Posts

Showing posts with the label వేరుశనగ

దూసుకుపోతున్న వేరుశనగ ధరలు

Image
   ప్రస్తుత ఖరీఫ్లో ఆగస్టు 19 వరకు దేశంలో వేరుసెనగ విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 47,95,000 హెక్టార్ల నుండి తగ్గి 44,32,000 హెక్టార్లకు చేరింది. ఇందులో గుజరాత్లో వేరుసెనగ విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 19,01,082 హెక్టార్ల నుండి తగ్గి 17,00,123 హె .లకు చేరింది. రాజస్థాన్లో వేరుసెనగ విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 7,84,000 హెక్టార్లు ఉంది. అనగా గుజరాత్ తరువాత రెండవ ప్రముఖ స్థానంలో ఉంది.

కొత్త వేరుశనగ పంట ధరకు ఢోకా లేదు - తమిళనాడు వేరుశనగ విత్తులకు గుజరాత్ లో భారీ డిమాండ్ - వేరుశనగ పంట కోసం లభ్యమైన కేంద్ర నిధులు

Image
  05-12-2021 2022 లో వేరుసెనగ ఉత్పత్తి గణనీయంగా రాణిస్తున్నప్పటికీ ధరలు చెప్పుకోదగ్గ స్థాయికి దిగజారే అవకాశం లేదని వ్యాపారులు భావిస్తున్నారు. దేశంలో సోయానూనె వినియోగం భారీగా వృద్ధి చెందినప్పటికీ సోయాచిక్కుడు ధరలు గత ఏడాదితో పోలిస్తే ఎగబాకాయి. సన్ఫ్లవర్ నూనె దిగువుతులకు కళ్లెం పడింది, నత్తనడకేశాయి. కుసుమల నిల్వలు దాదాపు లేవనే చెప్పవచ్చు. ఈ సారి నువ్వుల ఉత్పత్తి కూడా అంతంతమాత్రమే ఉంది. పామాయిల్ నూనె ధర మార్చి వరకు దిగివచ్చే అవకాశం లేదు. ఈ ప్రభావమే సోయాచిక్కుడు మరియు వేరుసెనగకు ప్రయోజనం చేకూరుతున్నది. భారత్ నుండి ఎగుమతులు మరియు రాబోయే సీజన్ సేద్యం చేపట్టేందుకు విత్తులకు డిమాండ్ నెలకొన్నందున ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుండే ధరలు ఇనుమడించాయి. కుసుమ లాంటి నూనెల ధరలు కూడా అధికంగానే ఉన్నాయి. ప్రభుత్వం నిల్వ పరిమితి విధించినందున ప్రతి వర్తకుడు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నందున నూనె మిల్లులకు ఎడతెరిపి లేకుండా క్రషింగ్ చేపడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో వేరుసెనగ పంటకు నష్టం - ఉత్తప్రదేశ్, రాజస్థాన్ లలో మొదలైన కొత్త వేరుసెనగ రాబడులు - గత వారం ధరలు

Image
  12-10-2021 ఆంధ్రప్రదేశ్ లో వేరుసెనగ పంటకు నష్టం ఈ ఏడాది రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు మరియు కడప జిల్లాలలో గతి తప్పిన వర్షాల వలన వేరుసెనగ సేద్యం గత ఏడాదితో పోలిస్తే 7,29,377 హెక్టార్ల నుండి 1,01,437 హెక్టార్లు తగ్గి 6,27,940 పరిమితమైంది.