తగ్గిన మినుముల సేద్యం

వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి వివరాల ప్రకారం ఆగస్టు 12 నాటికి దేశంలో మినుముల సేద్యం గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 35.82 ల.హె. నుండి తగ్గి 34.19 ల.హె.కు పరిమిత మైందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. పండుగల సీజను దృష్టిలో పెట్టుకొని పప్పు ధాన్యాలు మరియు పప్పుల ధరలను నియంత్రించేందుకు కేంద్ర సర్కారు కఠిన చర్యలు చేపట్టినందున వ్యాపారులు తమ సరుకు విక్రయించేందుకు సన్నద్ధమయ్యారు.