Posts

Showing posts from November, 2021

పత్తిలో మందకొడికి అవకాశంలేదు- చురుకుగా మారిన నూనెపిండి స్టాకిస్టులు

Image
  వ్యాపారస్తుల కథనం ప్రకారం ప్రస్తుతం దేశంలో పత్తికి మంచి డిమాండ్ ఉంది. ఆకర్షణీయమైన ధరల కారణంగా రైతులు వేగంగా సరుకు విక్రయిస్తున్నారు. అయితే, పత్తి గింజలు మరియు నూనె పిండి కోసం స్టాకిస్టుల కొనుగోళ్లతో మందకొడి పరిస్థితి సమాప్తమయ్యే అవకాశం కలదు. 

సమృద్ధిగా పసుపు నిల్వలు - ధరల పెరుగుదలకు అవకాశం లేనట్లే - గత వారం మార్కెట్ ధరలు

Image
 రెండు వారాల క్రితం అంధ్ర - తెలంగాణాలలో భారీ వర్షాలు కురిసినప్పటికీ, పసపు పంటకు ఎక్కువగా నష్టం వాటిల్లలేదు. అయితే, కొందరుల స్పెక్యులేటర్లు పంటకు నష్టం జరిగిందని ప్రచారం చేసి ఏప్రిల్ వాయిదా ధరను రూ. 8800 వరకు పెంచడంలో సఫలీకృతులయ్యారు. కాని, అమ్మ కందారులు పెరగడంతో ధరలు తిరిగి తగ్గి రూ. 8450 కు చేరాయి. ఏప్రిల్ వాయిదా తిరిగి తగ్గి రూ. 7500 వరకు కూడా చేరవచ్చు. ఎందుకనగా, డిసెంబర్ చివరనుండి నిజామాబాద్లో కొత్త సరుకు రాబడి ప్రారంభం కాగలదు. మహారాష్ట్ర సహా దేశంలోని అన్ని ఉత్పాదక ప్రాంతాలలో మరియు పెద్ద నగరాలలో సమృద్ధిగా నిల్వలు ఉన్నాయి మరియు చిన్న స్టాకిస్టులు అమ్మకం కోసం ముందుకు రావడంలేదు. ఎందుకనగా, ఈ ఏడాది మహారాష్ట్రలో విస్తీర్ణం సంతోషజకంగా ఉండడంతో పాటు అనకూల వర్షాలు ఉన్నాయి. తమిళనాడులో కూడా పంట పరిస్థితి మెరుగ్గా ఉంది. ఎందుకనగా, జలాశయాలలో సాగునీటి కొరతలేదు.

గత వారం పెరిగిన మిర్చి ధరలు -దక్షిణ భారత్ లో ప్రతికూల వాతావరణ పరిస్తితిలే కారణం

Image
  వ్యాపారస్తుల కథనం ప్రకారం గత రెండు వారాలుగా దక్షిణ భారతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండడం మరియు భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ పంటకు చీడపీడల బెడద ఉండడంతో పాటు కర్నూలు ప్రాంతంలో వర్షాల వలన నాట్లు వేసిన పంటకు నష్టం చేకూరింది. రాబోవు రోజులలో పంట దిగుబడి తగ్గే అవకాశం ఉండడంతో ఆంధ్రలో నిల్వచేసిన రైతులు నెమ్మదిగా సరుకు విక్రయిస్తున్నారు. దీనితో గుంటూరు మార్కెట్ యార్డులో కోల్డుస్టోరేజీలనుండి మొత్తం సరుకు రాబడులు ముందువారంతో పోలిస్తే కేవలం 70 శాతం ఉండడంతో పాటు మర ఆడించే యూనిట్లు మరియు ఎగుమతిదారులు కొనుగోళ్లతో ధరలు అకస్మాత్తుగా పెరిగాయి. ఎందుకనగా, ప్రతి సంవత్సరం ఇదే వ్యవధిలో తెలంగాణా, కర్నాటక మరియు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో రాబడులు పెరగడం జరుగుతుంది. అయితే, ఈ ఏడాది ఇంతవరకు రాబడులు పెరగడంలేదు. ఇందుకు ముఖ్యకారణమేమనగా ఎండలు కాయనందున సరుకు ఎండడంలో సమస్యలు ఎదురౌతున్నాయి. దీనివలన మధ్యప్రదేశ్ రైతులకు లాభం చేకూరుతున్నది. ఎందుకనగా, గతవారం బేడియాలో ఆది, బుధ, గురువారాలలో కలిసి 90000-100000 బస్తాల కొత్త సరుకు రాబడి అయినప్పటికీ, ధరలు హెచ్చుముఖంలో ఉన్నాయి. 

అకాల వర్షాలకు మిర్చి పంటకు నష్టం

Image
 ప్రముఖ మిరప ఉత్పాదక రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, గుంటూరు జిల్లాలలో పంట మరియు పూతపై నల్లి తెగులు సోకడంతో రైతులు పంట పెరికివేస్తున్నారు. కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాల వలన ఆలస్యంగా విత్తిన పంటకు నష్టం వాటిల్లింది. మధ్య ప్రదేశ్, మహారాష్ట్రలలో వర్షాల వలన పంట కోతలకు అవరోధం ఏర్పడింది. కొందరు వ్యాపారులు ఎగుమతి వ్యాపారుల కోసం ఎడ్వాన్స్ వ్యాపారం చేసారు. ఇందుకోసం కొనుగోలు డిమాండ్ రావడంతో దేశవ్యాప్తంగా ఉత్పాదక రాష్ట్రాలలో మిరప ధరలు రూ. 1000-1500 ప్రతి క్వింటాలుకు పెరిగాయి. కర్నూలు, ఎమ్మిగనూరు ప్రాంతాలలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పంటకు భారీ నష్టం వాటిల్లింది. దీనితో కొత్త నాణ్యమైన మిరప రాబడి కోసం 2 నెలల సమయం పట్టగలదు. ప్రకాశం జిల్లాలో దిగుబడి తగ్గే అవకాశం కలదు.

గణనీయంగా పెరగనున్న మిర్చి ఉత్పత్తి - ఖమ్మం , వరంగల్ లలో కొత్త మిర్చి రాబడి

Image
  ఖమ్మంలో గత మంగళవారం 10 బస్తాల కొత్త మిర్చి రాబడిపై ధర రూ. 7011, వరంగల్లో గురువారం 7  బస్తాలు తేజ రూ. 10,500 ధరతో ముహూర్త వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు పంటకు ప్రయోజనం చేకూరుతున్నది.