పత్తిలో మందకొడికి అవకాశంలేదు- చురుకుగా మారిన నూనెపిండి స్టాకిస్టులు

 


వ్యాపారస్తుల కథనం ప్రకారం ప్రస్తుతం దేశంలో పత్తికి మంచి డిమాండ్ ఉంది. ఆకర్షణీయమైన ధరల కారణంగా రైతులు వేగంగా సరుకు విక్రయిస్తున్నారు. అయితే, పత్తి గింజలు మరియు నూనె పిండి కోసం స్టాకిస్టుల కొనుగోళ్లతో మందకొడి పరిస్థితి సమాప్తమయ్యే అవకాశం కలదు. 


గత శుక్రవారం పంజాబ్లో 3 వేలు, హర్యాణాలో 9 వేలు మరియు రాజస్తాన్లో 10 వేల బేళ్లు కలిసి 22 వేలు, గుజరాత్లో 37 వేలు, మధ్యప్రదేశ్లో 38 వేలు, కర్నాటకలో 10 వేలు, ఆంధ్ర-తెలంగాణాలలో 21 వేలు మరియు ఇతర ఉత్పాదక రాష్ట్రాలలో కలిసి సుమారు 1.50 లక్షల బేళ్ల రాబడిపై,

 పంజాబ్లో రూ. 63825-64025,

 హర్యాణాలో 62900-63100, 

రాజస్తాన్లో రూ. 63525-63825 

ప్రతికండీ మరియు పత్తి గింజలు 

హర్యాణా, పంజాబ్లో రూ.3300-3650, 

రాజస్తాన్లో రూ.350-300 ధరతో వ్యాపారమయింది. 

గుజరాత్లో 37 వేలబేళ్ల రాబడిపై దక్షిణ భారత మిల్లర్ల కొనుగోళ్లతో 29 మి.మీ. ఆర్డి రూ. 66800-67200, 74 ఆర్డి రూ. 66000-66300, సంకర్ -6 రకం రూ. 65000-65500 ప్రతి కండీ ( ప్రతి కండీ 356 కిలోలు), పత్తి గింజలు రూ. 3250-3450 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమయింది. 

మధ్య ప్రదేశ్లో 14–15 వేల బేళ్ల రాబడిపై 9 శాతం నిమ్ము 30 మి.మీ. పత్తి రూ. 67700-68000 ప్రతి కండీ మరియు పత్తి గింజలు రూ. 2600 00, 

మహారాష్ట్రలో 39 వేల బేళ్ల రాబడిపై 30 మి.మీ. ఆర్.డి -75 రకంరూ. 67300-67500, అకోలా ప్రాంతంలో 29 మి.మీ. ఆర్.డి -75 రకం రూ. 66100-66500 మరియు పత్తి గింజలు రూ. 2700-3400 ధరతో వ్యాపారమయింది. 

ఆంధ్రలో 7 వేల బేళ్లు మరియు తెలంగాణాలో 14 వేల బేళ్లు కలిసి 21 వేల బేళ్ల రాబడిపై 

గుంటూరులో 30 మి.మీ. ఆర్.డి. 75,76 రకం రూ. 67000-67300, 

ఆదిలాబాద్లో 29.5 మి.మీ. ఆర్.డి. -75 రకం రూ.66000-67300, ఆదిలాబాద్లో 29.5 మి.మీ. ఆర్.డి - 75 రకం రూ. 66000-66500, పత్తి గింజలు రూ. 2850-3400 ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog