గతవారం పసుపు ఉత్పాదక కేంద్రాలైన ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్రలలో భారీ వర్షాల వలన రాబడులు తగ్గినప్పటికీ, ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే ఎన్ డి ఇ ఎక్స్ వద్ద గత సోమవారం ఆగస్టు వాయిదా సోమవారం నాడు 7680తో ప్రారంభమైన తరువాత శుక్రవారం నాటికి రూ. 20 వృద్ధిచెంది రూ. 7700, సెప్టెంబర్ వాయిదా రూ. 50 పెరిగి రూ. 7800 వద్ద ముగిసింది. లభించిన సమాచారం ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో విదేశాలకు పసుపు ఎగుమతులు ముందు సంవత్సరంతో పోలిస్తే 16.70 శాతం తగ్గి 1,53,154 టన్నులకు చేరాయి. 2022-23లో (ఏప్రిల్-మే) ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే 26,881 టన్నుల నుండి 14-90 శాతం పెరిగి 30,639 టన్నులకు చేరాయి. ఏప్రిల్లో 13,762 టన్నుల సరుకు ఎగుమతి కాగా, మే నెలలో పసుపు ఎగుమతులు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 13,598 టన్నుల నుండి 3500 టన్నులు పెరిగి 17,137 టన్నులకు చేరాయి.