 2.13 ల.హె., ఆంధ్రప్రదేశ్లో 60 వేల హెక్టార్ల నుండి 57 వేల హెక్టార్లకు పరిమితమైంది. ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకు పెసల సేద్యం 40 శాతం కూడా విస్తరించలేదు. గడిచిన కొన్ని నెలలుగా ధరలు ఒడిదొడుకులకు గురవుతున్నందున సీజన్ మొత్తంలో సేద్యం తగ్గుదల నమోదయ్యే అవకాశం కనిపిస్తున్నది. 

ధనియాలకు కొనసాగుతున్న ధరల ఒరవడి

Image
17-01-2022 ఎన్న్సీడిఇఎక్స్ వద్ద గత సోమవారం జనవరి వాయిదా రూ. 9500 తో ప్రారంభమై శుక్రవారం వరకు హెచ్చు తగ్గుల తర్వాత రూ. 9500 వద్ద స్థిరపడింది. అయితే, ఏప్రిల్ వాయిదా సోమవారం రూ. 10,150 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం వరకు రూ. 18 తగ్గి రూ.10,132 వద్ద ముగిసింది. 

ధరల దిగుబాటు తగ్గని కొబ్బరి

Image
17-01-2022  ఆంధ్రప్రదేశ్లోని అంబాజిపేటలో ప్రతి రోజు 200-250 టన్నుల కొబ్బరి రాబడిపై ఎక్స్పోర్ట్ రకం రూ. 8600-8700, మీడియం రూ. 7800-8000, యావరేజ్ రూ.7200-7500 మరియు పాలకొల్లులో 180-200 వాహనాల కొబ్బరికాయలు రాబడి కాగా, నాణ్యమైన పునాస రకం సరుకు రూ. 9400, మీడియం రూ. 9500, మీడియం రూ. 7400-7500, యావరేజ్ రూ. 5350-5500, కొత్త కాయలు నాణ్యమైన సరుకు రూ. 7850-8000, మీడియం రూ. 6400-6500, యావరేజ్ రూ. 4850-5000 (ప్రతి 1000 కాయలు) ధరతో వ్యాపారమై తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, రాజస్తాన్ కోసం రవాణా అవుతున్నది.

మయన్మార్లో పెరిగిన మినుముల సేద్యం

Image
  17-01-2022 ప్రస్తుత రబీ సీజన్లో జనవరి 12 వరకు దేశంలో మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 7.45 ల.హె. నుండి తగ్గి 6.90 ల.హె. కు 2.29 పరిమితమైంది. రాష్ట్రాల వారీగా తమిళనాడులో 2.61 ల.హె. నుండి తగ్గి 2. ల.హె., ఒడిశ్శాలో 1.65 ల.హె. నుండి 1.18 ల.హె.కు పరిమితం కాగా, ఆంధ్రప్రదేశ్లో 2.86 ల.హె. నుండి పెరిగి 2.95 ల.హె.కు విస్తరించింది.

తగ్గిన బెల్లం ధరలు

Image
   17-01-2022 ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లోని శీతల గిడ్డంగులలో జనవరి 10 నాటికి బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 5,30,237 బస్తాల నుండి 1,73,788 బస్తాలు తగ్గి 3,56,449 బస్తాలకు పరిమితమయ్యాయి. ఇందులో చాకూబెల్లం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 3,23,170 బస్తాల నుండి తగ్గి 2,42,220 బస్తాలు, పాపిడి 44,256 నుండి 34,862, రస్కట్ 27,747 నుండి 10,373, కురుపా 7211 బస్తాల నుండి 4453, రాబటిన్ 1,09,888 నుండి 44,670 బస్తాలకు పరిమితం కాగా, చదరాలు 18,165 బస్తాల నుండి పెరిగి 19,871 బస్తాల నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ముజఫర్ నగర్ మరియు హాపూర్లో వాతావరణం సానుకూలించనందున బెల్లం తయారీకి అవరోధం ఏర్పడింది. తద్వారా గత వారం మార్కెట్లో రాబడులు లేవు. మధ్యప్రదేశ్లోని కరేలిలో గత సోమవారం నుండి శుక్రవారం వరకు 50-60 వాహనాల సరుకు రాబడిపై గులాబీ రకం రూ. 2600-2700, నర్సింగ్ూర్లో గురువారం 20-25 వాహనాలు రూ. 2575-2625 మరియు మహారాష్ట్రలోని సాంగ్లీలో గత వారం 18-20 వేల దిమ్మల కొత్త బెల్లం రాబడి కాగా, సురభి రకం రూ. 3350-3500, గుజరాత్ రకం రూ. 3400-3550, ముంబై రకం రూ. 3400-3600, సోలాపూర్లో 15 వేల దిమ్మలు నాణ్యమైన సరు

కర్ణాటకలో ఆశించిన రాబడులు లేని చింతపండు

Image
  17-01-2022 కర్ణాటకలోని బెల్గాంలో గత వారం 50-60 బస్తాల కొత్త చింతపండు రాబడిపై యావరేజ్ సరుకు రూ. 7000-8000, మీడియం రూ. 9000-12,000, నాణ్యమైన సరుకు రూ. 16,000-17,000 మరియు హోస్పేటలో 50 బస్తాలు రూ. 9000-10,500, తుంకూరులో గురువారం 2 టన్నుల కొత్త సరుకు రాబడితో ముహూర్త వ్యాపారం ప్రారంభం కాగా, సిల్వర్ రకం రూ. 20,000-25,000, మేలిమి రకం రూ. 14,000-18,000, ఫ్లవర్ రూ. 5000-8000, నలగ్గొట్టని చింతపండు రూ. 2000–2800, మైసూరులో 4-5 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై మహారాష్ట్ర నాణ్యమైన ఫ్లవర్ రూ. 8950-10,000, స్థానికంగా రూ. 6900-8000, సిల్వర్ రకం రూ. 18,500-20,000, మేలిమి రకం రూ. 14,000-15,000, మీడియం రూ. 10,800-12,000, ఫ్లవర్ మీడియం రూ. 4500-5500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

బలపడుతున్న నువ్వుల ధరలు

Image
  17-01-2022 రాజస్తాన్లోని బికనీర్, కోటా, నోఖా, పాలి, గంగానగర్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 12-15 వేల బస్తాల సరుకు రాబడిపై తెల్లనువ్వులు రూ. 9500-10,000, గజ్జర్ నువ్వులు రూ. 8800-9100, తమిళనాడు డెలివరి రూ. 8750-8800, తెల్లనువ్వులు రూ. 7900-8000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గత వారం మధ్యప్రదేశ్లోని డబ్రా, ధతియా, గ్వాలియర్ మార్కెట్లలో హళ్లింగ్ సరుకు రూ. 10,700-10,800, ఆగ్రాలో హల్లింగ్ సరుకు రూ. 10,000-10,100, 99.1 సరుకు రూ. 11,200–11,400, 98.1 రకం సరుకు రూ. 10,900–11,000, సార్టెక్స్ రూ. 11,700-11,900, కాన్పూర్ హళ్లింగ్ సరుకు రూ. 10,800-10,900, 98.2 సరుకు రూ. 10,900-11,100 ప్రతి క్వింటాలు ధరతో నాణ్యతానుసారం వ్యాపారమైంది.

వేరుశనగ ధరల్లో తగ్గుదల

Image
  17-01-2022 తెలంగాణలోని వనపర్తిలో గత వారం 60-70 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ. 6200-8150, హెచ్పిఎస్ గింజలు 80-90 కౌంట్ రూ. 10,400, 60 - 70 కౌంట్ రూ. 11,400, 60-65 కౌంట్ రూ. 11,800, 90-100 కౌంట్ రూ. 10,100, కళ్యాణి రూ. 8900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై హైదరాబాద్ కోసం డెలివరి వ్యాపారమైంది. తెలంగాణలోని గద్వాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, అచ్చంపేట, వరంగల్ ప్రాంతాలలో ప్రతి రోజు 8-9 వేల బస్తాలు కొత్త వేరుసెనగ రాబడిపై రూ. 6500-7300, నాణ్యమైన సరుకు హెచ్పీఎస్ గింజలు | 60-65 కౌంట్ హెదరాబాద్ డెలివరి రూ. 11,750-11,800, 90-100 కౌంట్ • రూ. 10,200, కళ్యాణి రూ. 8950 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై హైదరాబాద్ కోసం రవాణా అవుతున్నది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరులో నాణ్యమైన సరుకు రూ.6500-6900, హెచ్పిఎస్ గింజలు 80-90 కౌంట్ (విత్తుల కోసం) చెన్నై డెలివరి రూ. 9700-9750, కిరాణా రకం స్థానికంగా రూ. 10,200, కళ్యాణదుర్గ్, రాయదుర్గ్, మడకశిర ప్రాంతాలలో గత వారం 30-40 వేల బస్తాలు నాణ్యమైన సరుకు రూ. 6000-7000, మీడియం రూ.5200-5500, నిమ్ము సరుకు రూ. 4800-5000, హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ ప్రత్యక్ష రూ. 9

కందులు - 7 లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యం

Image
17-01-2022 కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అయిన నాఫెడ్చే కర్ణాటకలో కందుల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించింది. ప్రస్తుత మార్కెటింగ్ సీజన్ 2021-22 కోసం నాఫెడ్ 7 ల.ట. కందులు కొనుగోలు లక్ష్యం నిర్ధారించింది. ఫలితంగా గత వారం కందులు మరియు పప్పు ధర రూ. 50-100 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందింది. మయన్మార్ లో 2022 కందుల ఉత్పత్తి 2.50 ల.ట. దిగుబడి అయ్యే అవకాశం ఉన్నందున స్వేచ్ఛా వ్యాపార ఒప్పందం కింద దిగుమతి గడువు మార్చి నుండి జూన్ వరకు పొడిగించినందున కందుల ధరల పెరుగుదలకు కళ్లెం పడగలదు.

మొక్కజొన్న ధరలు

Image
17-01-2022  తమిళనాడు దిండిగలో ప్రతి రోజు 10-15 వేల బస్తాల రాబడిపై స్థానికంగా రూ. 1700-1750, ఈరోడ్, నమక్కల్, ఉడుముల్పేట కోసం రూ. 1900-1950, కల్లకుర్చి, తిరుకోవిలూరు, చిన్నసేలం, ఉలుండరుపేట, శంకరాపురం ప్రాంతాలలో 10-15 వాహనాలు రూ. 1500-1750, నమక్కల్, ఈరోడ్ డెలివరి రూ. 1950-2000, రాజుపాలయం, శంకరన్ కోవిల్, పెరంబ్లూరు, ధారాపురం, పుదుకొట్టై, కోవిల్పట్టి ప్రాంతాలలో 25-30 వాహనాలు రూ. 1650-1750, ఈరోడ్, నమక్కల్ డెలివరి రూ. 1930-1950 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

పతనమవుతున్న పసుపు ధరలు

Image
  17-01-2022 ఎన్సీడిఇఎక్స్ వద్ద గత సోమవారం జనవరి వాయిదా రూ. 10,460 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం వరకు రూ. 196 క్షీణించి రూ. 10,264 మరియు మే వాయిదా రూ. 194 నష్టంతో రూ. 10,290 వద్ద ముగిసింది. 

గత వారం వర్షాలకు దెబ్బతిన్న మిర్చి పంట

Image
  17-01-2022 గత వారం వరుసగా మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మిర్చి పంటకు తీరని నష్టం వాటిల్లింది. గుంటూరు మార్కెట్లో గత వారం మూడు రోజుల లావాదేవీలలో శీతల గిడ్డంగుల నుండి 90 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై 50 వేల బస్తాలవ సరుకు అమ్మకమైంది. అన్ని రకాల ధరలు స్థిరపడ్డాయి. గుంటూరు యార్డులో కర్నూలు, ఎమ్మిగనూరు, ప్రకాశం, భద్రాచలం 1.90 బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా 1.40 లక్ష బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో 60 శాతం నిమ్ము సరుకు మరియు 40 శాతం నాణ్యమైన రాబడి కాగా, డీలక్స్ రకాలు భారీ డిమాండ్ చవిచూశాయి. డీలక్స్ రకాలలో డిడి, 341, తేజ, సీడ్ రకం, తాలు కాయలు రూ. 200-300 వృద్ధి చెందాయి. గత వారం కురిసిన వర్షాల వలన మరో వారం రోజులపాటు నిమ్ము సరుకు రాబడికే అవకాశం ఉంది. 

వేసవిలో కొత్తిమీర సాగు విధానం

Image
  వంటలకు రుచిని,సువాసన ఇచ్చే కొత్తిమీరకు ప్రత్యేక స్థానం ఉంది. మిగిలిన అన్ని కాలాలలో విరివిగా దొరికినా వేసవిలో మాత్రం కొత్తిమీర కొండ ఎక్కి కూర్చుంటుంది. ఎందుకంటే వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రతల వలన ధనియం గింజల్లో మొలక శాతం తక్కువగా ఉండటంతో పాటు ఆకుల పెరుగుదల కూడా తగ్గుతుంది. అందుకే వేసవి వచ్చిందంటే కొత్తిమీరకు గిరాకీ పెరుగుతుంది. ఇప్పుడు ఉండే అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవాలంటే కొత్తిమీర సాగులో కొన్ని మెళకువలు పాటించాలి. అధిక గిరాకీ అందిపుచ్చుకునేందుకు పందిర్ల కింద కొత్తిమీర సాగు చేయడం ద్వారా లాభసాటిగా ఉంటుంది.

పటిష్టంగా మినుముల ధరలు

Image
  09-01-2022 దేశంలో 7, జనవరి వరకు మినుము పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 6.94 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 6.34 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం గత ఏడాది మాదిరిగానే 2.68 లక్షల హెక్టార్లు, తమిళనాడులో 2.23 లక్షల హెక్టార్లు, ఒరిస్సాలో 44 వేల హెక్టార్లు తగ్గి కేవలం 99 వేల హెక్టార్లు ఉంది. లభించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం మినుమలు ఎక్కువగా ఉపయోగించే దక్షిణాది రాష్ట్రాలలో పొంగల్ గిరాకీ కారణంగా పప్పు ధరలు పెరిగాయి.

తగ్గిన పెసర విస్తీర్ణం

Image
  09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది. 

నిలకడగా పత్తి ధరలు

Image
  09-01-2022 వరంగల్లో దినసరి 5-6 వేల బస్తాల రాబడిపై రూ. 8500-9705, ప్రతికండీ రూ. 72000-76000, గింజలు రూ. 3400-4000, పిండి రూ. 3000-3300, భైంసాలో 1000 బేళ్ల రాబడిపై రూ. 9100-9300, ప్రతికండీ రూ. 74500-75000, గింజలు రూ. 4000-4100, పిండి రూ. 3600-3650, ఆదిలాబాద్లో 29 మిమీ ప్రతికండీ రూ.72000-76000, గుంటూరులో 2500 బేళ్ల రాబడిపై రూ.8800-9400, ప్రతి కండీ 29 మి.మీ. రూ. 73000-75000, 30 మి.మీ. రూ. 75000-76000, గింజలు రూ. 3800-3950, మహారాష్ట్రలో 45-50 వేల బేళ్ల రాబడిపై రూ.8800-10200, ప్రతికండీ రూ.73200-77500, గింజలు రూ.3800-4200, పిండి రూ. 3500-3750, మధ్య ప్రదేశ్లో 12-14 వేల బేళ్ల రాబడిపై రూ. 7400-10000, ప్రతికండీ రూ. 72500-73500, గింజలు రూ.3500-4200, గుజరాత్లో 30-35 వేల బేళ్ల రాబడిపై రూ. 8000-10250, ప్రతికండీ రూ. 70500-73500, గింజలు రూ. 3750-4125, పంజాబ్, హర్యాణా, రాజస్తాన్ సహా ఉత్తరభారతంలో 3-4 వేల బేళ్ల రాబడిపై రూ.9200-9800, ప్రతికండీ రూ.72000-75000 ధరతో వ్యాపారమయింది.

డిసెంబర్ చివరి నాటికి పంచదార ఉత్పత్తి

Image
  09-01-2022 అంతర్జాతీయ విపణిలో పంచదార ధరలు పతనమైనందున గడిచిన ఒక నెల రోజుల నుండి ఎగుమతి వ్యాపారం కుంటుపడింది. అయితే, ప్రస్తుత సీజన్ ప్రారంభానికి ముందే 3840ల.ట. పంచదార ఎగుమతి వ్యాపారం కుదిరింది. ప్రస్తుత సీజన్ ముగియడానికి 9 నెలల సమయం ఉన్నందున ఎగుమతి వ్యాపారులు తొందరపాటు చర్యలు చేపట్టడంలేదని భారత పంచదార మిల్లర్ల సమాఖ్య (ఐఎస్ఎంఎ) పేర్కొన్నది.

క్షీణించిన కొబ్బరి కొనుగోళ్లు

Image
  09-01-2022 దక్షిణాది రాష్ట్రాలలో ఈ ఏడాది గణనీయమైన కొబ్బరికాయల ఉత్పత్తితో పాటు కొత్త సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభమైంది. కరోనా మహమ్మారి మూడోదశ విజృంభణతో వివాహాల సీజన్ కోసం డిమాండ్ తగ్గినందున ధరలు కుంగుబాట పడుతున్నాయి. ఇటీవల కేరళ, తమిళనాడులో కురిసిన వర్షాల వలన కొబ్బరి పంటకు ప్రయోజనం చేకూరినందున కొబ్బరి కాయల పరిమాణం వృద్ధి చెందగలదని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు పెంచినందున ఈ ఏడాది ధరలు ఆశించినంతగా పెరిగే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. కరోనా కారణంగా దేవాలయాలలో కొబ్బరి కాయల వినియోగం తగ్గే అవకాశం ఉంది. 

అప్రమత్తమవుతున్న బెల్లం స్టాకిస్టులు

Image
  09-01-2022 ఉత్తర ప్రదేశ్లో ఈ ఏడాది చెరకు ఉత్పత్తి గణనీయంగా రాణిస్తున్నప్పటికీ దిగుబడులు కొరవడుతున్నందున బెల్లం తయారీ ప్రక్రియ కుంటుపడుతోంది. తద్వారా ముజఫర్ నగర్ శీతల గిడ్డంగులలో ఈ ఏడాది బెల్లం నిల్వలు గత ఏడాదితో పోలిస్తే 2 లక్షల బస్తాలు కొరత ఏర్పడినందున స్టాకిస్టులు ఒంటికాలిపై లేచి నిలుచున్నారు. భవిష్యత్తులో ధరలు ఇనుమస్తాయనడానికి ఇది ప్రబల నిదర్శనం. గుజరాత్, రాజస్తాన్, బీహార్, బెంగాల్, పంజాబ్, హర్యాణా లాంటి ప్రముఖ వినియోగ రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ బెల్లం విస్తృతంగా వినియోగమవుతుంది. ఇలాంటి పరిస్థితులలో మహారాష్ట్ర స్టాకిస్టులు ప్రస్తుత ధరలతో బెల్లం నిల్వ చేయడం లాభదాయకంగా ఉండగలదు. 

రాగులు

Image
  09-01-2022 కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో వరి మరియు రాగులు ప్రధానంగా సాగు చేస్తుంటారు. హనూర్ మరియు చామరాజనగర్ తాలూకాలలో రాగులు భారీగా ఉత్పత్తి అవుతుంటాయి. రాగుల పంట నూర్పిడి ప్రక్రియ ఇటీవలనే ముగిసింది. నిల్వ సౌకర్యం అందుబాటులో ఉన్న రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయించేందుకు సరుకు నిల్వ చేశారు. ప్రభుత్వం రూ. 3370 కనీస మద్దతు నిర్ధారించగా, మార్కెట్లో వ్యాపారులు రూ. 2700–2800 ప్రతి క్వింటాలుకు ప్రతిపాదిస్తున్నారు. ప్రభుత్వం త్వరలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నది. ఆర్థికంగా వెనుకబడిన చిన్న తరహా రైతులు తమ సరుకును చౌక ధరతో మార్కెట్లలో విక్రయిస్తున్నారు.

కర్ణాటకలో కొత్త చింతపండు రాబడులకు శ్రీకారం

Image
  09-01-2022  సానుకూలంగా పరిణమించినందున ఈ నెలాఖరు నాటికి దక్షిణాది రాష్ట్రాలలో చింతపండు రాబడులు పోటెత్తే అవకాశం కనిపిస్తున్నదని వ్యాపారులు పేర్కొంటున్నారు. కొత్త సీజన్ భారీ మిగులు నిల్వలతో ప్రారంభమవుతున్నది. అమ్మకాలు సాధారణంగా కొనసాగినందున ధరలు ప్రభావితం చెందలేదు. ఈ ఏడాది దక్షిణాదిలోని కొన్ని ఉత్పాదక ప్రాంతాలలో అతివృష్టి వలన చింతకాయలకు కీటక సంక్రమణం కొనుగొనబడింది. తద్వారా ఉత్పత్తి ప్రభావితం కాగలదని వ్యాపారులు భావిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు చెట్లపైన ఉన్న కాయ అత్యంత సంతృప్తికరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని నెలలలో కొత్త సరుకు రాబడులు ప్రారంభమయ్యే అంచనా వ్యక్తమవుతున్నది. కొత్త సరుకు రాబడులు ప్రారంభమైన వెంటనే పాత సరుకుకు డిమాండ్ డీలా పడగలదు. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా కరోనా ఒమిక్రాన్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నందున కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ ప్రకటించాయి. వివాహాది శుభ కార్యాలు పరిమితం కావడమే కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగం కుంటుపడే అవకాశం కనిపిస్తున్నది. కావున మార్చి-ఏప్రిల్ వరకు సరఫరా కుంటుపడే అవకాశం ఉంది. కర్ణాటకలోని బెల్గాం, రాణిబెన్నూర్, హోస్పేట, తుంకూరు చ

పోటెత్తుతున్న వేరుశనగ రాబడులు

Image
  09-01-2022 దక్షిణాది రాష్ట్రాలు మరియు గుజరాత్, రాజస్తాన్లోని అన్ని మార్కెట్లలో కలిసి గత వారం 5-6 లక్షల బస్తాల వేరుసెనగ రాబడి అయింది. వినియోగ రాష్ట్రాలలో కిరాణా వ్యాపారులు మరియు నూనె మిల్లర్లు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నందున ధరలు పురోగమించడం లేదు. ప్రస్తుతం తెలంగాణలో వారంలో రాబడులు 1.50 లక్షల బస్తాలు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో 1 లక్ష బస్తాలు, గుజరాత్లో 2 లక్షల బస్తాలను అధిగమిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల వ్యాపారులు సకాలంలో చెల్లింపులు చేయనందున వ్యాపారం నత్తనడకేసింది. 

క్షీణించిన నువ్వుల కొనుగోళ్లు

Image
  09-01-2022 ప్రస్తుతం నువ్వులకు కొరవడిన ఎగుమతి డిమాండ్ మరియు దేశంలో సంక్రాంతి పండుగ కొనుగోళ్లు ముగిసినందున ధర ప్రతి క్వింటాలు రూ. 500-600 పతనమైంది. రాజస్తాన్లోని బికనీర్, కోటా, నోఖా, పాలి, గంగానగర్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 10-12 వేల బస్తాల సరుకు రాబడిపై తెల్లనువ్వులు రూ. 9000-10,000, గజ్జర్ నువ్వులు రూ. 8700-9000, తమిళనాడు డెలివరి రూ. 7300, తెల్లనువ్వులు రూ.7500 ప్రతి క్వింటాలు ధరతో జనవరి 20 వరకు లోడింగ్ కండిషన్తో వ్యాపారమైంది. ఒడిశ్శాలోని మల్కన్ గిరి ప్రాంతంలో కొత్త నువ్వుల రాబడి సంక్రాంతి తర్వాత ప్రారంభమై రాబడులు మరింత పోటెత్తే అవకాశం ఉంది. 

పసుపు గిరాకీ

Image
  09-01-2022 వ్యాపారస్తుల కథనం ప్రకారం కొత్త సీజన్ ప్రారంభం కావడానికి ముందు వాయిదా ధరలు నిరవధికంగా పెరగిన నేపథ్యంలో మార్కెట్ ధరలు పెరగడంతో సరుకు నిల్వచేసిన రైతులు మరియు నాలుగు సంవత్సరాలుగా సరుకు నిల్వచేసి నిరాశకు గురైన స్టాకిస్టుల అమ్మకాలతో గత వారం ఈరోడ్ ప్రాంతంలో 75-80 వేల బస్తాలు, ఆంధ్ర, తెలంగాణాలలో 20-22 వేల బస్తాలు మరియు మహారాష్ట్రలో 40 వేల బస్తాలకుపైగా మరియు జింతూరు, శేన్ గాంవ్, వాషిం, కేసముద్రం మొదలగు చిన్న కేంద్రాలలో కూడా కలిసి దాదాపు 1.50 లక్షల బస్తాల అమ్మకంపై ధరలు రూ. 300-500 వరకు పెరిగాయి. ఇందుకు కారణమేమనగా, దేశంలోని మరఆడించే యూనిట్లు అవసరానికి అనుగుణంగానే కొనుగోలు చేశాయి. ప్రస్తుత ధర లను పరిగణనలోకి తీసుకుంటే సీజన్లో రైతులు కూడా ఉత్పత్తి అయిన మొత్తం సరుకు విక్రయించే అవకాశం కలదు. కావున, రాబడలు భారీగా పెరిగిన సమయంలో ఒకసారి ధరలు మందకొడిగా మారే అవకాశముంది. ఎందుకనగా, జనవరి చివ రివారం నుండి ఈరోడ్లో మరియు ఫిబ్రవరి మొదటి వారం నుండి తెలంగాణలో మరియు మార్చిలో మహారాష్ట్రలో రాబడులు పెరగగలవు మరియు వాయిదా ధరలలో ఒకసారి మందకొడి సర్కిట్కు అవకాశముంది.

రికార్డు స్ధాయిలో మిరప రాబడులు- ధరలు పటిష్ఠం

Image
  09-01-2022 వ్యాపారస్తుల కథనం ప్రకారం గతవారం దేశంలోని అన్ని ఉత్పా దక కేంద్రాలలో కలిసి దాదాపు 13.50 లక్షల బస్తాల మిరప రాబడి అయినప్పటికీ, ధరలు పటిష్టంగా ఉన్నాయి. ఇందుకు ముఖ్య కారణమేమనగా, విస్తీర్ణం రికార్డు స్థాయికి పెరిగినప్పటికీ, ఇంతవరకు వర్షాలు మరియు చీడపీడల కారణంగా దిగుబడి తగ్గిన నేపథ్యంలో రాబడి అవుతున్న మొత్తం సరుకు అమ్మకమవుతున్నది. గుంటూరులో కోల్డు స్టోరేజీలు మరియు రైతుల సరుకు కలిసి మొత్తం 5 లక్షల బస్తాలు, ఖమ్మంలో 80 వేల బస్తాలు, వరంగల్లో 55-60 వేలు, హైదరాబాద్లో 35-40 వేలు, మహారాష్ట్రలో 25-30 వేలు, మధ్యప్రదేశ్లో 1.50 లక్షల బస్తాలు, కర్నాట కలో సుమారు 4 లక్షల బస్తాలు, గుజరాత్, రాజస్తాన్, తెలంగాణా, ఆంధ్రలోని ఇతర మార్కెట్లలో కలిసి సుమారు 13 లక్షల బస్తాలకు పైగా సరుకు రాబడి అయింది. గుంటూరులో వారంలో కోల్డుస్టోరేజీల నుండి 2.50 లక్షల బస్తాల రాబడిపై 1.10 లక్షల బస్తాల సరుకు అమ్మకమయింది. ఎందుకనగా, కొత్త సరుకు రాబడి అధికంగా ఉన్న నేపథ్యంలో ఎసి డీలక్స్ రకాలకు డిమాండ్ తగ్గింది మరియు అన్ని రకాల ధరలు రూ. 500-600 మేర తగ్గాయి. గుంటూరులో కర్నూలు, ఎమ్మిగనూరు, ప్రకాశం మరియు భద్రాచలం ప్రాంతాల నుండి 2.70

తగ్గిన రబీ పెసర సాగు విస్తీర్ణం

Image
  02-01-2022 గతవారం ఉత్పాదక కేంద్రాలలో రాబడులు తగ్గినప్పటికీ, పప్పులకు గిరాకీ తక్కువగా ఉండడంతో పెసలు మరియు పెసరపప్పు ధరలు రూ. 150-200 ప్రతిక్వింటాలుకు తగ్గాయి. వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి వివరాల ప్రకారం 31, డిసెంబర్ వరకు దేశంలో పెసర పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 3.39 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.29 లక్షల హెక్టార్లకు మరియు కేసరి విస్తీర్ణం 3.32 లక్షల హెక్టార్లు మరియు మినుము విస్తీర్ణం 6.43 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 5.66 లక్షల హెక్టార్లకు చేరింది.

కొబ్బరి అధిక ఉత్పత్తి - ధరలు పెరిగే అవకాశం లేనట్లే

Image
  02-01-2022 2016 తర్వాత 2019 నుండి వరుసగా ప్రతి సంవత్సరం కొబ్బరికాయల ఉత్పత్తి రాణించడం వలన సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభమవుతున్నది. ఈ ఏడాది కూడా అన్ని ఉత్పాదక రాష్ట్రాలలో పంట అత్యంత సంతృప్తికరంగా ఉన్నట్లు తెలుస్తోంది.దక్షిణాదిలో కొత్త సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభమైనందున 2022 కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన మద్దతు ధర రూ. 10,590 కి గాను కేరళలో తగ్గి రూ.9000 వద్ద ట్రేడవుతున్నది. ఇదే విధంగా కొబ్బరికాయ ధర రూ.32 ప్రభుత్వం నిర్ధారించగా రూ. 28-29 ధరతో విక్రయించబడుతున్నది. రాష్ట్రంలో జనవరి 5 నుండి కొబ్బరికాయలను కొనుగోలు చేయనున్నట్లు వ్యవసాయ మంత్రి పి. ప్రసాద్ తెలిపారు. 2022 ధరలు చౌకగా ఉన్నప్పుడు కొనుగోలు చేయడం మరియు ఇనుమడించిన తరుణంలో విక్రయించడం లాభదాయకంగా ఉండగలదని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. 

ప్రతికూల వాతావరణ పరిస్థితులలో చింతపండు రాబడులు ఆలస్యమయ్యే అవకాశం

Image
  02-01-2022 కర్నాటకలోని బెల్గాంవ్ మరియు తదితర ప్రాంతాలలో ఇంతవరకు వర్షాల నేపథ్యంలో సరుకు తయారీలో సమస్యల కారణంగా రాబడులు ఆలస్యమౌతున్నాయి. సంక్రాంతి తరువాత కొత్త సరుకు రాబడులు పెరిగే అవకాశం కలదు. అయితే, 2022 లో కూడా ధరలు పెరిగే అవకాశము కనిపించడంలేదు. ఎందుకనగా, కొత్త సరుకు రాబడులకు అవకాశమున్నందున, మార్కెట్లలో పాత సరుకు అమ్మకాలు తగ్గాయి. అయితే, కొత్త సరుకు రాబడులు మరింత ఆలస్య మయ్యే అవకాశం కలదు. ఎందుకనగా, చెట్లపై పంట ఎండడంలో ఆలస్యమౌతున్నది. 

పామాయిల్ ధరలు తగ్గే అవకాశం లేనట్లే

Image
  02-01-2022 2018 మరియు 2019 లో రైతులు ఎరుమల వినియోగాన్ని తగ్గించినందున దిగుబడుల కొరతను ఎదుర్కోవలసి వస్తోందని మలేషియా పామాయిల్ ఉత్పాదక దేశాల సమాఖ్య (సిపిఒపిసి) పేర్కొన్నది. చాలా కాలం నుండి కూలీల కొరత కూడా ఎదుర్కోవడంతో పాటు తగ్గిన పామాయిల్ ఉత్పత్తి మరో సంవత్సరం కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని సిపిఒపిసి తెలిపింది. తద్వారా 2022 లో ధరలు ఇనుమడిస్తూనే ఉండగలవని తెలుస్తోంది.

మినుములు ధరలు తగ్గుముఖం

Image
  02-01-2022 వ్యవసాయ - మంత్రిత్వశాఖ వారి వివరాల ప్రకారం 31, డిసెంబర్ వరకు దేశంలో రబీ మినుము పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 6.43 లక్షల హెక్టార్ల నుండి పెరిగి 5.66 లక్షల హెక్టార్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో మ్యాన్మార్ ఎఫ్ఎక్యూ మినుములు 20 డాలర్లు పెరిగి 795 డాలర్లు మరియు ఎస్ క్యూ 880 డాలర్లు ప్రతిటన్ను ప్రతిపాదించడంతో ముంబాయిలో ఎఫ్ఎక్యూ కొత్త రూ. 6500, పాత రూ. - 6400, చెన్నైలో ఎస్యూ రూ.6750-6800, ఎఫ్ఎక్యూ రూ. 6250, ఢిల్లీలో ఎస్యూ రూ. 7100, ఎఫ్ఎక్యూ రూ. 6550 మరియు కోలకత్తాలో ఎఫ్ఎక్యూ రూ. 6450 ధరతో వ్యాపారమయింది. దక్షిణ భారత పప్పు మిల్లర్లు కొత్త సరుకు కొనుగోలు చేస్తున్నందున దిగుమతి అయిన ఎఫ్ఎక్యూ సరుకుకు డిమాండ్ తగ్గడంతో ధర రూ. 75–100 ప్రతిక్వింటాలుకు తగ్గింది. గతవారం ఆంధ్ర ప్రాంతపు కొత్త పియు-31 రకం మినుములు చెన్నై డెలివరీ రూ.6700, 402 రకం రూ. 7300, తమిళనాడులోని కోవిల్ పట్టి ప్రాంతపు కొత్త సరుకు రూ. 6650 ధరతో వ్యాపారమయింది.

జూన్ వరకు కందులు దిగుమతికి అవకాశం - ధరలు స్థిరం

Image
 02-01-2022 వ్యాపారస్తుల కథనం ప్రకారం దేశంలో కందుల ఉత్పత్తి ప్రభుత్వ వర్గాల అంచనా ప్రకారం 44లక్షల టన్నులతో పోలిస్తే 20 శాతం తగ్గి 32-33 లక్షల టన్నులు ఉండే అవకాశం కలదు. ఇందుకు ముఖ్య కారణమేమనగా, భారీ వర్షాలు మరియు చీడపీడల కారణంగా ఈ ఏడాది సరుకు నాణ్యత మరియు దిగుబడి తగ్గుచున్నది. అయితే, కేంద్ర ప్రభుత్వం ధరలను అదుపులో ఉంచడం కోసం 21, డిసెంబర్ న స్వేఛ్చాదిగుమతుల వ్యవధిని జూన్, 2022 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించడంతో ధరలు కొంతమేర తగ్గాయి. ఎందుకనగా, ఏప్రిల్ నుండి నవంబర్, 2021 లో ఆఫ్రికా దేశాలు మరియు మాన్మార్ నుండి సుమారు 4 లక్షల టన్నులకు పైగా కందులు దిగుమతి అయ్యాయి మరియు కొత్త సీజన్ లో 3-4 లక్షల టన్నుల దిగుమతుల వలన కూడా 2022 లో సరుకు కొరత ఉండగలదు. కావున జూన్ తరువాతనే ధరలు ఎక్కువగా పెరిగే పరిస్థితి ఉంది.

పెరిగిన శనగ సేద్యం

Image
   02-01-2022  భారత్లోని ప్రముఖ శనగ ఉత్పాదక రాష్ట్రాలైన రాజస్తాన్, మధ్యప్రదేశ్లో దేశీ శనగ ధరలు స్థిరపడగా, కాబూలీ శనగలు రూ. 300-400 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందాయి. దక్షిణాది రాష్ట్రాలలో సంక్రాంతి డిమాండ్ నెలకొన్నందున పప్పు మిల్లుల కొనుగోళ్లు పెరిగి ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్, జమ్మలమడుగు ప్రాంతాలలో జెజె రకం శనగలు ఈరోడ్ డెలివరి రూ. 75 పెరిగి రూ. 5350-5375 మరియు కర్ణాటక సరుకు రూ. 5500, ట్యుటికోరిన్ ఓడరేవు వద్ద టాంజానియా దిగుమతి అయిన సరుకు రూ. 4850, ముంబైలో రూ. 4450-4550, రష్యా కాబూలీ శనగలు రూ. 4600-4650 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని గదగ్, హుబ్లీ, ధార్వాడ్ ప్రాంతాలలో స్వల్పంగా కొత్త శనగల రాబడులు ప్రారంభమయ్యాయి. రాబడులు వృద్ధి చెందడానికి మరో 15 రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత రబీ సీజన్లో డిసెంబర్ 31 దేశంలో శనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 105.68 ల.హె. నుండి 2 శాతం వృద్ధి చెంది 107.69 ల.హె.కు విస్తరించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. 

పెరుగుతున్న వేరుశనగ రాబడులు - తగ్గుతున్న ధరలు

Image
  02-01-2022 రబీ నూనెగింజల విస్తీర్ణంలో ఇంతవరకు వేరుశనగ విస్తీర్ణం గత ఏడాది మాదిరిగా 3.64 లక్షల హెక్టార్లు ఉండగా, అవిశె విస్తీర్ణం 2.57 లక్షల హెక్టార్లు, సన్ఫ్లవర్ 1.01 లక్షల హెక్టార్లు, కుసుమ 68000 హెక్టార్లు, నువ్వులు 30000 హెక్టార్లు మరియు ఇతర నూనెగింజల విస్తీర్ణం 33000 హెక్టార్లు ఉంది. అయితే, ప్రస్తుతం వనపర్తిలో వారంలో 2 లక్షల బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ. 6000-8200, 80-90 కౌంట్ రూ. 10000, 70-80 కౌంట్ రూ.11500, 60-70 కౌంట్ రూ. 12000 ధరతో వ్యాపారమై చిత్తూరు ఉత్పాదక కేంద్రాలలో విత్తనాలకోసం ఎగుమతి అవుతున్నది. ఎందుకనగా, ఈ ఏడాది భారీ వర్షాల వలన చిత్తూరు ప్రాంతంలో పంటకు నష్టం వాటిల్లడంతో రైతులు తిరిగి పంట విత్తవలసి వస్తున్నది.

నిజామాబాద్ లో కొత్త పసుపు

Image
 02-01-2022 ప్రతి సంవత్సరం మాదిరిగా గత బుధవారం 30 బస్తాల కొత్త పసుపు రాబడిపై ప్రతిభా రకం 15 శాతం నిమ్ము రకం కొమ్ము మరియు గట్టా రూ.6500-7100 ప్రతి క్వింటాలు ధరతో ముహూర్త వ్యాపారమయింది.

వచ్చే వారం నుండి కొత్త మిర్చి రాబడులు పోటెత్తే అవకాశం

Image
  02-01-2022 దేశంలోని అన్ని మార్కెట్లలో కలిసి గత వారం 7 లక్షల బస్తాలకు పైగా కొత్త మిర్చి రాబడి అయింది. నాణ్యమైన సరుకు రకాల కొనుగోళ్లు జోరందుకున్నందున ధరలపై ఎలాంటి దుష్ప్రభావం పొడసూపలేదు. వచ్చే వారం రాబడులు మరింత పోటెత్తగలవని తెలుస్తోంది. మిరప పొడి కోసం దేశీయంగా భారీ డిమాండ్ ఉన్నందున గ్రైండింగ్ యూనిట్ల కొనుగోళ్లు జోరందుకున్నాయి. లాభసాటి ధరలు లభ్యమవుతున్నందున రైతులు పంట కోతలు శరవేగంతో చేపడుతున్నారని తెలుస్తోంది.గత వారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని మార్కెట్లలో కలిసి దాదాపు 2 లక్షల బస్తాలు, మధ్య ప్రదేశ్లో 2 లక్షల బస్తాలు, కర్ణాటకలో 3 లక్షల బస్తాలకు పైగా కొత్త మిర్చి రాబడి అయింది. గుంటూరు శీతల గిడ్డంగుల నుండి మరో 3 లక్షల బస్తాలు, ఖమ్మం, వరంగల్లో 50 వేల బస్తాలు, కర్ణాటకలో 20 వేల బస్తాల సరుకు రాబడులను పరిశీలిస్తే స్టాకిస్టులు మరియు రైతులు పోటీపడి సరుకు విక్రయిస్తున్నట్లు అవగతమవుతుంది. 

పత్తి పదివేలు

Image
  2-01-2022 నాణ్యమైన పత్తి ఉంటే చాలు.. వ్యాపారులు పోటీ పడి కొంటున్నారు. ఇప్పటికే క్వింటాలుకు రూ.10 వేలకు పైగా పలుకుతోంది. ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది. దేశంలో పత్తి ఉత్పత్తి పడిపోవడంతో డిమాండు పెరిగిందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.