ఎడితెరిపి లేకుండా దూసుకుపోతున్న జీలకర్ర వాయిదా

గుజరాత్, రాజస్తాన్ మార్కెట్లలో రాబడి అయిన సరుకు తక్షణమే విక్రయించబడుతున్నది. చౌక ధరతో సరుకు విక్రయించేందుకు రైతులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని కిరాణా వ్యాపారులు అమ్మకాలతో పాటు కొనుగోళ్ల కారణంగా ధరలకు మద్దతు లభిస్తున్నది. ఈ ఏడాది మిషన్-క్లీన్ సరుకు ప్రతి క్వింటాలు రూ.55,000 అధిగమించే అవకాశం కనిపిస్తున్నది. తద్వారా గత వారం ప్రత్యక్ష విపణిలో ధర ప్రతి క్వింటాలుకు రూ. 800-1000, పరోక్ష విపణిలో రూ.1500-1700 వృద్ధి చెందింది. ఎన్సీడిఇఎక్స్ వద్ద గత మంగళవారం మే వాయిదా రూ. 45,480 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 1620 వృద్ధి చెంది రూ. 47,100, జూన్ వాయిదా రూ. 1720 ఇనుడించి రూ. 47,750 వద్ద స్థిరపడింది.