కొత్త పెసల రాబడితో తగ్గిన ధరలు

దేశవ్యాప్తంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఆగస్టు 19 నాటికి పెసల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 33.96 ల.హె. నుండి తగ్గి 32,40 ల.హె.కు పరిమితమైందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. ఇందులో గుజరాత్ సేద్యం ఆగస్టు 15 నాటికి 97,000 హెక్టార్ల నుండి తగ్గి 75,933 హెక్టార్లకు పరిమితమైంది. 2021-22 (జూలై-జూన్) సీజన్లో దేశంలో పెసల ఉత్పత్తి 31.50 ల.ట., ఇందులో ఖరీఫ్ సీజన్ ఉత్పత్తి 16-17 ల.ట. ఉండగలదని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ నాల్గవ ముందస్తు అంచనాలో పేర్కొన్నది.