డీలా పడుతున్న పసుపు వాయిదా ధరలు

 



 గత వారం కొందరు స్టాకిస్టుల అమ్మకాలపై ఒత్తిడి పెరిగినందున డిమాండ్ తగ్గి సాధారణంతో పోలిస్తే పసుపు అమ్మకాలు భారీగా తగ్గాయి. ఫలితంగా పరోక్ష విపణిలో ధర ప్రతి క్వింటాలుకు రూ.300-350, ప్రత్యక్ష విపణిలో రూ. 100–150 పతనమైంది.


ఎన్సీడిఇఎక్స్ వద్ద గత సోమవారం ఆగస్టు వాయిదా రూ.7302 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 344 కోల్పోయి రూ. 6958, సెప్టెంబర్ వాయిదా రూ. 106 నష్టంతోరూ. 7314 వద్ద ముగిసింది.


తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గత సోమ మరియు బుధవారాలలో కలిసి 5 వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు రూ. 6500-7500, దుంపలు రూ. 5800-6300 లోకల్ లూజ్ మరియు కొమ్ములు పాలిష్ సరుకు లారీ బిల్టి రూ. 7900-8000, దుంపలు రూ. 7200-7300, బంగ్లాదేశ్ కోసం కొమ్ములు రూ. 7300, వరంగల్ లో 600-700 బస్తాలు కొమ్ములు రూ. 4400-5850, దుంపలు రూ. 4000-5500, కేసముద్రం మార్కెట్లో 400-500 బస్తాల సరుకు  రాబడిపై కొమ్ములు రూ. 5000-6000, దుంపలు రూ. 5000-5600 మరియు 

ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాలలో 800-1000 బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు మరియు దుంపలు రూ. 5650-5850 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తమిళనాడులోని ఈరోడ్ మార్కెట్లో గత వారం 12-13 వేల బస్తాల సరుకు రాబడి పై కొమ్ములు రూ. 6265-8000, దుంపలు రూ. 5900-7000, పెరుందురైలో 2500 బసాలు కొమ్ములు రూ. 5842-7939, దుంపలు రూ. 5612-6979 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో గత వారం 7-8 వేల బస్తాల సరుకు అమ్మకంపై రాజాపురి పసుపు నాణ్యమైన సరుకు రూ.7500-8500, దేశీకడప రకం రూ.6000-6500, హింగోళిలో గత శుక్రవారం 6-7 వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు రూ. 6200-7000, దుంపలు రూ. 6100-6400, నాందేడ్లో 3-4 వేల బస్తాలు కొమ్ములు రూ. 6000-7000, దుంపలు రూ. 5800-6300, బస్మ త్నగర్లో 2 వేల బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు రూ. 6000-7000, దుంపలు రూ. 5600-6200 ధరతో వ్యాపారమైంది.



Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు