పామాయిల్ సరఫరా పెరగడంతో తగ్గనున్న డిమాండ్



 ఏడాది ఏప్రిల్ 29న ఇండోనేషియా తమ పామాయిల్ ఎగుమతులపై ఆంక్షలు విధించినందున ధర ప్రతి టన్ను 7069 రింగిట్ (1806.71 డాలర్) కు ఎగబాకిందని వ్యాపారులు పేర్కొన్నారు. తద్వారా ఆయిల్ పామ్ పూల గుత్తుల (ఎఫ్ఎఫ్ఎ) కోసం కొనుగోలుదారులు కనుమరుగైనందున పామాయిల్ నిల్వలు పెరిగి 70 ల.ట.కు చేరాయి. పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వం ఎగుమతులపై ఉన్న ఆంక్షలను మే 24న ఎత్తివేసింది. 


పేరుకుపోయిన నిల్వలను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఎగుమతి మార్కెట్కు తోడ్పాటు నందించేందుకు ప్రణాళికను రూపొందించింది. జూన్ 24 నాటికి 17 ల.ట. పామాయిల్ షిప్మెంట్లకు అనుమతి ఇవ్వడమే కాకుండా. కొందరు మలేషియా పామాయిల్ ఉత్పాదకులు తమ ఉత్పత్తిని స్తంభింపజేసినందున వారంలో మొదటి రెండు రోజులు ధరలు పురోగమించిన తర్వాత మలేషియా ప్రభుత్వ అధికారులు ఉత్పత్తిని పునఃప్రారంభించాలని ఆదేశించారు. ఎఫ్ఎఫ్ఎ కొనుగోలు చేసేందుకు ఒప్పించే ప్రయత్నంతో బుధవారం మలేషియా పామాయిల్ ధరలు ఒడిదొడుకులకు గురయ్యాయి. బుధవారం ముడి పామాయిల్ ధర తగ్గి 5000 రింగిట్ పతనమైంది.

 ఆగస్టు వాయిదా 4964 రింగిట్ (1128.23 డాలర్), జూలై వాయిదా 5079 రింగిట్, 3 అక్టోబర్ 1881 రింగిట్ (1109.37 డాలర్), నవంబర్ 1891 రింగిట్ (1111.64 డాలర్) ప్రతి టన్నుకు చేరింది. మే నెల చివరి నాటికి మూడు ప్రముఖ వంటనూనెల నిల్వలు 0.4 శాతం వృద్ధి చెంది 13.80 ల.ట.కు చేరినట్లు మలేషియా పామాయిల్ కౌన్సిల్ (ఎంపిఒసి) తెలిపింది. గత వారం చికాగో బోర్డ్ ఆఫ్ ట్రేడ్ (సిబిఒటి) వద్ద సోయానూనె ధర ఇనుమడించినందున వారం ప్రారంభంలో పామాయిల్ మార్కెట్ కు మద్దతు లభించిందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ధర తగ్గి ఆరు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ప్రస్తుతం చైనా తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నందున మరియు పేరుకుపోయిన నిల్వలు, ఉత్పత్తి సీజన్ కావడమే ఇందుకు నిదర్శనం.


ఈ ఏడాది మే నెలలో పామాయిల్ నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 18 శాతం తగ్గగా ఏప్రిల్తో పోలిస్తే 17 శాతం ఇనుమడించాయని ఎంపిఒసి వర్గాలు వెల్లడించాయి. సన్ఫ్లవర్, సోయానూనె లాంటి తేలికపాటి నూనెల భాగస్వామ్యం పెరిగి 47 శాతానికి చేరింది. ఎందుకనగా, ఇండోనేషియా తమ ఎగుమతులపై విధించిన ఆంక్షల వలన భారతదేశంలో వంటనూనెల ధరలు వృద్ధి చెందినందున తేలికపాటి నూనెల దిగుమతులు ఊపందుకున్నాయి. పాకిస్తాన్ కొనుగోళ్లు కూడా తగ్గాయి. ధర 4000 రింగిట్ (909.13 డాలర్) కు దిగువకు పడిపోయినట్లయితే కొనుగోళ్లు పెరగవచ్చని ఎంపిఒసి తమ అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం భారతదేశం మరియు పాకిస్తాన్ వ్యాపారులు నైరుతి రుతుపవనాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. భారత్లో సెప్టెంబర్ నుండి పండుగల సీజన్కు ముందు నుండే వంటనూనెల ధరలు పురోగమించే అవకాశం ఉంటుంది. అయితే, ఈసారి వచ్చే ఏడాది జూన్ వరకు 20 ల.ట. చొప్పున సన్ఫ్లవర్ననె మరియు సోయానూనె దిగుమతులపై శూన్య శాతం సుంకం విధించింది, అంతేకాకుండా, ఇరు దేశాలకు ఆగస్టు మూడో వారం నుండి డిమాండ్నెలకొనే అవకాశం ఉంది.

Comments

Popular posts from this blog