అవరాల ధరలపై తొలగిన నీలినీడలు

 


అపరాల శ్రేణిలోని మినుములు, పెసలు మరియు కందుల ధరలు మందగమన ఛాయలు తొలగి పురోగమన దిశలో పయనించడం ప్రారంభిస్తున్నాయి. ఉత్తర కర్ణాటక, మరాఠ్వాడ, విదర్భలో సమయానుకూలంగా వర్షాలు కురవనందున పెసలు, మినుముల కోసం ఖరీఫ్ సీజన్లో చేపట్టాల్సిన తరుణం మించిపోవడటమే ఇందుకు నిదర్శనం. ఖరీఫ్ సేద్యం చేపట్టడంలో జాప్యమైనట్లయితే పంట పక్వానికి వచ్చే దశలో కురిసే భారీ వర్షాలకు పంట నాణ్యత కొరవడుతుంది.


 గతానుభవాల ఫలితమే ప్రస్తుతం సేద్యం చేపట్టలేకపోతున్నట్లు ఉత్పాదకులు పేర్కొంటున్నారు. దీనికి బదులు సోయాచిక్కుడు, పత్తి సేద్యం పట్ల రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదే విధమైన అభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మిర్చి రైతులు ప్రత్యామ్నాయం వైపు తొంగిచూస్తున్నందున మిర్చి విత్తుల అమ్మకాలు 35-40 శాతం క్షీణించినట్లు విత్తన వ్యాపారులు తెలిపారు. కావున మిర్చి ఉత్పత్తి కూడా తగ్గనున్నట్లు సంకేతాలు. అందుతున్నాయి.

Comments

Popular posts from this blog