దిగజారుతున్న ఆముదాల ధరలు
2021-22 లో ఆముదాల సేద్యం 2020-21 తో పోలిస్తే 8.26 ల.హె. నుండి తగ్గి 8.11 ల.హె.కు పరిమితమైందని ప్రభుత్వం పేర్కొన్న గణాంకాల ద్వారా తెలుస్తోంది. పంట దిగుబడులు వృద్ధి చెందే అంచనాతో ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 17.89 ల.ట. నుండి స్వల్పంగా పెరిగి 17.95 ల.ట.కు చేరగలదని భావిస్తున్నారు.ఎన్సీడిఇఎక్స్ వద్ద గత సోమవారం మార్చి వాయిదా రూ. 7138 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం వరకు రూ. 252 క్షీణించి రూ. 6886, ఏప్రిల్ వాయిదా రూ. 200 నష్టంతో రూ.6920 వద్ద ముగిసింది.