Posts

Showing posts from July, 2022

𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 05-07-2022 🌶️

Image
𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 05-07-2022 🌶️ *ARRIVAL 300 TO 500 BAGS* 

𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 05-07-2022 🌶️

Image
𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 05-07-2022 🌶️ *(NON A/C ARRIVALS APPROX 4000/5000 BAGS)*

𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 5-07-2022 🌶️

Image
𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 5-07-2022 🌶️ *(A/C ARRIVALS 8000 BAGS)*

𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 04-07-2022 🌶️

Image
𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 04-07-2022 🌶️ *ARRIVAL 300 TO 500 BAGS* 

𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 4-07-2022 🌶️

Image
𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 4-07-2022 🌶️ *(A/C ARRIVALS 12000 BAGS)*

𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 04-07-2022 🌶️

Image
𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 04-07-2022 🌶️ *(NON A/C ARRIVALS APPROX 5000/6000 BAGS)* TEJA:14000/19000,

𝐁𝐘𝐀𝐃𝐆𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 04-07-2022 🌶️

Image
𝐁𝐘𝐀𝐃𝐆𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 04-07-2022 🌶️ *A/C ARRIVALS 8000 BAGS SALES APPROX 5000 BAGS*

తగ్గిన బఠాణీల ధరలు

Image
  వ్యాపారస్తుల కథనం ప్రకారం ఈ ఏడాది బఠానీల ఉత్పత్తి పెరు గడం మరియు సీజన్ ప్రారంభం నుండి ధరలు తగ్గడంతో ఇంతవరకు రెతులు, స్టాకిస్టుల వద్ద సుమారు 35 శాతానికి మించి సరుకు నిల్వలు ఉన్నాయి. వినియోగ రాష్ట్రాలలో ఈ ఏడాది శనగలు, కాబూలి శనగల ధరలు అందుబాటులో ఉండడంతో బఠానీల వినియోగం తగ్గింది. తద్వారా గతవారం ఉత్పాదక కేంద్రాలలో డిమాండ్ కొరవడినందున ధర రూ.50-75 తగ్గింది. 

బలోపేతం చెందిన జీలకర్ర వాయిదా ధరలు

Image
 దేశంలో సరుకు కొనుగోలు కోసం కనుమరుగైన కిరాణా వ్యాపారులు నాణ్యమైన సరుకు విక్రయించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్న దిగ్గజు రైతులు మరియు కొరవడిన ఎగుమతి డిమాండ్లో గత వారం పరోక్ష మార్కెట్లో జీలకర్ర ధర ప్రతి క్వింటాలుకు రూ.400-500 పతనమైనప్పటికీ ప్రత్యక్ష మార్కెట్లో ధరలకు నిలకడ చేకూరింది. ఎన్సీడిఇ ఎక్స్ వద్ద గత సోమవారం జూలై వాయిదా రూ.2,100 ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి రూ. 500 వృద్ధి చెంది రూ. 21,600, ఆగస్టు రూ. 530 పెరిగి రూ. 21, 760 వద్ద ముగిసింది. 

రాబడులు తగ్గడంతో ధనియాలు పటిష్టం

Image
   గతవారం దేశంలోని ప్రముఖ ధనియాల ఉత్పాదక కేంద్రాలలో వర్షాలు కురవడంతో రెత్తులు ఖరీఫ్ పంటల సాగులో నిమగ్నం కావడంతో మార్కెట్లలో ధనియాల రాబడులు క్షీణించాయి. తద్వారా ప్రత్యక్ష, పరోక్ష మార్కెట్లలో ధరలు రూ. -300-400 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందాయి. గత సోమవారం ఎన్సీడిఇఎక్స్ వద్ద ధనియాల జూలె వాయిదా రూ. 10,220 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 462 వృద్ధిచెంది రూ. 11,382, ఆగస్టు వాయిదా రూ. 332 పెరిగి రూ. 11,482 వద్ద ముగిసింది. 

విస్తీర్ణం తగ్గడంతో వేరుశనగ ధరలు బలోపేతం

Image
  హైదరాబాద్ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ నివేదికలో ప్రస్తుత సీజన్లో జూన్ 30 వరకు దేశంలో వేరుసెనగ విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవ ధితో పోలిస్తే 18.28 ల.హె. నుండి తగ్గి 13.71 ల.హ.లకు చేరింది. గుజరాత్ ప్రభుత్వం 2021-22 కోసం జారీ చేసిన నాల్గవ ముందస్తు అంచనాప్రకారం ఖరీఫ్ సీజన్లో వేరుసెనగ ఉత్పత్తి 43.59 ల.ట, యాసంగిలో 1.38 ల.ట. కలిసి 44.95 లక్షల టన్నుల ఉత్పత్తిని అంచనా వేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఎటా, మెన పురి, ఫరూఖాబాద్ లాంటి ప్రాంతాలలో 1 లక్ష బస్తాల యాసంగి కొత్త పేరుసెనగ రాబడి కాగా, ఇటీవలె కురిసిన వర్షాల వలన సరుకు నిమ్ముగా ఉన్న నేపథ్యంలో ఎండు సరుకుకు మంచి డిమాండ్ రావడంతో ఎండు. రూ.500-500, హెచ్పీఎస్ గింజలు 60-70 కౌంట్ రూ. 8300, గుజరాత్ డెలివరి రూ. 8500, ఝాన్సీలో 5-8 వేల బస్తాల రాబడిపై రూ. 5400-6300 ప్రతి క్వింటాలు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది.

మెంతులు

Image
  గత వారం గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్లో ఒత్తిడికి గురైన అమ్మకాలు, కనుమరుగైన కొనుగోలుదారులతో మెంతుల ధరలు కుంగుబాట పట్టాయి. ఈసారి ఉత్పత్తి సంతృప్తికరంగా ఉన్నందున రైతుల వద్ద మూలుగుతున్న సరుకు సెప్టెంబర్ తర్వాతనే అమ్మకాలు ప్రారంభం కాగలవని వ్యాపారులు భావిస్తున్నందున వరుకు కొనుగోలుకు స్టాకిస్టులు ముఖం చాటేస్తున్నారు. సీజన్ ప్రారంభం కంటే ముందే ధరలు పతనమవుతున్నాయి. 

అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన మినుముల ధరలు

Image
    వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి వివరాల ప్రకారం జూలై 1 వరకు దేశంలో అపరాల విస్తీర్ణం గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 26.23 ల.హె. నుండి పెరిగి 28.06 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో మినుము పంట విస్తీర్ణం 3.79 ల.హె. నుండి తగ్గి 3.45 ల.హె.లకు చేరింది. గత ఏడాది ఆలస్యంగా పంట విత్తడం వలన పంట కోతల సమయంలో వర్షాలు కురవడంతో సరుకు నాణ్యత లోపించి తద్వారా రైతులకు తక్కువ ధర లభించింది. దీనితో కర్ణాటక, మహారాష్ట్ర రెత్తులు సోయాబీన్, పత్తి పంటల సాగుకు మొగ్గుచూపడంతో మినుము పంట విస్తీర్ణం తగ్గినందున ఉత్పత్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీనితో ప్రస్తుతం ధరలు పెరుగుతున్నాయి. కొత్త సీజన్ ప్రారంభం వరకు మరో రూ.700-800 వృద్ధి చెందే అంచనా కలదు.

ఎగుమతి డిమాండ్తో బలపడిన నువ్వులు

Image
   ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జూన్ 30 వరకు దేశంలో నువ్వుల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1.08 ల.హె. నుండి తగ్గి 97 వేల హెక్టార్లకు పరిమితమైందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ నివేదికలోపేర్కొన్నది. గుజరాత్లో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నువ్వుల ఉత్పత్తి ముందస్తు అంచనా ప్రకారం 33,270 టన్నులు, యాసంగి ఉత్పత్తి 9,971టన్నులు కలిసి మొత్తం 42,241 టన్నులు ఉండగలదనే అభిప్రాయం వ్యక్తం చేసింది.

విస్తీర్ణం తగ్గడంతో కందులు పటిష్ఠం

Image
  వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి వివరాల ప్రకారం దేశంలో కంది. పంట విస్తీర్ణం గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 12-22 ల.హె. నుండి తగ్గి 10.57 ల.హె.లకు చేరింది. అయితే కర్ణాటకలో 3.62 లక్షల హెక్టార్లు, మహారాష్ట్రలో 4.72 ల.హె. ఉంది. కొన్ని రాష్ట్రాలలో పంట విత్తడం కొనసాగుతున్నందున విస్తీర్ణం గత ఏడాది మాదిరిగానే ఉండే అంచనా కలదు.

బలోపేతం చెందిన ఆముదాల వాయిదా ధరలు

Image
 గుజరాత్లో 2021-22 సీజన్ కోసం ఆముదాల ముందస్తు ఉత్పత్తి అంచనా 14.01 అ.ట. ఉండగలదని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో తమ అభిప్రాయం వ్యక్తం చేసింది. గత సోమవారం ఎన్ సిడి ఇఎక్స్ వద్ద జూలై వాయిదా రూ. 7200 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 325 వృద్ధి చెంది రూ. 7526, ఆగస్టు వాయిదా రూ.280 పెరిగి రూ. 7574 వద్ద ముగిసింది.

పెసల ఉత్పత్తి పెరిగే సూచన

Image
 దేశవ్యాప్తంగా ప్రస్తుత యాసంగి సీజన్ కోసం పంజాబ్ సహా,ఇతర ఉత్పాదక రాష్ట్రాలలో పంట ఉత్పత్తి పెరిగింది. రెతులకు మద్దతు ధరకు ధీటుగా ధర లభించడంతో ప్రస్తుత ఖరీఫ్ లో విస్తీర్ణం పెరుగుతుంది. రాజస్థాన్లో సరుకు నిల్వ చేసిన రెత్తులు తమ సరుకు విక్రయిస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్లో రాజస్థాన్లో పెసర పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 3.81 ల.హె. నుండి పెరిగి 6.23 ల.హె.కు విస్తరించింది. అయితే కర్ణాటకలో 2.75 ల.హె. నుండి పెరిగి 3.03 ల.హె. లకు చేరడంతో దేశంలో మొత్తం విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 8.17 ల.హె. నుండి పెరిగి 10.76 ల.హె.లకు చేరింది.

రాణిస్తున్న బెల్లం కొనుగోళ్లు

Image
   తెలంగాణలో ప్రారంభమైన బోనాల పండుగ డిమాండు అధిగమించేందుకు దిగ్గజ వ్యాపారులచే బెల్లం కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. దీని తర్వాత గురు పౌర్ణమి మరియు పండుగల సీజన్. తరుముకొస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రైతులు చౌక ధరతో తమ ఉత్పత్తులను విక్రయించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. కావున బెల్లం ధరలపై కమ్ముకున్న మందగమన ఛాయలు : తొలగినట్లేనని వ్యాపారులు భావిస్తున్నారు. గడిచిన రెండు నెలలుగా ధరలు కేవలం 100-150 ఒడిదొడుకుల మధ్య కదలాడుతున్నదని వ్యాపారులు పేర్కొన్నారు.

ఊపందుకున్న శనగల కొనుగోళ్లు - పురోగమిస్తోన్న ధరలు

Image
  దేశంలో ఈసారి నైరుతి రుతుపవనాల వర్షాలు తగ్గినందున ఖరీఫ్ రాం వెనుకబడింది. ఇందులో మినుములు, కందుల విస్తీర్ణం తగ్గినందున శనగలకు మద్దతు లభిస్తున్నది. ఇదే సమయంలో ధరలపై స్టాకిస్టులు బిగిస్తున్న పట్టు మరియు పప్పు మిల్లుల డిమాండ్తో శనగల ధర ప్రతి క్వింటాలుకురూ. 150-200, కాబూలీ శనగలు రూ. 300 వృద్ధి చెందాయి.

గసగసాలు

Image
  హైదరాబాద్ వ్యాపారస్తుల కథనం ప్రకారం టర్కీ నుండి గసగసాల సర ఫరా పెరగడంతో మార్కెట్లలో కిరాణా వ్యాపారులు తమ అవసరాలకు అనుగు ణంగా సరుకు కొనుగోలు చేస్తున్నందున గత వారం దేశీయ సరుకు ధర రూ.3000-4000 ప్రతి క్వింటాలుకు తగ్గాయి.

త్వరలో యాలకులు పంటకోతలు ప్రారంభం

Image
  లభించిన సమాచారం ప్రకారం రాబోవు సీజన్ కోసం త్వరలో వెంట కోతలు ప్రారంభం కానున్నాయి. ఇంతవరకు వంట పరిస్థితి మెరుగ్గా ఉండడంతో రెత్తుల సరుకు అమ్మకాలు పెరగడం వలన గత వారం కూడా వేలాలలో 5,09,016 కిలోల సరుకు రాబడి కాగా, 4,70,483 కిలోల సరుకు అమ్మకం అయింది. రెత్తు లకు మంగళవారం నాడు కనిష్ట ధర రూ. 747.20, గరిష్ట ధర శుక్రవారం రూ. 847,46 ప్రతి కిలో ధరతో వ్యాపారమైంది. బుధవారం నాడు నాణ్యమైన రకాలకు కనిష్ట ధర రూ. 1121, శుక్రవారం గరిష్ట ధర రూ.1446 లభించింది. ఆగస్టు వరకు రాబడులు ఇదే విధంగా కొనసాగే అవకాశం కలదు.

కొబ్బరి

Image
  ఆంధ్రప్రదేశ్లోని అంబాజీపేటలో గత వారం 8-10 వాహనాల కొబ్బరి రాబడిపై స్థానికంగా రూ. 8300-8400, మీడియం రూ.7800-7900, యావరేజ్ సరుకు రూ. 6900 మరియు 10-12 వాహనాలు కొబ్బరికాయలు నాణ్యమైన సరుకు ప్రతి 1000 కాయలు రూ. 7900-8000, మీడియం రూ. 7200-7400, పాత సరుకు రూ.8800-8900, మీడియం రూ.8300-8400 మరియు పాలకొల్లులో ప్రతి రోజు 25-30 వాహనాలు పెద్ద కాయలు రూ. 9800-9000, మీడియం రూ. 7500-8000, యావరేజ్ సరుకు రూ.5600-8000, పాత సరుకు రూ. 9400, మీడియం రూ.8500-8600, యావరేజ్ సరుకు రూ. 8900–7000 ధరతో మహారాష్ట్ర, రాజస్తాన్ కోసం రవాణా అవుతున్నది. తమిళనాడులోని వెల్లకోవిల్, జలకందాపురం, అన్నామలై, బోతపాడి, కొడుముడి ప్రాంతాలలో గత వారం కేవలం 5 వేల బస్తాల కొబ్బరి రాబడిపై రూ.8300–8760, పెరుందురైలో 8 వేల బస్తాలు రూ. 8656-8935 ప్రతి క్వింటాలుధరతో వ్యాపారమైంది.

46 కోట్ల డాలర్లకు చేరిన ఉల్లి ఎగుమతులు

Image
   బంగ్లాదేశ్, నేపాల్ లాంటి దేశాల నుండి ఉల్లికి పెరిగిన డిమాండ్ మరియు లాభసాటి ధరలు లభించినందున 2021-22 లో భారత్ నుండి ఉల్లి ఎగుమతులు డాలర్ రూపేణా గడిచిన మూడేళ్లలో గత ఏడాదితో పోలిస్తే 37.80 కోట్ల డాలర్ నుండి 22 శాతం వృద్ధి చెంది 46 కోట్ల డాలర్లకు చేరగా పరిమాణం దృష్ట్యా స్వల్పంగా తగ్గి 15.37 రి.ట.కు పరిమితమయ్యాయి. భారత్కు 2021-22 లో బంగ్లాదేశ్ అతిపెద్ద కొనుగోలు దేశంగా ముందు వరుసలో నిలిచింది. 2020-21 లో 5.52 ల.ట. ఉల్లి కొనుగోలు చేపట్టగా 2021-22 లో 19 శాతం వృద్ధి చెంది 6.58 ల.ట. దిగుమతి చేసుకున్నది.

అవరాల ధరలపై తొలగిన నీలినీడలు

Image
  అపరాల శ్రేణిలోని మినుములు, పెసలు మరియు కందుల ధరలు మందగమన ఛాయలు తొలగి పురోగమన దిశలో పయనించడం ప్రారంభిస్తున్నాయి. ఉత్తర కర్ణాటక, మరాఠ్వాడ, విదర్భలో సమయానుకూలంగా వర్షాలు కురవనందున పెసలు, మినుముల కోసం ఖరీఫ్ సీజన్లో చేపట్టాల్సిన తరుణం మించిపోవడటమే ఇందుకు నిదర్శనం. ఖరీఫ్ సేద్యం చేపట్టడంలో జాప్యమైనట్లయితే పంట పక్వానికి వచ్చే దశలో కురిసే భారీ వర్షాలకు పంట నాణ్యత కొరవడుతుంది.

పామాయిల్ సరఫరా పెరగడంతో తగ్గనున్న డిమాండ్

Image
 ఏడాది ఏప్రిల్ 29న ఇండోనేషియా తమ పామాయిల్ ఎగుమతులపై ఆంక్షలు విధించినందున ధర ప్రతి టన్ను 7069 రింగిట్ (1806.71 డాలర్) కు ఎగబాకిందని వ్యాపారులు పేర్కొన్నారు. తద్వారా ఆయిల్ పామ్ పూల గుత్తుల (ఎఫ్ఎఫ్ఎ) కోసం కొనుగోలుదారులు కనుమరుగైనందున పామాయిల్ నిల్వలు పెరిగి 70 ల.ట.కు చేరాయి. పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వం ఎగుమతులపై ఉన్న ఆంక్షలను మే 24న ఎత్తివేసింది. 

పురోగమిస్తున్న పసుపు వాయిదా ధరలు

Image
  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో రుతుపవనాల వర్షాలు జాప్యమైనందున పసుపు సేద్యం క్షీణించే అంచనాతో పెరిగిన చిన్నతరహా మసాలా యూనిట్ల కొనుగోళ్లు, నెలకొన్న ఎగుమతి డిమాండ్తో ధర ప్రతి క్వింటాలుకు రూ. 150-200 వృద్ధి చెందింది. ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం జూలై వాయిదా రూ. 7772 ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 128 క్షీణించి రూ. 7900, ఆగస్టు వాయిదా రూ. 136 లాభంతో రూ. 8000 వద్ద ముగిసింది.

భారీగా విస్తరించనున్న పత్తి సేద్యం

Image
  తమిళనాడు రైతులకు ఈసారి పత్తి పంటపై లాభాసాటి ధరలు గిట్టుబాటైనందున డెల్టా జిల్లాలలో పత్తి సేద్యం గత ఏడాదితో పోలిస్తే అదనంగా 40 శాతం మేర విస్తరించగలదని సంకేతాలు అందుతున్నాయి. యాసంగిలో వరి సేద్యానికి బదులు పత్తి సేద్యం చేపట్టినట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. తద్వారా ట్రిచి, తిరువలూరు, నాగపట్నం మరియు తంజావూరులో పత్తి సేద్యం గత ఏడాదితో పోలిస్తే 50 వేల ఎకరాల నుండి 84 వేల ఎకరాలకు విస్తరించినట్లు తెలుస్తోంది.

మొక్కజొన్న విక్రయించేందుకు దిగ్గజ రైతులు విముఖత - బలపడుతున్న ధరలు

Image
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జూలై 1 నాటికి దేశవ్యాప్తంగా మొక్కజొన్న సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 3.06 ల.హె. తగ్గి 19.03 ల.హె.కు విస్తరించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. కర్ణాటకలో గత ఏడాదితో పోలిస్తే 30 వేల హెక్టార్లు తగ్గి 7.18 ల.హె.కు పరిమితమైంది.గుజరాత్లో మొక్కజొన్న ఉత్పత్తి ఖరీఫ్ సీజన్ కోసం 5.74 ల.ట., గ్రీష్మకాలంలో 2.28 ల.ట. కలిసి మొత్తం 8.03 ల.ట. ఉండగలదని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పై తమ ముందస్తు అంచనాలో పేర్కొన్నది. ఆంధ్రప్రదేశ్లోని తెనాలి మరియు పరిసర ప్రాంతాలలో మొక్కజొన్న రాబడులు చరమాంకంలో పడ్డాయి. ఎందుకనగా, భవిష్యత్తులో ధరలు భారీగా పెరిగే అంచనాతో సరుకు విక్రయించేందుకు దిగ్గజ రైతులు విముఖత వ్యక్తం చేస్తుండడమే ఇందుకు నిదర్శనం. తద్వారా స్థానిక పార్టీ పరిశ్రమలు రూ.2450 ప్రతి క్వింటాలు ధరతో కొనుగోలు చేస్తున్నారు.

కొనుగోలుదారులు కరు వై చతికిలబడిన చింతపండు ధరలు

Image
  దేశంలోని చింతపండు ఉత్పాదక ప్రాంతాలలో సరుకు నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి. వ్యాపారులు తమ నిల్వ సరుకు విక్రయించేందుకు ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ కొనుగోలుదారులు కనుమరుగయ్యారు. అయితే రంగు వెలిసిన సరుకు కోసం డిమాండ్ నెలకొన్నందున నాణ్యమైన సరుకు విక్రయాలు మందగించాయి. 

వాము

Image
 వర్షాకాలం ప్రారంభంతో పాటు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్,బీహార్, రాజస్తాన్, ఝార్ఖండ్ లాంటి వాము ఉత్పాదక రాష్ట్రాలలో గిరాకీ నెలకొన్నందున ఉత్పాదక ప్రాంతాలలోని మార్కెట్లలో ధర ప్రతి క్వింటాలుకు రూ. 400-500 వృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు మార్కెట్లో గత మంగళ, శుక్రవారాలలో కలిసి 2200-2300 బస్తాల వాము రాబడిపై ఎరుపు. సరుకు మీడియం రూ. 9800-10,500, తెలుపు రూ. 10,600-12,000, నాణ్యమైన సరుకు రూ. 13,000-14,500, ఆకుపచ్చ సరుకు రూ. 15,500-16,000 ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది. మధ్య ప్రదేశ్లోని నీమచ్లో గుజరాత్ నుండి గత వారం 1000-1200 బస్తాల సరుకు రాబడి కాగా, మీడియం యావరేజ్ రూ. 9000-9500, మీడియం రూ. 10,000-11,800, నాణ్యమైన సరుకు రూ.12,000-12,500, ఆకుపచ్చ సరుకు రూ. 13,200-13,500, జార్రాలో 100-150 బస్తాల సరుకు అమ్మకంపై రూ. 91000-11,000, పోహరిలో 150-200 బస్తాలు యావరేజ్ సరుకు రూ. 7000-7500, మీడియం బెస్ట్ రూ.8500-9000 మరియు గుజరాత్లోని జామ్నగర్ లో గత వారం 1800-2000 బస్తాల సరుకు రాబడిపై యావరేజ్ రూ. 1850 - 9000, మీడియం రూ. 10,500-11,000, మీడియం బెస్ట్ రూ.. 11,500-12,000 ప్రతి క్వింటాలు ధరత

ఆంధ్ర, తెలంగాణ లో మిర్చి విస్తీర్ణం భారీగా తగ్గే సూచన

Image
  వ్యాపారస్తుల కథనం ప్రకారం ఈ ఏడాది ఆంధ్ర, తెలంగాణ లలో మిరప విత్తనాల అమ్మకాలు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో 2022-23 సీజన్లో ఉత్పత్తి భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. కొందరు రైతుల అభిప్రాయం ప్రకారం గత ఏడాది మాదిరిగా వచ్చే సీజన్లో కూడా పంటకు చీడపీడల బెడద ఉండగలదని భావిస్తూ, రెత్తులు మిరప స్థానంలో పత్తి లాంటి ఇతర పంటల సాగుకు మొగ్గుచూపుతున్నారు. ఎందుకనగా దిగుబడి తగ్గడం వలన సీజన్లో నాణ్యమైన సరుకుకు రూ. 18,000-20,000 ప్రతి క్వింటాలు ధర లభించినప్పటికీ, గిట్టుబాటు ఉండదు. ఈ ఏడాది దక్షిణ భారతంలో ఉత్పత్తి తగ్గడం మరియు వచ్చే ఏడాది కూడా ఉత్పత్తి తగ్గినట్లయితే, 2022 దీపావళి నాటికి మిరప ధరలు రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉంది. 

𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 01-07-2022 🌶️

Image
𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 01-07-2022 🌶️ *(A/C ARRIVALS 14000 BAGS)*

𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 01-07-2022 🌶️

Image
𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 01-07-2022 🌶️ *ARRIVAL 300 TO 500 BAGS* 

𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 01-07-2022 🌶️

Image
𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 01-07-2022 🌶️ *(NON A/C ARRIVALS APPROX 2000/3000 BAGS)*