Posts

Showing posts with the label Palmoil

పామాయిల్ సరఫరా పెరగడంతో తగ్గనున్న డిమాండ్

Image
 ఏడాది ఏప్రిల్ 29న ఇండోనేషియా తమ పామాయిల్ ఎగుమతులపై ఆంక్షలు విధించినందున ధర ప్రతి టన్ను 7069 రింగిట్ (1806.71 డాలర్) కు ఎగబాకిందని వ్యాపారులు పేర్కొన్నారు. తద్వారా ఆయిల్ పామ్ పూల గుత్తుల (ఎఫ్ఎఫ్ఎ) కోసం కొనుగోలుదారులు కనుమరుగైనందున పామాయిల్ నిల్వలు పెరిగి 70 ల.ట.కు చేరాయి. పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వం ఎగుమతులపై ఉన్న ఆంక్షలను మే 24న ఎత్తివేసింది. 

పెరిగిన వంటనూనెల దిగుమతులు - తగ్గిన పామాయిల్ ధరలు

Image
  సాల్వెంట్ ఎక్స్ ట్రాక్టర్ల సమాఖ్య వారి వివరాల ప్రకారం ప్రస్తుత వంటనూనె సంవత్సరం మొదటి ఐదు నెలలు అనగా నవంబర్, 2021 నుండి మార్చి, 2022 లో వంటనూనెల దిగుమతులు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 52.40 లక్షల టన్నుల నుండి 4 లక్షల టన్నులు పెరిగి 56.42 లక్షల టన్నులకు చేరాయి. ఇందులో మార్చి, 2022లో దిగుమతులు ఫిబ్రవరితో పోలిస్తే 9.83 లక్షల టన్నుల నుండి 68,000 టన్నులు పెరిగి 10,51,000 టన్నులకు చేరాయి.

ఇండోనేషియా నుండి పామాయిల్ దిగుమతులు

Image
  ప్రపంచంలో అత్యధిక పామాయిల్ వినియోగిస్తున్న భారత్ ఇండోనేషియా నుండే 50 శాతానికి పైగా సరుకు దిగుమతి చేసుకుంటున్నది. అయితే, తాజాగా రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల నుండి దిగమతి అయ్యే సన్ ఫ్లవర్ నూనె సర ఫరా కుంటుబడినందున దీనిని భర్తీ చేసేందుకు భారత్కు మరింత అదనపు సరుకు ఎగుమతి చేయాలని ఇండోనేషియా కోరుతున్నది. ఎందుకనగా, ఇండోనేషియా తమ దేశంలో స్థానికంగా ధరలు అదుపు చేసేందుకు జనవరి 27 నుండి ఎగుమతులపై ఆంక్షలు విధించింది. అప్పటి నుండి ముడిపామాయిల్ దిగుమతి వ్యయం 38 శాతం వృద్ధిచెందింది. దీని వలన ఇతర వంటనూనెల ధరలు కూడా ప్రభావితమయ్యాయి.

కనివినీ ఎరుగని రీతిలో దూసుకెళ్తున్న ముడి పామాయిల్ ధరలు

Image
   ప్రపంచంలో ఇండోనేషియా తర్వాత రెండో అతిపెద్ద పామాయిల్ ఉత్పాదక దేశoగా మలేషియా ప్రసిద్ధి గాంచింది. ప్రపంచ పామాయిల్ సరఫరాలో ఇరు దేశాల భాగస్వామ్యం కలిసి 85 శాతం ఉంది. దక్షిణ అమెరికా దేశాలలో ప్రతికూల వాతావరణంతో సోయా పంటకు వాటిల్లిన నష్టం మరియు ఉక్రెయిన్పై రష్యా దాడితో ముడిపామాయిల్ ధరలు నింగికి దూసుకెళ్తున్నాయి. ఈ ప్రభావం ప్రపంచ పామాయిల్ మరియు సోయానూనెపై దుష్ప్రభావం పొడసూపుతున్నది.

తగ్గిన ముడిపామాయిల్, పెరిగిన ఆర్బిడి పామోలిన్ దిగుమతులు

Image
  20-02-2022 గత ఏడాది డిసెంబర్ 20 నుండి రిఫైండ్ పామోలిన్ పై ప్రభుత్వం 19.25 శాతం నుండి 13.75 శాతానికి తగ్గించిన దిగుమతి సుంకం ఇదే విధంగా సిపీఒ దిగుమతులపై తగ్గించలేదు. ఈ రెండింటి మధ్య దిగుమతి సుంకంలో అంతరం 11 శాతం నుండి తగ్గి 5.5 శాతం మాత్రమే ఉన్నందున రిఫైండ్ పామోలిన్ దిగుమతులు వృద్ధి చెందేందుకు దోహదపడిందని సాల్వెంట్ ఎక్స్ ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఇఎ) పేర్కొన్నది. ప్రస్తుతం రిఫైండ్ పామోలిస్ దిగుమతి వ్యయం ముడిపామాయిలకు ధీటుగా మారింది. అయితే, దీని వలన దేశీయ రిఫైనరీ పరిశ్రమపై దుష్ప్రభావం పొడసూపుతున్నదని కూడా ఎస్ఇ పేర్కొన్నది.