దిగిరానంటున్న జీలకర్రవాయిదా ధరలు

 


 చైనా, బంగ్లాదేశ్ నుండి జీలకర్ర కు డిమాండ్ బలహీన పడినప్పటికీ వాయిదా ధరలు తగ్గడం లేదు. కొత్త సీజన్ ప్రారంభం కావడానికి మరో 4-5 నెలల సమయం ఉంది. సేద్యం ప్రక్రియ మరో 1-2 వారాలలో ప్రారంభం కానున్నది. ప్రస్తుత సీజన్ లో ఉత్పత్తి కుండటుపడినందున సీజన్ ప్రారంభం నుండే ధరలు ఇనుమడిస్తున్నందున పలువురు దిగ్గజ రైతుల సరుకు అమ్మకం కాలేదు. 


ప్రస్తుతం దీపావళి పండుగ డిమాండ్ ముగిసింది. ప్రస్తుత ధరలను పరిగణిస్తూ దేశంలోని కిరాణా వ్యాపారులు మార్చి వరకు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేయగలరు. 2023 లోసేద్యం సంతృప్తికరంగా విస్తరించగలదని వ్యాపారులు భావిస్తుండడమే ఇందుకు నిదర్శనం.ఎన్ సిడి ఇఎక్స్ వద్ద గత సోమవారం అక్టోబర్ వాయిదా రూ. 23,200 తో మొదలు పెట్టి గురువారం నాటికి రూ. 200 వృద్ధి చెంది రూ. 23,400 వద్ద ముగియగా నవంబర్ వాయిదా రూ. 24,000 తో ప్రారంభమై వారాంతంలో రూ. 75 పతనమై రూ. 23,925 వద్ద ముగిసింది.

గుజరాత్ లోని ఊంజాలో గత వారం 35-40 వేల బస్తాల రాబడిపై యావరేజ్ రూ. 19,000-20,000, మీడియం రూ. 20,500-21,000, నాణ్య మైన సరుకు రూ. 22,000-23,000 మరియు రాజ్ కోట్ లో 2 వేల బస్తాల రాబడిపై యావరేజ్ రూ. 19,500-20,000, మీడియం రూ. 21,000-21,500,యూరోపియన్ రకం రూ. 21,875-22, 125, కిరాణా రకం రూ. 21,500-21,875 మరియు జామ్ నగర్‌లో మీడియం రూ. 19,000-21,000, గోండల్ లో 2500-3000 బస్తాల రాబడి కాగా, మీడియం రూ. 20,300–22,800 మరియు రాజస్తాన్ లోని మెడతా,జోధ్ పూర్ ప్రాంతాలలో రూ. 20,000–21,500 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog