కొత్త పెసల రాబడితో తగ్గిన ధరలు

 



 దేశవ్యాప్తంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఆగస్టు 19 నాటికి పెసల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 33.96 ల.హె. నుండి తగ్గి 32,40 ల.హె.కు పరిమితమైందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. ఇందులో గుజరాత్ సేద్యం ఆగస్టు 15 నాటికి 97,000 హెక్టార్ల నుండి తగ్గి 75,933 హెక్టార్లకు పరిమితమైంది. 2021-22 (జూలై-జూన్) సీజన్లో దేశంలో పెసల ఉత్పత్తి 31.50 ల.ట., ఇందులో ఖరీఫ్ సీజన్ ఉత్పత్తి 16-17 ల.ట. ఉండగలదని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ నాల్గవ ముందస్తు అంచనాలో పేర్కొన్నది. 


అయితే, ఖరీఫ్ సీద్యం గత ఏడాదికి ధీటుగా ఉన్నందున మరియు సానుకూల వాతావరణంతో ఉత్పత్తి 15 ల.ట. ఉండగలదని వ్యాపారులు భావిస్తున్నారు. కర్ణాటకలోని గదగ్, బాగల్కోట్ మరియు మహారాష్ట్రలోని కొన్ని ఉత్పాదక ప్రాంతాలలో రాబడులు స్వల్పంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 17-20 శాతం నిమ్ము సరుకు రాబడి అవుతున్నది. అయితే, నిమ్ము 12 శాతానికి తగ్గేందుకు వ్యాపారులు నిరీక్షిస్తున్నారు. కావున గత వారం ధర ప్రతి క్వింటాలుకు రూ. 200-300 పతనమైంది.


ఆంధ్రప్రదేశ్ లోని పొన్నూరులో పెసలు పాలీష్ సరుకు రూ. 6900, అన్-పాలిష్ రూ. 6750, మధ్య ప్రదేశ్లోని అన్ని ఉత్పాదక కేంద్రాల వద్ద కలిసి ప్రతి రోజు 2-3 వేల బస్తాల పెసల రాబడిపై రూ. 6000-6450, ఇండోర్లో రూ. 6000-6600, జల్గాంవ్లో మధ్య ప్రదేశ్ పెసలు యాసంగి సరుకు 6100, మహారాష్ట్ర నాణ్యమైన సరుకు 7300 - 7950, మీడియం రూ. 6700, గుల్బర్గా పెసరపప్పు బెంగుళూరు డెలివరి రూ. 8200-8800, రాజస్తాన్ పెసలు రూ. 8400-8500 మరియు రాజస్తాన్లోని కేక్, జోధ్ పూర్, కిషన్ గఢ్ ప్రాంతాలలో 600-700 బస్తాలు రూ. 4000-6500, జైపూర్లో రూ.4500-6800, పప్పు రూ. 8000-8300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog