పెరిగిన బెల్లం రాబడులు - కొనుగోళ్లు తగ్గుదల
05-12-2021 దక్షిణాది రాష్ట్రాలలో ఇటీవల కురిసిన కుండపోత వర్షాలు మరియు ఒడిశ్శాతో పాటు తూర్పు ఆంధ్రప్రదేశ్లో తుపాను హెచ్చరికల నేపథ్యంలో బెల్లం తయారీ నిలిచిపోయింది. అయితే, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుల నుండి బెల్లం సరఫరా జోరందుకోవడంతో పాటు ఇప్పటి వరకు స్టాకిస్టుల కొనుగోళ్లు ప్రారంభం కానందున ధరలు ప్రభావితం చెందాయి. ఉత్తర ప్రదేశ్లోని ముజఫర్ నగర్ లో గత వారం 25-30 వేల బస్తాల కొత్త బెల్లం రాబడిపై 40 కిలోలు చాకూ బెల్లం రూ. 1100-1170, కురుపా రూ. 1100-1110, లడ్డు బెల్లం రూ. 1200-1240, పౌడర్ బెల్లం రూ. 1200, రస్కట్ రూ. 980-1040 మరియు హాపూర్లో 115–120 వాహనాల కొత్త బెల్లం రాబడి కాగా రూ. 1070-1100 ధరతో వ్యాపారమైంది.