వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి తాజా నివేదిక ప్రకారం దేశంలో సెప్టెంబర్ 16 నాటికి కంది పంట సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 47.95 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 45.73 లక్షల హెక్టార్లకు పరిమితమైంది. తెలంగాణలో కంది పంట సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 9,02,489 ఎక రాల నుండి తగ్గి 5,58,826 ఎకరాలకు మరియు గుజరాత్ లో 2,29,028 హెక్టార్ల నుండి తగ్గి 2,23,978 హెక్టార్లకు చేరింది. అయితే కర్ణాటకలో వర్షాల వలన పంటకు నష్టం చేకూరడంతో ఉత్పత్తి తగ్గే అవకాశం కలదు. దేశంలో కందుల లభ్యత కనీస స్థాయికి చేరింది. దిగుమతి విధానం కారణంగా మయన్మార్ లో కూడా నిల్వలు తగ్గాయి. ఆఫ్రికాలో పంట నాణ్యంగా లేనందున మిల్లర్లు సరుకు కొనుగోలుకు ముందుకు రావడం లేదు. గత వారం కందులు, పప్పు ధరలు రూ. 300-400 ప్రతి క్వింటా లుకు పెరిగాయి.