తగ్గిన రబీ వేరుశనగ విస్తీర్ణం
దేశంలో మార్చి 11 వరకు వేరుసెనగ విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 2.65 ల.హె. నుండి తగ్గి 2.49 ల.హె.లకు చేరింది. తెలంగాణలోని గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, అచ్చంపేట, సూర్య పేట, తిరుమల్దేరి, వరంగల్ మరియు పరిసర ప్రాంతాలలో కలిసి సుమారు 50 వేల బస్తాల కొత్త వేరుసెనగ రాబడిపై రూ. 6000–7200 మరియు మహబూబ్ నగర్ హెచ్ఎస్ గింజలు 80-90 కౌంట్ చెన్నై డెలివరి రూ.10,000, 70-80 కౌంట్ రూ. 10,300, 60-65 కౌంట్ రూ. 10,600, 60-70 కౌంట్ రూ.10,500-10,600, 50-60 కౌంట్ రూ. 10,800 ధరతో వ్యాపారమెంది.