రికార్డు స్థాయిలో మిర్చి రాబడులు - ధరలు స్థిరం

 


23-01-2022

2021-22 సీజన్ కోసం మిర్చిసేద్యం భారీగా విస్తరించబడింది. ప్రముఖ మిర్చి ఉత్పాదక ప్రాంతాలైన దక్షిణాదిలో ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు పంటకు తీరని నష్టం వాటిల్లింది. ఫలితంగా ఉత్పత్తి తగ్గే అంచనాతో ఎడతెరిపి లేకుండా స్టాకిస్టులు సరుకు కొనుగోళ్లు చేపడుతున్నందున ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఎగబాకుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని రైతులు తమ పంటను నేరుగా మార్కెట్లకు తరలిస్తున్నారు. తద్వారా వారం రోజులలో ప్రధాన అన్ని మార్కెట్లలో దాదాపు 12 లక్షల బస్తాల సరుకు రాబడి అయింది. ఒక్క కర్ణాటకలోనే 5 లక్షల బస్తాల రాబడి కాగా మొత్తం సరుకు అమ్మకమైంది. ఇటీవలె కురిసిన వర్షాలకు మిర్చి పంటకు నష్టం వాటిల్లినందున రాబోవు రోజులలో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున స్టాకిస్టులు తమ సరుకు అమ్మకానికి బదులుగా నిల్వ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. 



గుంటూరు యార్డులో గత వారం 5 రోజుల లావాదేవీలలో కర్నూలు, ఎమ్మిగనూరు, ప్రకాశం, భద్రాచలం ప్రాంతాల నుండి 2.25 లక్షల బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా క్రితం వారం మిగులు నిల్వలు సహా 2.50 లక్షల బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో 70 శాతం నిమ్ము సరుకు మరియు 30 శాతం నాణ్యమైన రాబడి కాగా, తేజ డీలక్స్ రూ. 1200, డిడి, 341, బడిగ-355, నెం-5 రకం, 273, బంగారం రకాలలో రూ. 1000, సింజెంట బడిగ రూ. 2000, 2043 రకం రూ. 3000, ఆర్మూర్, 334, సూపర్-10 రూ. 1500, మీడియం, మీడియం బెస్ట్, సీడ్ రకాలలో రూ. 1000, తేజ తాలు, ఇతర రకాల తాలు రకాలు రూ. 500, సీడ్ తాలు కాయలు రూ. 800 ప్రతి క్వింటాలుకు వృద్ధిచెందాయి. లభించిన సమాచారం ప్రకారం రాబోవు రోజులలో మిరప దిగుబడి తగ్గే అంచనాతో కొత్త డీలక్స్ మరియు తాలు రకాలు శీతలగిడ్డంగులలో నిల్వ చేసేందుకు స్టాకిస్టులు అధికంగా ఆసక్తి చూపుతున్నారు.

 గుంటూరు శీతల గిడ్డంగుల నుండి వారంలో సుమారు 80 వేల బస్తాల మిర్చి రాబడిపై 70 వేల బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో తేజ, 334, సూపర్-10, సింజెంట బడిగ, నెంబర్-5 రకాలలో రూ.500 వృద్ధి చెందాయి. కాగా, మీడియం మరియు మీడియం బెస్ట్ రకాల ధరలు స్థిరంగా ఉన్నాయి. వ్యాపారుల అభిప్రాయం ప్రకారం వాతావరణ స్థితి-గతుల మార్పు దృష్ట్యా మున్ముందు మిర్చి ధరలు వృద్ధిచెందే అంచనాతో శీతలగిడ్డంగుల నుండి తమ సరుకు అమ్మకం కోసం స్టాకిస్టులు విముఖత చూపుతున్నారు. అంతేకాకుండా డీలక్స్ రకాలు డిమాండ్ చవిచూస్తున్నాయి. గుంటూరు శీతల గిడ్డంగులలో నిల్వ అయిన తేజ నాణ్యమైన సరుకు రూ. 13,500-16,000, డీలక్స్ రూ. 16,100–16,200, మీడియం బెస్ట్ రూ. 12,500-13,400, మీడియం రూ. 11,000-11,900, బడిగ-355 రూ.17,500-19,000, మీడియం రూ. 14,00-17,000, సింజెంట బడిగ రూ.13,000-16,500, 341 రూ. 14,000-16,500, నెంబర్-5 రూ. 13,000-17,500, సూపర్-10 మరియు 334. రూ. 14,000-17,000, డీలక్స్ రూ. 17,100-17,200, మీడియం బెస్ట్ రూ. 12,500–13,900, మీడియం రూ. 11,500-12,400, 577 రకం రూ. 13,000-15,500, అన్ని సీడ్ రకాలు, మీడియం మరియు మీడియం బెస్ట్ రూ. 11,000-13,000 ధరతో వ్యాపారమైంది. గుంటూరులో తేజ కొత్త సరుకు రూ.14,000–16,000, డీలక్స్ రూ. 16,100-16,200, ఎక్స్ ట్రా ఆర్డినరి రూ. 16,300-16,500, మీడియం రూ. 11,000 -13,900, 355-బడిగ రూ. 13,500-17,500, సింజెంట బడిగ రూ. 13,000 -17,000, నాణ్యమైన డిడి రూ. 14,000–17,800, డీలక్స్ రూ. 17,900 -18,000 మరియు 341 రకం రూ. 14,000–17,800, 2043 రూ. 16,000- 23,000, బుల్లెట్ రకం రూ. 12,500-15,000, రోమి రకం రూ.10,000-13,500, నెంబర్-5 రూ. 13,000–17,000, సూపర్-10, 334 రూ. 13,000-16,500, డీలక్స్ రూ. 16,600-17,000 మరియు 273 రూ.13,000-15,500, బంగారం రూ. 13,000–16,000, ఆర్మూరు రకం రూ. 11,000-14,000, మీడియం బెస్ట్ సీడ్ రకాలు రూ. 10,000-13,500, తాలు కాయలు తేజ రూ. 7000-8500, ఇతర రకాలు రూ. 3000-7800 ప్రతి క్వింటాలు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది. 

తెలంగాణలోని వరంగల్లో గతవారం 28-30 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై నాణ్యమైన తేజ రూ. 16,600, మీడియం రూ. 13,000-16,000, నాణ్యమైన 341 సరుకు రూ. 18,200, మీడియం రూ.15,000-17,000, వండర్ హాట్ రూ.17,500 మరియు 1048 రకం సరుకు రూ. 13,000, దీపిక రూ. 16,100, తాలు కాయలు తేజ రూ. 5000 - 8000, 341 రూ. 4000-6500, మరియు 4-5 వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకం కాగా, మీడియం బెస్ట్ రూ. 14,800, మీడియం 341 రకం రూ.15,000, నాణ్యమైన వండర్ హాట్ రూ. 19,000, మీడియం రూ. 15,000-17,000, టమాటా రూ. 26,000, సింగల్పట్టి రూ. 24,000, దీపిక రూ. 16,500 మరియు 

ఖమ్మంలో 1.20 లక్షల కొత్త మిరప రాబడి కాగా, నాణ్యమైన తేజ రూ. 16,100, మీడియం రూ. 15,500-16,000, తాలు రూ.8000-8500 మరియు 10-11 వేల బస్తాల ఎసి సరుకు తేజ రూ. 16,600, తాలు కాయలు రూ. 7000-7500 ధరతో వ్యాపారమైంది. 

హైదరాబాద్లో గత వారం 35-40 వేల బల కొత్త సరుకు రాబడిపై తేజ రూ. 10,000-15,000,బడిగ రూ. 15,000-20,000, 273 మీడియం బెస్ట్ రూ. 10,000-14,500, మీడియం సూపర్-10 రూ. 10,000-15,000, నాణ్యమైన సరుకు రూ. 16,000, 341, డిడి, సి-5 రూ. 10,000-15,000, నిమ్ము సరుకు రూ. 8000 - 12,000, తాలు కాయలు తేజ రూ. 5000-7500, ఇతర రకాలు రూ. 1000-5000 ప్రతి క్వింటాలు ధరతో _ వ్యాపారమైంది.

 కర్ణాటకలోని బ్యాడ్లీలో సోమ మరియు గురువారాలలో కలిసి 4,12 లక్షల బస్తాల కొత్త మిర్చి రాబడిపై నాణ్యమైన డబ్బి మిరప రూ. 38,000–43,000, కెడిఎల్ డీలక్స్ రూ. 30,000-35,000, మీడియం బెస్ట్ రూ. 24,000–28,000, మీడియం రూ. 8500-10,500, 2043 డీలక్స్ రూ.22,000-26,000, మీడియం బెస్ట్ రూ. 18,000-22,000, నాణ్యమైన 5531 సరుకు రూ. 12,000-15,500, మీడియం రూ. 10,000-12,000, తాలు కాయలు కెడిఎల్ రూ. 1500-2500, సీడ్ రకం రూ.4000000 మరియు సింధనూర్లో మంగళవారం నాడు 25 వేల బస్తాల కొత్త మిరప రాబడి కాగా, బడిగ రకం రూ. 25,000-30,000, సింజెంట మిర్చి రూ. 25,000-32,000, మీడియం రూ. 15,000-23,000 మరియు 5531 రకం రూ. 13,500-15,000, జిటి, సూపర్-10 రకం రూ. 10,000-12,000, తాలు కాయలు రూ. 2000-4000 ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని నందూర్ బార్ దినసరి 4-5 క్వింటాళ్ళ నిమ్ము సరుకు రాబడి కాగా, విఎన్ఆర్ రకం మిర్చి రూ. 3200-3500 మరియు 5531 రకం రూ. 3000-3400 ధరతో వ్యాపారమైంది. 

మధ్య ప్రదేశ్లోని బేడియాలో గత బుధ, గురువారాలలో కలిసి 30-35 వేల బస్తాల సరుకు రాబడిపై మహి ఫుల్కట్ మిర్చి ధర రూ. 11,500-14,000, తొడిమెతో కూడిన సరుకు రూ. 9800-12,200, లాల్కట్ రూ. 8000-9500, మీడియం రూ. 8500-8500, పుల కట్ తాలు కాయలు రూ. 6300-7000, తొడిమెతో కూడిన తాలు రూ. 5300-6000 మరియు ధామనోద్లో శుక్రవారం నాడు 30 వేల బస్తాల సరుకు రాబడిపై నాణ్యమైన 1,000-15,000, మీడియం రూ.12,000-13,000, నెంబర్-12 తొడిమ తీసిన సరుకు రూ. , తొడిమెతో కూడిన సరుకు రూ. 10,000-11,000, సన్న రకం తాలు కాయలు రూ. 5500-6500, లావు 12,000-13,500, రకం రూ. 4500–5500 ధరతో వ్యాపారమైంది. 

ఛత్తీస్గఢ్ ని జగదల్పూర్లో గత వారం 6-7 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై తేజ రూ.14,500-15,500 మరియు 4884 రకం రూ. 12,500-13,500, తేజ తాలు కాయలు రూ.7800-8500 ధరతో వ్యాపారమైంది. 

తమిళనాడులోని రామనాథపురంలో గురువారం రోజు 50-60 బస్తాల కొత్త మిరప రాబడి కాగా, నాణ్యమైన సరుకు రూ. 27,000 -29,000, మీడియం రూ. 17,500 -22,000 మరియు తిరునెల్వేలి, శంకరన్ కోవిల్, కోవిల్పట్టి ప్రాంతాలలో దినసరి 400 బస్తాల సరుకు రాబడిపై రూ. 2 11,000-12,000, మీడియం రూ. 8000-9000 ధరతో వ్యాపారమెంది.

Comments

Popular posts from this blog