పెసల ఉత్పత్తి పెరిగే సూచన

దేశవ్యాప్తంగా ప్రస్తుత యాసంగి సీజన్ కోసం పంజాబ్ సహా,ఇతర ఉత్పాదక రాష్ట్రాలలో పంట ఉత్పత్తి పెరిగింది. రెతులకు మద్దతు ధరకు ధీటుగా ధర లభించడంతో ప్రస్తుత ఖరీఫ్ లో విస్తీర్ణం పెరుగుతుంది. రాజస్థాన్లో సరుకు నిల్వ చేసిన రెత్తులు తమ సరుకు విక్రయిస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్లో రాజస్థాన్లో పెసర పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 3.81 ల.హె. నుండి పెరిగి 6.23 ల.హె.కు విస్తరించింది. అయితే కర్ణాటకలో 2.75 ల.హె. నుండి పెరిగి 3.03 ల.హె. లకు చేరడంతో దేశంలో మొత్తం విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 8.17 ల.హె. నుండి పెరిగి 10.76 ల.హె.లకు చేరింది.