కొత్త సీజన్లో పత్తి మందగమనం

ఈ ఏడాది దేశంలో పత్తి లభ్యత తగ్గినందున దాదాపు సగం నూలు మిల్లులు మూత పడినందున ఆందోళనకు గురవుతున్న కేంద్ర సర్కారుకు ఊరట లభించే అవకాశం కనిపిస్తున్నది. ఎందుకనగా, విస్తరించిన పత్తి సేద్యం, సానుకూల వాతావరణం వలన 2022-23 (అక్టోబర్-సెప్టెంబర్) సీజన్లో ఉత్పత్తి 15 శాతం వృద్ది చెందగలదనే సంకేతాలు అందుతుండడమే ఇందుకు నిదర్శనం. ఖరీఫ్ సీజన్ కోసం దేశంలో ఇప్పటి వరకు పత్తి సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 120.55 ల.హె. నుండి పెరిగి 1.28 ల.హె. విస్తరించింది.