వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి వివరాల ప్రకారం 5, ఆగష్టు వరకు దేశంలో ఖరీప్ పత్తి పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1 కోటి13 లక్షల 51 వేల హెక్టార్ల నుండి పెరిగి 1 కోటి 21 లక్షల 13 వేల హెక్టార్లకు చేరింది.
సిరసా, ఫతేహ బాద్ మరియు హిస్సార్ జిల్లాలు సహా హర్యాణాలలోని పత్తి ఉత్పాదక ప్రాంతాలలో రెతులు వరుసగా మూడవ సంవత్సరం పంటకు నష్టం వాటిల్లడంతో ఆందోళన చెందుతున్నారు. ఎందుకనగా, భారీ వర్షాల వలన పొలాలలోకి నీరు చేరడంతో పాటు చీడపీడల వలన పంటకు నష్టం వాటిల్లే అవకాశం కలదు.
తెలంగాణాలో 3, ఆగస్టు వరకు పత్తి పంట విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 49 లక్షల 85 వేల 895 ఎకరాల నుండి తగ్గి 45 లక్షల 42 వేల 355 ఎకరాలకు చేరింది.
గుజరాత్లో 22,22,372 హెక్టార్ల నుండి పెరిగి 25,04,390 హెక్టార్లకు, రాజస్తాన్లో 5,98,900 హెక్టార్ల నుండి పెరిగి 6, 45,470 హెక్టార్లకు, చేరింది. పంజాబ్, హర్యాణా, రాజస్తాన్లలో కొత్త సరుకు రాబడి ప్రారంభమయింది. అయితే, సరకు కొరత వలన మార్కెట్లలో రూ.8700-9200 ధరతో వ్యాపారమవుతున్నది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు