తగ్గిన ముడిపామాయిల్, పెరిగిన ఆర్బిడి పామోలిన్ దిగుమతులు

 


20-02-2022

గత ఏడాది డిసెంబర్ 20 నుండి రిఫైండ్ పామోలిన్ పై ప్రభుత్వం 19.25 శాతం నుండి 13.75 శాతానికి తగ్గించిన దిగుమతి సుంకం ఇదే విధంగా సిపీఒ దిగుమతులపై తగ్గించలేదు. ఈ రెండింటి మధ్య దిగుమతి సుంకంలో అంతరం 11 శాతం నుండి తగ్గి 5.5 శాతం మాత్రమే ఉన్నందున రిఫైండ్ పామోలిన్ దిగుమతులు వృద్ధి చెందేందుకు దోహదపడిందని సాల్వెంట్ ఎక్స్ ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఇఎ) పేర్కొన్నది. ప్రస్తుతం రిఫైండ్ పామోలిస్ దిగుమతి వ్యయం ముడిపామాయిలకు ధీటుగా మారింది. అయితే, దీని వలన దేశీయ రిఫైనరీ పరిశ్రమపై దుష్ప్రభావం పొడసూపుతున్నదని కూడా ఎస్ఇ పేర్కొన్నది.





జనవరిలో ఆర్జేడి పామోలిన్ దిగుమతులు డిసెంబర్తో పోలిస్తే 4593 తం ఇనుమడించగా, ముడిపామాయిల్ (సిపిఒ) 23 శాతం మేర క్షీణించాయి. ఈ ఏడాది జనవరిలో ఆర్డి పామోలిన్ దిగుమతులు గత ఏడాది డిసెంబర్లో పోలిస్తే 24 వేల టన్నుల నుండి పెరిగి 1.34 ల.హె.కు చేరాయి. కాగా, 2021 జనవరిలో కేవలం 2701 టన్నుల సరుకు దిగుమతి అయింది. 2022 లో సిపిఒ దిగుమతులు 2021 డిసెంబర్ తో పోలిస్తే 5.28 ల.ట. మరియు 2021 జనవరిలో 7.67 ల.ట. నుండి తగ్గి 4.7 ల.ట.కు పరిమితమయ్యాయి ఎస్ఇఎ పేర్కొన్నది.


ప్రస్తుత వంటనూనెల సంవత్సరం (2021 నవంబర్ - 2022 అక్టోబర్ లోని మొదటి త్రైమాసికం (నవంబర్-జనవరి) లో ఆర్డి పామోలిన్ దిగుమతులు ముందు సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే 15,601 టన్నుల నుండి పెరిగి 2.16 ల.ట.కు చేరాయి. ఇదే వ్యవధిలో ముడిపామాయిల్ దిగుమతులు 21.5 ల.ట. నుండి తగ్గి 14.12 ల.ట.కు పరిమితమయ్యాయి. ప్రస్తుతం జనవరి-మార్చి మధ్యకాలంలో ఆర్బీడి పామోలిన్ దిగుమతులు 8-9 ల.ట. కు చేరగలవని భావిస్తున్నారు.ఆర్డి పామోలిన్ పై పెరుగుతున్న దిగుమతి సుంకం వలన దేశీయ రిఫైనరీ టన్నులు ఉన్నాయి. ప్రస్తుత వంటనూనెల సంవత్సరంలో వనస్పతి నూనెల దిగుమతులు ముందు పరిశ్రమ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పలు కంపెనీలు మూసివేసేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టనట్లయితే పరిస్థితి మరింత విషమించగలదని ఎస్ఇఎ తమ అభిప్రాయం వెల్లడించింది..


ప్రస్తుతం వంటనూనెల సంవత్సరంలోని మొదటి త్రైమాసికం (2021 నవంబర్ - 2022 జనవరి) లో మొత్తం వంటనూనెల దిగుమతులలో పామాయిల్ (సిపిఎ మరియు ఆర్బీడితో పాటు) భాగస్వామ్యం ముందు సంవత్సరం 62 శాతానికి గాను ఈసారి తగ్గి 46 శాతానికి పరిమితమైంది. కాగా ఇదే వ్యవధిలో సోయా, సన్ ఫ్లవర్ లాంటి తేలికపాటి నూనెల భాగస్వామ్యం 38 శాతం నుండి వృద్ధి చెంది 54 శాతానికి ఎగబాకాయి. ప్రస్తుతం వంటనూనెల సంవత్సరంలోని మొదటి త్రైమాసికంలో సోయానూనె దిగుమతులు ముందు సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే 6.62 ల.ట. నుండి 90 శాతం వృద్ధి చెంది 12.57 ల.ట.కు చేరాయి. ఇదే వ్యవధిలో మలేషియా నుండి 9.40 ల.ట. సిపిఒ మరియు 86, 355 టన్నుల ఆర్బిడి పామోలిన్ మరియు ఇండోనేషియా నుండి 4 ల.ట. సిపిఒతో పాటు 1.30 ల.ట. ఆర్టిడి పామోలిన్ మరియు అర్జెంటీనా నుండి 8.45 ల.ట., బ్రెజిల్ నుండి 2.91 ల.ట. ముడి సోయా డిగమ్ నూనె మరియు ఉక్రెయిన్ నుండి 6.02 ల.ట., రష్యా నుండి 88,323 టన్నుల ముడి సన్ఫ్లవర్ నూనె దిగుమతి అయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నాటికి వివిధ ఓడరేవుల వద్ద నిల్వలు సిపిఒ 2.30 6.ట., ఆర్బిడి పామోలిన్ 1.20 6.ట., డిగమ్ సోయానూనె 4.50 ల.ట., ముడి సోయానూనె 1.50 ల.ట. మరియు ఆవనూనె 4 ల.ట. కలిసి మొత్తం వంటనూనెల నిల్వలు 6.54 ల.ట. మరియు పైప్-లైన్లో 12.08 ల.ట. సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం నిల్వలు జనవరితో పోలిస్తే 17.20 6.ట.తో పోలిస్తే 1.42 ల.ట. అదనంగా ఉన్నాయి. జనవరిలో ఆర్జీడి పామోలిన్ సిఐఎఫ్ డిసెంబర్ ధర ప్రతి టన్ను 1375 డాలర్లకు గాను పెరిగి 1400, సిపిఒ 1420 డాలర్ల నుండి పెరిగి 1510 డాలర్లు, ముడి సోయానూనె 1480 డాలర్ల నుండి 1506 డాలర్లు, ముడి సన్ఫ్లవర్నూనె 1406 డాలర్ల నుండి పెరిగి 1475 డాలర్లు చేరింది. ఈ ఏడాది జనవరిలో దేశంలో ఆహార, ఆహారేతర నూనెలు కలిసి మొత్తం వనసృతి నూనెల దిగుమతులు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 10.96 ల.ట. నుండి పెరిగి 12.70 ల.ట.కు చేరగా ఇందులో ఇందులో ఆహార నూనెలు 12.51 ల.ట., ఆహారేతర నూనెలు 18,802 టన్నులు ఉన్నాయి. ప్రస్తుత వంటనూనెల సంవత్సరంలో వనస్పతి నూనెల దిగుమతులు ముందు సంవత్సరంతో పోలిస్తే 35.56 ల.ట. నుండి పెరిగి 36.71 ల.ట.కు చేరాయి. 



కోత విధించిన సర్కారు


న్యూదిల్లీ : ముడి పామాయిల్ (సిపిఒ) పై వ్యవసాయ మౌళిక సదుపాయాల అభివృద్ధి సెస్ (ఎఐడిసి) 7.5 శాతం నుండి 5 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్నది. దీని వలన ముడి పామాయిల్ మరియు రిఫైండ్ పామాయిల్ మధ్య అంతరం పెరిగినందున ముడిపామాయిల్ దిగుమతులకు ప్రోత్సాహం లభించగలదు. ముడిపామాయిల్ మరియు రిఫైండ్ పామాయిల్ మధ్య సుంకంలో అంతరం 8.5 శాతానికి పెరగగలదు. ముడిపామాయిల్ మరియు ఇతర ముడిపామాయిల్ అమలులో ఉన్న కొత్త సుంకం వ్యవధి తుది గడువును కూడా 2022 సెప్టెంబర్ 30 పొడిగించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ ప్రకటనలో పేర్కొన్నది. ఈ ముడినూనెలపై సమర్థవంతమైన సుంకం 5.5 శాతం ఉండగలదని కూడా తమ ప్రకటనలో పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 20న ఆర్డి పామోలిన్ మరియు ఆర్టిబిడి పామాయిల్ యొక్కదిగుమతి సుంకంలో 5.5 శాతం కోత విధించింది. తద్వారా ముడి పామాయిల్ మరియు రిఫైండ్ నూనెల మధ్య అంతరం భారీగా తగ్గింది.


దేశీయ పామాయిల్ రిఫైనింగ్ పరిశ్రమను రక్షించేందుకు ఆర్జీడి పామోలిన్ మరియు ఆర్బిడీ పామాయిల్ను మరోసారి నిషేధిత జాబితాలో చేర్చాలని కేంద్ర ఆహార శాక కార్యదర్శికి గత నెలలో ఎస్ఇఎ అధ్యక్షుడు అతుల్ చతుర్వేది రాసిన లేఖలో కోరారు. సరఫరా గొలుసుకు అంతరాయం ఏర్పడకుండా మరియు వ్యాపారంపై ఎలాంటి దుష్ప్రభావం పొడసూపకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. దీని వలన అక్రమనిల్వ వ్యాపారులు, చీకటి బజారు మొదలగు చట్ట వ్యతిరేక వ్యాపారాన్ని అదుపు చేయడమే కాకుండా ధరలను నియంత్రించడానికి దోపాదం కాగలదని కేంద్ర సర్కారు తమ అభిప్రాయం తెలిపింది. అటు తర్వాత వంటనూనెలు మరియు నూనెగింజల నిల్వపరిమితిని అమలు చేయడం తప్పనిసరి చేస్తూ ఫిబ్రవరి 3న ఆహార మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా నిల్వపరిమితి తుది గడువును మార్చి 31 నుండి జూన్ 30 వరకు పొడిగించింది.


వంటనూనెల ధరలు ఇనుపండిస్తూనే ఉన్నాయి. దేశంలోని వినియోగదారులకు ధరల పెరుగుదల నుండి మే నెల వరకు ఉపశమనం. కలిగించే అవకాశం లేదు. ఎందుకనగా, ఆగ్నేయాసియా దేశాలలో కూలీల ఏర్పడినందున కుంటుపడిన పామాయిల్ ఉత్పత్తి, వృద్ధి చెందిన ముడినూనెల - ధరలు మరియు దక్షిణ అమెరికా దేశాలలో నెలకొన్న అనావృష్టి పరిస్థితుల వలన - సోయాపంటపై దుష్ప్రభావం పొడసూపే అంచనాతో ఈ ఏడాది అంతర్జాతీయ విపణిలో పామాయిల్ ధర 20 శాతం వృద్ధి చెంది తారాస్థాయికి చేరింది. అయితే, సోయానూని 15 శాతం ఇనుమడించడం కొసమెరుపు.


Comments

Popular posts from this blog

తగ్గిన పెసర విస్తీర్ణం