వ్యవసాయ మంత్రిత్వశాఖ వారి వివరాల ప్రకారం ప్రస్తుత ఖరీఫ్ దేశంలో ఆగస్టు 5 వరకు సజ్జపంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 56.68 ల.హె నుండి పెరిగి 65.17 ల.హె.లకు చేరగా, జొన్న పంట విస్తీర్ణం 12.65 ల.హె. నుండి 12.62 ల.హె.లకు మరియు రాగుల విస్తీర్ణం 4.30 ల.హె. నుండి తగ్గి 2.67 ల.హె.లకు చేరింది.
ప్రస్తుత ఖరీఫ్ ఆగస్టు 3 నాటికి తెలంగాణలో ఖరీఫ్ జొన్న పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 54,092 ఎకరాల నుండి తగ్గి 25,295 ఎకరాలకు చేరింది. సజ్జ పంట విస్తీర్ణం 264 ఎకరాల నుండి పెరిగి 329 ఎకరాలకు మరియు రాగుల విస్తీర్ణం 435 ఎకరాల నుండి తగ్గి 132 ఎకరాలకు చేరింది. రాజస్థాన్లో సజ్జ పంట విస్తీర్ణం 33,29,430 హె. నుండి పెరిగి 44,38,380 హెక్టార్లు, జొన్న పంట విస్తీర్ణం 4,51, 420 హె. నుండి పెరిగి 6,20,300 హెక్టార్లకు చేరింది. గుజరాత్లో సజ్జ పంట విస్తీర్ణం 1,36,729 హె. నుండి పెరిగి 1,75,586 హెక్టార్లు, జొన్న పంట విస్తీర్ణం 16,595 హె. నుండి తగ్గి 14,335 హెక్టార్లకు చేరింది.
జొన్నలు - తెనాలి ప్రాంతంలో దినసరి 5-6 లారీల అమ్మకంపె తమిళ నాడు లోడింగ్ కండీషన్ రూ. 2150-2160 ధరతో వ్యాపారమె తమిళనాడు కోసం రవాణా అయింది. నంద్యాలలో మహేంద్ర జొన్నలు రూ. 2500-2600, మిల్వెట్ రూ. 2650, ఎరుపు రకం రూ. 2400, పచ్చ జొన్నలు రూ. 5800-6000 మరియు గుజరాత్లో రాజ్కోట్లో గత వారం 2 వేల బస్తాల రాబడిపై తెల్ల ప్రీమియం జొన్నలు రూ.3750-3825, బెస్ట్ రకం రూ. 3700-3750, యావరేజ్ రూ. 3450-3600 ధరతో వ్యాపారమైంది.
రాగులు - కర్ణాటకలోని అరిసెకెరేలో దినసరి 400-500 బస్తాలు, బెంగుళూరు, దావణగిరి, హర్పణ హల్లి, శివమొగ్గ, గుబ్బి, మెల్లూరు ప్రాంతాలలో 1500-2000 బస్తాల రాగుల అమ్మకం కాగా, ఎర్ర రాగులు రూ. 3000-3200, నాణ్యమైన సరుకు రూ. 2000-2500, ఆన్లైన్ రూ. 1800-2000 మరియు మహబూబ్ నగర్ లో రూ. 2200–2500, నర్సారావుపేట, పార్వతిపురం ప్రాంతాల నుండి 4–5 వాహనాల రాబడిపై విజయనగరం డెలీవరి రూ. 2060, చీపురుపల్లి ప్రాంతంలో 2-3 లారీల రాబడిపై లోడింగ్ కండీషన్ సరుకు రూ. 2150, లోకల్లో రూ. 2060 ధరతో వ్యాపారమైంది.
కొర్రలు - కర్ణాటకలోని బళ్లారిలో దినసరి 400-500 బస్తాల కొర్రల రాబ డిపె రూ. 2600-2900, నంద్యాలలో 2-3 వాహనాల రాబడిపై రూ. 2500 2600 ధరతో వ్యాపారమె ముంబై, దేని, విరుధ్ నగర్ ప్రాంతాల కోసం రవాణా అయింది.
ఉలువలు - కర్ణాటకలోని మైసూరు ప్రాంతంలో 2-3 లారీల ఉలువల అమ్మకం కాగా, రూ. 5700-5800, క్లీన్ సరుకు రూ. 5950-6000 ధరతో వ్యాపారమె కేరళ కోసం ఎగుమతి అవుతోంది. రాయచోటిలో నిల్వ అయిన ఎర్ర ఉలువలు విజయవాడ డెలివరి రూ. 5500-5600 ధరతో వ్యాపారమైంది.
బొబ్బర్లు (అలసందలు) - కర్ణాటకలోని మెనూరు ప్రాంతంలో 1-2 లారీల రాబ డిపె నాణ్యమెన బొబ్బర్లు రూ. 6700-7200, రెన్చ్ రూ. 5500-6200, మీడియం రూ.6500-6700 మరియు రాయచోటిలో నిల్వ అయిన నల్ల బొబ్బర్లు రూ. 6300-6600, తెలుపు రకం సరుకు రూ.6500-6600, ఎరుపు రకం రూ.5400-5600 మరియు ఆంధ్రప్రదేశ్లోని పొదిలిలో దిన సరి 4-5 వాహనాల అమ్మకం కాగా, రూ.5500 ధరతో వ్యాపారమెంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు