Posts

Showing posts with the label Oil

బలహీనపడిన ఆముదాల వాయిదా ధరలు

Image
   గత సోమవారం ఎన్సిడిఇఎక్స్ వద్ద ఆగస్టు వాయిదా రూ. 7270 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 62 క్షీణించి రూ. 7208, సెప్టెంబర్ వాయిదా రూ.80 క్షీణించి రూ. 7254 వద్ద ముగిసింది.

తగ్గిన వేరుసెనగ సేద్యం - పెరిగిన ధరలు

Image
   ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఆగస్టు 3 నాటికి దేశంలో వేరుసెనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 44.39 ల.హె. నుండి తగ్గి 44.09 ల.హె. పరిమితం కాగా ఇందులో గుజరాత్ ఖరీఫ్ సేద్యం ఆగస్టు 1 నాటికి వేరుసెనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 18,93,734 హెక్టార్ల నుండి తగ్గి 16,72,401 హెక్టార్లకు చేరగా జునాగఢ్ జూన్లో విత్తిన పంట సెప్టెంబర్ -మూడో వారం నాటికి రాబడి కాగలదు. రాజస్తాన్లో 7,39,650 హెక్టార్ల నుండి పెరిగి 7,83,670 హెక్టార్లకు విస్తరించింది.

తగ్గుచున్న ఖరీఫ్ సీజన్ వేరుసెనగ సీద్యం - మార్కెట్ ధరలు

Image
   దేశంలో ప్రస్తుత ఖరీఫ్ సేద్యం చేరుసెనగ సేద్యం తగ్గుచున్నట్లు వంకేతాలు అందుతున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గుజరాత్లో జూలై 25 నాటికి వేరసెనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 18,68,169 హెక్టార్ల నుండి తగ్గి 10,20,700 హెక్టార్లు, రాజస్తాన్లో 7.26 ల.హె. నుండి పెరిగి 7.71 ల.హె., మధ్యప్రదేశ్లో 3.26 ల.హె. నుండి 3.60 ల.హె.కు విస్తరించగా, మహారాష్ట్రలో 1.83 ల.హె. నుండి తగ్గి 1.44 ల.హె., ఆంధ్రప్రదేశ్లో 3.27 ల.హె. నుండి 3 ల.హె., కర్ణాటకలో 3.66 ల.హె. నుండి 2.14 ల.హె., తెలంగాణలో 15,016 ఎకరాల నుండి 4372 ఎకరాలకు పరిమితమైంది. 

పామాయిల్ సరఫరా పెరగడంతో తగ్గనున్న డిమాండ్

Image
 ఏడాది ఏప్రిల్ 29న ఇండోనేషియా తమ పామాయిల్ ఎగుమతులపై ఆంక్షలు విధించినందున ధర ప్రతి టన్ను 7069 రింగిట్ (1806.71 డాలర్) కు ఎగబాకిందని వ్యాపారులు పేర్కొన్నారు. తద్వారా ఆయిల్ పామ్ పూల గుత్తుల (ఎఫ్ఎఫ్ఎ) కోసం కొనుగోలుదారులు కనుమరుగైనందున పామాయిల్ నిల్వలు పెరిగి 70 ల.ట.కు చేరాయి. పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వం ఎగుమతులపై ఉన్న ఆంక్షలను మే 24న ఎత్తివేసింది. 

పెరిగిన నువ్వుల ధరలు

Image
  లభించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం వర్షాలు తక్కువగా ఉన్నందున మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్లో విస్తీర్ణం తగ్గే అవ కాశం ఉన్నందున ధరలు రూ. 500-600 ప్రతిక్వింటాలుకు పెరిగాయి. అయితే, ఇంతవరకు యాసంగి పంట రాబడులతో పాటు స్టాకిస్టుల అమ్మకాల వలన ధరలు ఎక్కువగా పెరిగే అవకాశంలేదు.

వేరుశనగ - ఎక్కువుగా తగ్గే అవకాశం లేదు

Image
  కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ - నివేదికలో ప్రస్తుత సీజన్లో జూన్ 24 వరకు దేశంలో వేరుసెనగ విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 8.72 ల.హె. నుండి తగ్గి 7.62 ల.హ.లకు చేరింది. ఈ ఏడాది ఆంధ్రలో విస్తీర్ణం తగ్గడం, ఉత్తరప్రదేశ్లో సరుకు నాణ్యత లోపించ డంతో కర్మాటక, తెలంగాణల వ్యాపారులు పశ్చిమబెంగాల్ నుండి సరుకు కొను గోలు చేస్తున్నారు. దీనితో ధరలు బలోపేతం చెందాయి. కాగా ఎక్కువగా మంద కొడికి అవకాశం లేదు. ఎందుకనగా దేశంలో వంటనూనెల డిమాండ్ పెరుగుతోంది. 

ఆముదాలలో హెచ్చుతగ్గులు

Image
  గతవారం ఆముదాల ఉత్పాదక కేంద్రాలలో గిరాకీ తక్కువగా ఉండడంతో మార్కెట్తో పాటు వాయిదా ధరలు మందకొడిగా 'పాటు ఉన్నాయి. గత సోమవారం నాడు ఎన్సిడిఇఎక్స్ వద్ద ఆముదాల జూలె వాయిదా 7350 తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ.160 తగ్గి రూ. 7190, ఆగస్టు వాయిదా రూ. 144 తగ్గి రూ. 7258 వద్ద ముగిసింది. 

తగ్గిన యాసంగి వేరుశనగ విస్తీర్ణం

Image
  విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ప్రస్తుత సంవత్సరంయాసంగి సీజన్ కోసం దేశంలో నూనెగింజల విస్తీర్ణం గత ఏడాది 9.85 లక్షల హెక్టార్లతో పోలిస్తే వృద్ధిచెంది 10.18 లక్షల హెక్టార్లకు చేరింది. అయితే వేరుసె నగ విస్తీర్ణం గత ఏడాది 5.43 ల.హె. నుండి తగ్గి 5.2 ల.హె.లకు చేరింది. త్వరలో మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ మరియు గుజరాత్లలో కొత్త పంట రాబ డులు ప్రారంభం కానున్నాయి. కాగా పంట పరిస్థితి సంతృప్తికరంగా ఉంది. ప్రస్తుతం తీవ్రమైన ఎండల వలన పంట కోతల సమయంలో దిగుబడిపై అంచనా వేయడం జరుగుతుంది. ఎందుకనగా పశ్చిమబెంగాల్లోని దక్షిణ ప్రాంతాలలో త్వరగా సేద్యం అయినందున మే మొదటి వారంలో మరియు ఉత్తర ప్రాంతా లలో పంట కోతలకు జాప్యం జరిగినందున మే చివరి వారం నాటికి కోతలు ప్రారంభం కాగలవు. 

కొబ్బరి ధరలు పెరిగే అవకాశం లేదు?

Image
   వ్యాపారస్తుల కథనం ప్రకారం ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాలలో కొబ్బరి పంట ఉత్పత్తి భారీగా పెరగడంతో పాటు మార్చి వరకు పాత నిరవధికంగా సరఫరా కావడంతో మరియు తమిళనాడు, కేరళలలో రాబ డులు పెరగడంతో పాటు ఏడాది పొడగునా సరఫరా ఉండడంతో పెద్ద కంపెనీల కొనుగోళ్లు తగ్గడంతో కొబ్బరి ధరలు పెరగడం లేదు.

కొత్త నువ్వులకు కొనసాగుతున్న మందగమనం

Image
  దేశంలో ప్రస్తుత యాసంగి సీజన్ కోసం నువ్వుల విస్తీర్ణం 3.85 ల.హె.లతో పోలిస్తే పెరిగి 4.14 లక్షల హెక్టార్లకు చేరింది. మరియు తెలంగా ణలోని నిజామాబాద్ మరియు ఆంధ్రలోని విజయనగరం, నర్సన్నాపేట ప్రాంతా లలో కొత్త సరుకు రాబడి ప్రారంభమై దినసరి 300-400 బస్తాలు రాబడి కాగా, ఎర్ర నువ్వులు రూ. 8600-9000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తాడేపల్లిగూడెం, పెద్దాపురం, సామర్లకోట ప్రాంతాల నూనె మిల్లుల కోసం ప్రతి 75 కిలోల బస్తా రూ. 6800 ధరతో డెలివరి వ్యాపారం అయింది. 

తగ్గిన ఆముదాల వాయిదా ధరలు

Image
  ఈ ఏడాది దేశంలోని ప్రముఖ ఆముదాల ఉత్పాదక రాష్ట్రా లలో విస్తీర్ణం తగ్గడంతో గుజరాత్లోని పాటన్, సిద్దాపూర్, కడి, పలంతూర్, సాబరా కాంటా, ఊంఝా, బీజాపూర్, విశానగర్, మహసానా మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలోని ఆముదాల ఉత్పాదక కేంద్రాలలో కలిసి ప్రతిరోజు సుమారు 45-50 వేల బస్తాల సరుకు రాబడి కాగా, నాణ్యమైన సరుకు రూ. 6725-7000, మీడియం రూ.6400-6500, యావరేజ్ రకం రూ. 5800-6000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

పెరిగిన వంటనూనెల దిగుమతులు - తగ్గిన పామాయిల్ ధరలు

Image
  సాల్వెంట్ ఎక్స్ ట్రాక్టర్ల సమాఖ్య వారి వివరాల ప్రకారం ప్రస్తుత వంటనూనె సంవత్సరం మొదటి ఐదు నెలలు అనగా నవంబర్, 2021 నుండి మార్చి, 2022 లో వంటనూనెల దిగుమతులు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 52.40 లక్షల టన్నుల నుండి 4 లక్షల టన్నులు పెరిగి 56.42 లక్షల టన్నులకు చేరాయి. ఇందులో మార్చి, 2022లో దిగుమతులు ఫిబ్రవరితో పోలిస్తే 9.83 లక్షల టన్నుల నుండి 68,000 టన్నులు పెరిగి 10,51,000 టన్నులకు చేరాయి.

వేరుశనగ రాబడులతో ధరలలో మందకొడి

Image
  తెలంగాణలోని గద్వాల, మహబూబ్ నగర్, జడ్చర్ల, నాగర్ కర్నూలు, తిరుమలగిరి, అచ్చంపేట, సూర్యపేట, వరంగల్, కేసముద్రం ప్రాంతాలలో ప్రతి రోజు 20 వేల బస్తాల సరుకు రాబపడిపై రూ.4500-6410, గద్వాల లో హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ చెన్నై డెలివరి రూ. 9460,మహబూబ్ నగర్ హెచ్పిఎస్ గింజలు 80-90 కౌంట్ రూ. 9400, 70-80 కౌంట్ రూ.9500, 60-70 కౌంట్ రూ. 9700, చెన్నై డెలివరి 50-60 కౌంట్ రూ. 9900, ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

వచ్చే నెల నుండి కొత్త యసంగి వేరుశనగ

Image
  దేశంలో వచ్చే నెల నుండి యాసంగి కొత్త వేరుశనగ రాబడి ప్రారంభమయ్యే అవకాశం కలదు. ప్రభుత్వం నిల్వ పరిమితి విధించడంతో మిల్లర్ల కొనుగోళ్లు తగ్గడంతో పాటు సరఫరా పెరుగుతున్నది. దీనితో ధరలు మందకొడిగా మారుతున్నాయి. లబించిన సమాచారం ప్రకారం తెలంగాణలో ని ఉత్పాదక కేంద్రాలలో సరుకు రాబడులు తగ్గి గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, సూర్యపేట, తిరుమలగిరి, వరంగల్, కేసముద్రం మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి దినసరి కేవలం 20 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ.5500-6900, మబబూబ్నగర్ హెచ్పిఎస్ గింజలు 80-90 కౌంట్చెన్నై డెలివరి రూ. 9321, 70-80 కౌంట్ రూ. 9420, 60-70 కౌంట్ రూ. 9800, 50-60 కౌంట్ రూ. 10,000, హెదరాబాద్ డెలివరి 10,200 ధరతో వ్యాపారమైంది.

సన్ ఫ్లవర్

Image
  హెదరాబాద్ - కర్ణాటకలోని చిత్రదుర్గ్, బళ్లారి ప్రాంతాలలో దినసరి 1000 వేల బస్తాల సన్ఫ్లవర్ రాబడి కాగా, రూ.500-7500 మరియు గుజరాత్లోని రాజ్కోట్లో వారంలో 2 -3 వేల బస్తాల రాబడి కాగా, మీడియం రూ. 4000-6000, నాణ్యమైన సరుకు రూ.6500-7500 మరియు వెల్లకోవిల్లో సంతరోజు 1300 బస్తాల రాబడి కాగా, రూ.5275-7655 ధరతో వ్యాపారమైంది.

పెరిగిన ఆముదాల వాయిదా ధరలు

Image
  ఎన్సీడిఇఎక్స్ వద్ద గత సోమవారం ఏప్రిల్ వాయిదా రూ. 7268 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి రూ. 144 పెరిగి రూ. 7412, మే వాయిదా రూ. 130 పెరిగి రూ. 7490 వద్ద ముగిసింది. గుజరాత్లోని పాటన్, సిద్దపూర్, కడి, వలంతూర్, సాబర్ కాంట, ఊంఝా, బీజాపూర్, విశానగర్, మెహసానా తదితర ప్రాంతాలలో దినసరి 50 వేల బస్తాలకు పైగా ఆముదాలు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 7000-7240, మీడియం రూ. 6500-6800, యావరేజ్ రూ. 6000-6200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

నువ్వులలో కొనసాగుతున్న మందకొడి

Image
  కేంద్ర ప్రభుత్వం నూనెగింజలపై పరిమితి విధించడం మరియు కడప, బద్వేలు, వెంపల్లి, దువ్వూరు ప్రాంతాలలో దినసరి 2000 బస్తాల కొత్త నువ్వుల రాబడి కాగా, నలుపు రకం సరుకు రూ. 10,400-10,500, విరుధాచలం డెలివరి (ప్రతి 75 కిలోల బస్తా ) రూ. 8000, తెల్ల నువ్వులు రూ. 11,000, విరుధ్నగర్ డెలివరి జిఎస్టి సహా రూ. 8600 మరియు చాగలమర్రి, ఆళ్ళగడ్డ ప్రాంతాలలో 2 లారీల సరుకు రాబడి కాగా, రూ. 10,000-11,000, నలుపు రకం రూ.10,000 -10,500 ప్రతి క్వింటాలు మరియు నర్సారావుపేట, సత్తెనపల్లి ప్రాంతాలలో వచ్చేవారం నుండి మరియు పార్వతిపురం, శ్రీకాకుళం ప్రాంతాలలో ఏప్రిల్ చివరి వారంలో కొత్త సరుకు రాబడి ప్రారంభమయ్యే అవకాశం కలదు.

కొబ్బరికి తగ్గిన గిరాకి

Image
  ఉగాది మరియు రామనవమి కోసం వ్యాపారుల కొనుగోళ్లు సమాప్తం కావడంతో ధరలు స్థిరంగా ఉన్నాయి. మరియు ధరలు పెరిగే అవకాశం కనిపించడం లేదు. ఎందుకనగా రాబడులతో పోలిస్తే వినియోగం తక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని అంబాజిపేటలో గత వారం 500-600 బస్తాల కొబ్బరి రాబడిపై ఎక్సో పోర్ట్ రకం రూ. 9500-10,000, మీడియం రూ. 8200- 8500, యావరేజ్ రూ. 7600-8000 మరియు ప్రతి రోజు 20-30 వాహనాల కొబ్బరికాయలు రాబడి కాగా, పాత సరుకు రూ. 9000, మీడియం రూ. 7900-8000, యావరేజ్ రూ. 6000-6750, మరియు మిల్లింగ్ రకం రూ. 8500-9000, ఎండు సరుకు రూ. 11,500–12,000 ధరతో వ్యాపారమైంది.

అముదాలకు కొరవడిన గిరాకీ

Image
  మార్చి చివరి వారం కారణంగా మిల్లర్ల కొనుగోళ్లు తగ్గడం మరియు రెత్తుల అమ్మకాలు పెరగడంతో ధరలు స్థిరంగా ఉన్నాయి. దీనితో వాయిదా మార్కెట్లో ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడింది. ఎన్సీడిఇఎక్స్ వద్ద గత సోమవారం ఏప్రిల్ వాయిదా రూ. 7250 తో ప్రారంభమైన తర్వాత రూ. 7236 వద్ద ముగిసింది. మే వాయిదా రూ. 7344తో ప్రారంభమె రూ. 7348 వద్ద ముగిసింది. గుజరాత్లోని పాటన్, సిద్దపూర్, కడి, పలంతూర్, సాబర్కాంట, ఊంఝా, బీజాపూర్, విశానగర్, మెహసానా తదితర ప్రాంతాలలో దినసరి 1 లక్ష బస్తాలకు పెగ్డా ఆముదాలు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 7000-7325, మీడియం రూ. 6500-6800, యావరేజ్ రూ. 6000-6100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

వేరుశనగ లో పెరుగుదలకు బ్రేక్

Image
  లబించిన సమాచారం ప్రకారం తెలంగాణలో వేరుశనగ రాబడులు తగ్గుముఖం పట్టాయి. గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్కర్నూల్, అచ్చంపేట, సూర్యపేట, తిరుమలగిరి, వరంగల్, కేసముద్రం మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి దినసరి 35-40 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ. 5500-6700, మబబూబ్నగర్లో హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ చెన్నై డెలివరి రూ. 9650, 70-80 కౌంట్ రూ. 9700-9800, 60-70 కౌంట్ రూ.9900, 50-60 కౌంట్ రూ. 10,300, హైదరాబాద్ డెలివరి 10,000 ధరతో వ్యాపారమైంది.